E-Paper
Advertisement

Dhurandhar 2: యుద్ధం వల్ల ధురంధర్ 2 సినిమా పోస్ట్ పోన్.. నిజమెంత..!

Dhurandhar 2: యుద్ధం వల్ల ధురంధర్ 2 సినిమా పోస్ట్ పోన్.. నిజమెంత..!
Advertisement

Dhurandhar 2: మిడిల్ ఈస్ట్ లో జరుగుతున్న యుద్ధ పరిస్థితుల కారణంగా కొన్ని పెద్ద సినిమాల విడుదల తేదీలు మారుతున్నాయి. అయితే బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ నటించిన ధురంధర్ 2.. సినిమా ముఖ్యంగా యుద్ధం వల్ల పోస్ట్ పోన్ కానుంది అన్న వార్తలు తెగ వినిపిస్తూ వస్తున్నాయి.

దురంధర్ 2 రిలీజ్ డేట్..!

కానీ ఈ సినిమా యూనిట్ మాత్రం తన విడుదల తేదీని మార్చకుండా ముందుకు సాగుతోంది. మార్చి 19న ఈ సినిమా థియేటర్లలో విడుదల అవుతుందని నిర్మాతలు తాజాగా ప్రకటించారు.

Advertisement

ఇటీవల కన్నడ స్టార్ యష్ నటించిన టాక్సిక్ సినిమా విడుదల వాయిదా పడింది. ఈ చిత్రం మొదట మార్చి 19న విడుదల కావాల్సి ఉండగా.. మధ్యప్రాచ్య దేశాల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా జూన్ 4కు మార్చారు. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల వల్ల ఆ ప్రాంతాల్లో విమాన ప్రయాణాలు.. సాధారణ కార్యకలాపాలు ప్రభావితమయ్యాయి. దీంతో అక్కడి మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని టాక్సిక్ చిత్రాన్ని వాయిదా వేయాలని నిర్మాతలు నిర్ణయించారు.

కానీ ధురంధర్ 2 చిత్రానికి ఈ పరిస్థితి పెద్దగా ప్రభావం చూపదని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమా గల్ఫ్ దేశాల్లో విడుదల అయ్యే అవకాశం చాలా తక్కువగా ఉంది. ఎందుకంటే ఈ సినిమా కథలో పాకిస్తాన్‌ను ఉగ్రవాదానికి ఆశ్రయం ఇచ్చే దేశంగా చూపించినట్లు తెలుస్తోంది. గల్ఫ్ దేశాలు సాధారణంగా పాకిస్తాన్‌తో మంచి సంబంధాలు కలిగి ఉండటంతో, అలాంటి కథలున్న సినిమాలను అక్కడ విడుదల చేయడానికి అనుమతులు ఇవ్వరు.

Advertisement

అందువల్ల మధ్యప్రాచ్యంలో పరిస్థితులు ఎలా ఉన్నా ధురంధర్ 2 సినిమాకు పెద్దగా సమస్య ఉండదని నిర్మాతలు భావిస్తున్నారు. ఇదే కారణంగా ఈ చిత్రం తన అసలు విడుదల తేదీ అయిన మార్చి 19నే థియేటర్లలోకి రావడానికి సిద్ధంగా ఉంది.

ఈ చిత్రాన్ని దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కిస్తున్నారు. ఇందులో రణవీర్ సింగ్‌తో పాటు అర్జున్ రాంపాల్, ఆర్ మాధవన్, సంజయ్ దత్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్‌ను మార్చి 7న విడుదల చేయనున్నారు.

ఇక టాక్సిక్ సినిమా విషయానికి వస్తే, ఇది కేజీఎఫ్ సిరీస్ తర్వాత యష్ చేస్తున్న పెద్ద చిత్రం కావడంతో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో కియారా అద్వాని, నయనతార, తారా సుతారియా, హుమా ఖురేషీ, రుక్మిణి వసంత్ వంటి ప్రముఖ నటీమణులు కూడా నటిస్తున్నారు.

ALSO READ: Ustaad Bhagat Singh:ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ పై హరీష్ శంకర్ అప్డేట్.. అలా చేయక తప్పట్లేదు అంటూ..!

Related News

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

Big Stories

Advertisement
×