E-Paper
Advertisement

Sharwanand Divorce: విడాకుల వార్తలపై క్లారిటీ ఇచ్చిన శర్వానంద్.. అన్ని రూమర్లేనా?

Sharwanand Divorce: విడాకుల వార్తలపై క్లారిటీ ఇచ్చిన శర్వానంద్.. అన్ని రూమర్లేనా?
Advertisement

Sharwanand Divorce: ఇటీవల కాలంలో సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీలు పెద్ద ఎత్తున విడాకులు(Divorce) తీసుకొని విడిపోతున్న సంగతి తెలిసిందే. ఇలా వెండి తెర సెలబ్రిటీలు మాత్రమే కాకుండా బుల్లితెర నటీనటులు కూడా ఎంతోమంది విడాకులు తీసుకుని విడిపోతున్నారు. అయితే గత కొద్దిరోజులుగా టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన నటుడు శర్వానంద్(Sharwanand) తన భార్య రక్షిత రెడ్డికి (Rakshitha Reddy)దూరంగా ఉంటున్నారని, వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారు అంటూ వార్తలు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇలా వీరి విడాకుల గురించి వార్తలు వస్తున్నప్పటికీ శర్వానంద్ మాత్రం ఇప్పటివరకు ఈ వార్తలపై స్పందించలేదు.

కూతురి కోసమే మార్పు..

ఇకపోతే తాజాగా ఈయన తన లుక్ కు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే ఈ ఫోటోలలో గుర్తుపట్టిన విధంగా మారిపోయారు. ఇలా శర్వానంద్ తన లైఫ్ స్టైల్ పూర్తిగా మారిపోవడానికి గల కారణాలను తెలియజేశారు. తాను తండ్రి అయిన తర్వాత పూర్తిగా నా ఆరోగ్యం పై, నా కుటుంబం పై దృష్టి సారించానని తెలిపారు. పాప పుట్టుక ముందు తాను పెద్దగా వర్కౌట్ చేసే వాడిని కాదు కానీ ఇప్పుడు నా కుటుంబం కోసం చాలా ఆరోగ్యంగా స్ట్రాంగ్ గా ఉండాలని కోరుకుంటున్నాను అంటూ ఈయన మాట్లాడారు.

లీలాదేవి మైనేని..

Advertisement

ఇలా కుటుంబం కోసం అంటూ శర్వానంద్ మాట్లాడటంతో ఈయన విడాకుల గురించి వస్తున్న వార్తలు పూర్తిగా ఆ వాస్తవమని చెప్పకనే చెప్పారు. శర్వానంద్ గత రెండు సంవత్సరాల క్రితం రక్షిత రెడ్డి అనే సాఫ్ట్వేర్ ఉద్యోగిని ప్రేమించి ఎంతో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు వీరి వివాహం ఉదయపూర్ లో ఎంతో వైభవంగా జరిగింది. ఇలా పెళ్లయిన వెంటనే శర్వానంద్ తండ్రి కాబోతున్న విషయాన్ని వెల్లడించారు. ఇక ఈ దంపతులకు ఆడబిడ్డ జన్మించిన సంగతి తెలిసిందే. ఈ చిన్నారికి లీలాదేవి మైనేని (Leeladevi Mineni)అనే నామకరణం చేశారు.

నెల వ్యవధిలోనే రెండు సినిమాలు రిలీజ్..

Advertisement

ఇలా తమకు కుమార్తె జన్మించినప్పటికీ ఇప్పటివరకు ఈ దంపతులు తమ పాపకు సంబంధించిన ఫోటోలను కానీ తన ఫేస్ కాని ఎక్కడ రివీల్ చేయలేదు. ఇక శర్వానంద్ కెరియర్ విషయానికి వస్తే ఇటీవల వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈయనకు సరైన సక్సెస్ మాత్రం రాలేదని చెప్పాలి అయితే నెల వ్యవధిలోనే ఏకంగా రెండు సినిమాలు ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. డిసెంబర్ ఆరవ తేదీ శర్వానంద్ నటించిన “బైకర్”(Biker) సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది అలాగే సంక్రాంతి పండుగను పురస్కరించుకొని “నారీ నారీ నడుమ మురారి” అనే సినిమా కూడా విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఇక బైకర్ సినిమా విడుదలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టారు. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.

Also Read: Mowgli Teaser: మగాడిగా పుట్టడమే దరిద్రం రా.. ఆసక్తికరంగా మోగ్లీ టీజర్ !

Related News

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

38ఏళ్ల తర్వాత తండ్రి నాగబాబు రికార్డును రిపీట్ చేసిన నిహారిక!

సైలెంట్ గా నిశ్చితార్థం.. పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరో!

కళ్ళు లేవు.. మైమరిపించే గాత్రానికి నేషనల్ అవార్డు.. ఎవరీ సింగర్?

విజువల్ వండర్ గా రామాయణ ట్రైలర్.. అఫీషియల్ ఎప్పుడంటే?

Big Stories

Advertisement
×