Google Pixel 11 Pro XL: గూగుల్ నుంచి కొత్త ఫోన్ వస్తుందంటే చాలు.. దాని కంటే ముందే లీకులు వచ్చి సోషల్ మీడియాలో రచ్చ చేస్తాయి. ఇప్పుడు Pixel 11 Pro XL వంతు వచ్చింది. తాజాగా ఆండ్రాయిడ్ హెడ్‌లైన్స్ షేర్ చేసిన ఫొటోలు చూస్తుంటే.. గూగుల్ ఈసారి పెద్దగా రిస్క్ తీసుకోలేదని అర్థమవుతోంది. పాత డిజైన్‌నే నమ్ముకుని మార్కెట్లోకి దిగుతున్నట్లు కనిపిస్తోంది. ఇంతకీ ఈ ఫోన్‌లో ఏముందో ఒకసారి చూసేద్దామా.
సాధారణంగా కొత్త ఫోన్ అనగానే ఏదో భారీ మార్పులు ఉంటాయని ఆశిస్తాం. కానీ Pixel 11 Pro XL విషయంలో గూగుల్ ఇఫ్ ఇట్ ఐన్ట్ బ్రోక్, డోంట్ ఫిక్స్ ఇట్ అనే ఫార్ములాను వాడుతున్నట్లుంది. అంటే ఉన్నది బానే ఉన్నప్పుడు మార్చడం ఎందుకు అని. పిక్సెల్ 10 ప్రో ఎక్స్‌ఎల్ డిజైన్‌నే దాదాపు ఇక్కడా వాడారు. కాకపోతే.. వెనక ఉండే కెమెరా బార్‌ను ఈసారి పూర్తిగా నలుపు రంగులోకి మార్చారు. ఇది ఫోన్ బాడీ కలర్‌తో సంబంధం లేకుండా విడిగా కనిపిస్తూ, ఫోన్‌కు ఒక క్లాసీ లుక్‌ను ఇస్తోంది.
Also Read: జస్ట్ రూ.499 మాత్రమే.. boAt ప్రీమియం ఇయర్‌ఫోన్స్‌పై ఫ్లిప్‌కార్ట్ అదిరిపోయే ఆఫర్!
ఈ ఫోన్ కొలతలు చూస్తుంటే.. పాత మోడల్‌కు దీనికి కేవలం వెంట్రుకవాసి తేడా మాత్రమే ఉంది. దీనిని చేతిలో పట్టుకున్నప్పుడు మీకు పెద్దగా తేడా తెలియకపోవచ్చు. 6.8 అంగుళాల పెద్ద స్క్రీన్ అలాగే ఉంటుంది. చుట్టూ ఉండే బెజెల్స్ కూడా అంతే. కాబట్టి గూగుల్ డిజైన్ టీమ్ ఈసారి కాస్త రెస్ట్ తీసుకుందని అనుకోవచ్చు. కొత్తదనం కోసం చూసే వాళ్లకు ఇది కొంచెం నిరాశ కలిగించినా.. పిక్సెల్ స్టైల్ ఇష్టపడే వాళ్లకు మాత్రం ఇది ఓకే అనిపిస్తుంది.
బయట రూపం మారకపోయినా.. ప్రాసెసర్ మాత్రం గట్టిగా ఉండబోతోంది. గూగుల్ సొంతంగా తయారు చేసిన టెన్సర్ G6 చిప్‌ను దీనిలో వాడుతున్నారు. దీనివల్ల ఫోన్ వేగం పెరగడమే కాకుండా, బ్యాటరీ కూడా ఎక్కువ సేపు వస్తుంది. 5,200 mAh బ్యాటరీ అంటే.. ఒకసారి ఛార్జ్ చేస్తే రోజంతా హ్యాపీగా వాడుకోవచ్చు. ఇక RAM విషయంలో 16GB ఉంటుందా లేదా ఖర్చు తగ్గించడానికి 12GBకి మారుస్తారా అన్నది ఇంకా తేలలేదు. కానీ ఫ్లాగ్‌షిప్ ఫోన్ కాబట్టి గూగుల్ మనల్ని డిజప్పాయింట్ చేయదని ఆశిద్దాం.
ప్రస్తుతం అన్ని కంపెనీలు రేట్లు పెంచుకుంటూ పోతున్నాయి. ముఖ్యంగా శాంసంగ్ లాంటి బ్రాండ్ల రేట్లు చూస్తుంటే కళ్లు తిరుగుతున్నాయి. ఇలాంటి టైంలో గూగుల్ గనుక తన ఫోన్ ధరను రూ.1,20,000 నుండి రూ.1,37,000 మధ్యలో ఉంచగలిగితే, కస్టమర్లను ఆకర్షించడం పెద్ద కష్టమేమీ కాదు. కేవలం డిజైన్ మాత్రమే కాకుండా.. గూగుల్ ఇచ్చే సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్, ఆ కెమెరా క్వాలిటీ కోసం జనాలు ఎగబడతారనడంలో సందేహం లేదు.
Also Read: ధర తక్కువే కానీ ఫీచర్లు నెక్స్ట్ లెవెల్.. Redmi A7 Proలో గూగుల్ AI ఫీచర్లు కూడా!