Tanveer Ahmed: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) జరుగుతోన్న నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు ఇండియా పై విషం కక్కుతున్నారు. పాకిస్తాన్ నిర్వహించే PSL ముందు ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ దేనికి పనికి రాదు అంటూ పదే పదే స్పష్టం చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో తాజాగా పాకిస్తాన్ మాజీ క్రికెటర్ తన్వీర్ అహ్మద్ సంచలన ప్రకటన చేశారు. త్వరలోనే ఐసీసీ ( ICC) చైర్మన్ పదవిని తాను చేపట్టబోతున్నట్లు వెల్లడించారు. ఎప్పుడైతే చైర్మన్ పదవి వస్తుందో.. ఆ వెంటనే టీమిండియా పై బ్యాన్ వేసి నడిరోడ్డుకు ఈడ్చుతానంటూ శపథం చేశారు తన్వీర్ అహ్మద్ ( Tanveer Ahmed). పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ ( Pakistan Super League 2026 )కు అంతర్జాతీయ గుర్తింపు ఇస్తానని వెల్లడించారు.
Also Read: IPL 2026: KKRపై సన్ రైజర్స్ బంపర్ విజయం..పాకిస్తాన్ లో సంబరాలు, తగలబడుతున్న బంగ్లాదేశ్
టీమిండియా జట్టును ఓర్వలేక మరోసారి పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ తన్వీర్ అహ్మద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జై షా పదవి ముగిసిన తరువాత, తానే ఐసీసీ చైర్మన్ కాబోతున్నట్లు ప్రకటన చేశారు. 2027 తర్వాత ఐసీసీ బాస్ తానేనని వెల్లడించారు. అయితే ఐసీసీ చైర్మన్ పదవి చేపట్టిన తర్వాత వెంటనే టీమిండియా పై ఆంక్షలు విధిస్తానని హెచ్చరించారు. అవసరమైతే ఇండియా పై బ్యాన్ కూడా విధిస్తానని తెలిపారు. భారత క్రికెట్ నియంత్రణ మండలిని ఏకాకిని చేసి నడిరోడ్డుకు ఈడ్చుతానని శపథం చేశారు తన్వీర్ అహ్మద్. ఇకపై ఐసీసీ టోర్నమెంట్లు గెలవకుండా కట్టడి చేస్తానని.. టీమిండియాకు వార్నింగ్ బెల్స్ పంపారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ పైన కూడా కచ్చితంగా చర్యలు తీసుకుంటానని వెల్లడించారు. అదే సమయంలో పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ కు అంతర్జాతీయ గుర్తింపు వచ్చేలా చర్యలు తీసుకుంటానని స్పష్టం చేశారు తన్వీర్ అహ్మద్.
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ గా ప్రస్తుతం జై షా ఉన్న సంగతి తెలిసిందే. 2024 డిసెంబర్ మాసంలో ఈ పదవిని చేపట్టారు అమిత్ షాక్ కుమారుడు జై షా. అంతకుముందు భారత క్రికెట్ నియంత్రణ మండలి అధ్యక్షుడిగా కూడా కొనసాగారు. ఈ నేపథ్యంలోనే ఐసీసీ పదవి కూడా జై షా కు ( Jay Shah) వరించడం జరిగింది. ఈ పదవిలో మూడు సంవత్సరాల పాటు జై షా కొనసాగుతారు. అంటే 2027 డిసెంబర్ దాకా ఉంటారన్నమాట. ఆ తర్వాత జై షా స్థానంలో మరో వ్యక్తి వచ్చే ఛాన్సు ఉంది. ఈ తరుణంలోనే తన్వీర్ అహ్మద్ ఈ వ్యాఖ్యలు చేశాడు. తన్వీర్ అహ్మద్ ఒక్కడే కాదు, మొహ్సిన్ నఖ్వీ కూడా ఈ పోస్ట్ కోసం ట్రై చేస్తున్నారని సమాచారం.
https://www.facebook.com/photo/?fbid=122175482090784311&set=a.122099109440784311