E-Paper
Advertisement

Sharwanand: ప్రమోషన్స్ అక్కర్లేదు… ఇండస్ట్రీకి యంగ్ హీరో కొత్త మెసెజ్

Sharwanand: ప్రమోషన్స్ అక్కర్లేదు… ఇండస్ట్రీకి యంగ్ హీరో కొత్త మెసెజ్
Advertisement

Sharwanand: ఒక సినిమాని ప్రేక్షకులలోకి తీసుకెళ్లాలి అంటే సినిమాకి ఏ విధంగా అయితే కష్టపడి పని చేస్తామో ప్రమోషన్లను కూడా అదే విధంగా నిర్వహించాలని చిత్ర బృందం భావిస్తుంటారు. ఈ నేపథ్యంలోనే వరుస ఇంటర్వ్యూలకు హాజరవ్వడం, పెద్ద ఎత్తున ఈవెంట్లను నిర్వహించడం చేస్తుంటారు. ఇలా ప్రమోషన్లను భారీ స్థాయిలో చేసినప్పుడే మన సినిమా ప్రేక్షకులను చేరుతుందని దర్శక నిర్మాతలు భావిస్తుంటారు. కానీ నటుడు శర్వానంద్ మాత్రం సినిమాకు ప్రమోషన్లే అవసరం లేదంటూ ఇటీవల ఒక ఇంటర్వ్యూ సందర్భంగా చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. శర్వానంద్ ఈ ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా నారీ నారీ నడుమ మురారి(Nari Nari Naduma Murari) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

సంక్రాంతి హిట్ గా శర్వానంద్ సినిమా..

సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఈ సినిమా జనవరి 15వ తేదీ విడుదల అయ్యి అద్భుతమైన ఆదరణ సొంతం చేసుకుంది. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో శర్వానంద్, సంయుక్త మీనన్, సాక్షి వైద్య హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా పెద్ద ఎత్తున థియేటర్లకు ప్రేక్షకులను రప్పిస్తోంది. ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వడంతో చిత్ర బృందం పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటూ సందడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే శర్వానంద్ ఒక ఇంటర్వ్యూ సందర్భంగా సినిమా ప్రమోషన్ల గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

కంటెంట్ ను నమ్ముకున్నాం..

Advertisement

నారీ నారీ నడుమ మురారి సినిమా ప్రమోషన్లను నిర్వహించలేదు అంటూ చాలామంది అనుకున్నారు. అసలు శర్వానంద్ సినిమా వస్తుందని ఎవరికీ తెలియదు అంటూ చాలామంది మాట్లాడారు కానీ మనం మాత్రం మన పనులను చేసుకుంటూ వెళ్తున్నాము. ఒకేసారి ఐదు సినిమాలు విడుదలవుతున్నాయంటే ఐదవ సినిమా గురించి మాట్లాడటానికి కాస్త ఆలస్యం అవుతుందని , అయినా మనం ప్రమోషన్ల కంటే కూడా కంటెంట్ ను బాగా నమ్ముకున్నామని శర్వానంద్ తెలియచేశారు.

కంటెంట్ ప్రేక్షకులను రప్పిస్తుంది..

Advertisement

సినిమాలో కంటెంట్ బలంగా ఉంటే ఆ సినిమాలకు ప్రమోషన్స్ అవసరం లేదని కంటెంట్ మాత్రమే ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తుందని శర్వానంద్ ఈ సందర్భంగా చెప్పకనే చెప్పేశారు. ఏది ఏమైనా ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మాత్రం సంక్రాంతి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. కేవలం మౌత్ టాక్ ద్వారా ప్రేక్షకులు థియేటర్ కు తరలివచ్చారు. ఇటీవల కాలంలో శర్వానంద్ సరైన సక్సెస్ లేక ఎంతో సతమతమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే నారీ నారీ నడుమ మురారితో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఇక త్వరలోనే ఈయన బైకర్ అనే మరో సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. మరో రెండు సినిమాలు కూడా షూటింగ్ పనులను జరుపుకుంటున్నట్టు తెలుస్తోంది.

Also Read: ENE 2: సీక్వెల్ నుంచి తప్పుకున్న సాయి సుశాంత్ .. రంగంలోకి హిట్ నటుడు!

Related News

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

Big Stories

Advertisement
×