E-Paper
Advertisement

ENE 2: సీక్వెల్ నుంచి తప్పుకున్న సాయి సుశాంత్ .. రంగంలోకి హిట్ నటుడు!

ENE 2: సీక్వెల్ నుంచి తప్పుకున్న సాయి సుశాంత్ .. రంగంలోకి హిట్ నటుడు!
Advertisement

ENE 2: ఇటీవల కాలంలో ఒక సినిమా మంచి సక్సెస్ అయ్యింది అంటే తప్పకుండా ఆ సినిమాకు సీక్వెల్ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. ఇలా ఇప్పటికే ఎన్నో సీక్వెల్ సినిమాలను ప్రకటించి షూటింగ్ పనులను కూడా జరుపుకుంటున్నారు. ఇలాంటి వాటిలో ఈ నగరానికి ఏమైంది(Ee nagaraniki emaindi 2) సినిమా కూడా ఒకటి. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అద్భుతమైన ఆదరణ సొంతం చేసుకోవడంతో సీక్వెల్ ప్రకటించారు. ప్రస్తుతం సీక్వెల్ కూడా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

తప్పుకున్న సాయి సుశాంత్..

ఈ నగరానికి ఏమైంది అనే సినిమాలో విశ్వక్ సేన్ అండ్ గ్యాంగ్ నే హైలైట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇందులో ప్రతి ఒక్కరూ కూడా తమ అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అయితే ఈ గ్యాంగ్ లో ఒకరు సీక్వెల్ సినిమా నుంచి తప్పుకున్నారని తెలుస్తోంది. ఈ నగరానికి ఏమైంది సినిమాలో కార్తీక్ పాత్రలో నటుడు సాయి సుశాంత్ (Sai Sushanth)నటించి సందడి చేశారు. అయితే సీక్వెల్ సినిమాలో మాత్రం సాయి సుశాంత్ నటించడం లేదని, ఆయన స్థానంలో హిట్ సినిమా ద్వారా మంచి సక్సెస్ అందుకున్న నటుడు శ్రీనాథ్ మాగంటి (Srinath Maganti) నటించబోతున్నారంటూ వార్తలు బయటకు వచ్చాయి. ఈ సూపర్ హిట్ సీక్వెల్ నుంచి నటుడు సాయి సుశాంత్ తప్పుకోవడానికి గల కారణాలు ఏంటి అనేది తెలియాల్సి ఉంది. ఇలా ఈ నగరానికి ఏమైంది గ్యాంగ్ నుంచి ఒక నటుడు తప్పుకున్నారు అనే విషయం తెలిసిన అభిమానులు షాక్ అవుతున్నారు.

భారీగా విఎఫ్ఎక్స్…

Advertisement

ఇక ఈ సినిమా విషయానికి వస్తే తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో విశ్వక్ సేన్ (Vishwak Sen) సందడి చేశారు.  ఇక సీక్వెల్స్ సినిమా గురించి ఇటీవల నిర్మాతలలో ఒకరైన సృజన్ యారబోలు ఓం శాంతి శాంతి శాంతి సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో బిజీగా ఉన్నారు. ఈ ప్రమోషన్లలో భాగంగా ఈ నగరానికి ఏమైంది సీక్వెల్ గురించి మాట్లాడుతూ భారీ అంచనాలను పెంచేశారు. ఈ సినిమా 2026 మిడిల్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది .ఇందులో కూడా భారీగా కామెడీ ఉండబోతుందని అలాగే ఎక్కువ శాతం విఎఫ్ఎక్స్ ఉండబోతుందని తెలియజేశారు.

సినిమా మేకింగ్ చుట్టూ తిరిగే కథగా..

Advertisement

ఈ సినిమా స్క్రిప్ట్ గురించి కూడా నిర్మాత సృజన్ మాట్లాడుతూ.. ఈ సీక్వెల్ కోసం తరుణ్ భాస్కర్ అద్భుతమైన స్క్రిప్ట్ రాసారని తన కెరియర్ లోనే ఇదొక అద్భుతమైన స్క్రిప్ట్ అని తెలియజేశారు. సుమారు 150 పేజీల స్క్రిప్ట్ ఉందని. అది చదివిన తర్వాత ఈ సినిమా బ్లాక్ బాస్టర్ అనే నమ్మకం తనకు కలిగిందని తెలియజేశారు. ఇక ఈ సినిమా మొత్తం సినిమా మేకింగ్ చుట్టూ తిరిగే కథా నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలియజేశారు.

Also Read: Swayambu Film: వాయిదా పడిన నిఖిల్ స్వయంభు… పోస్టర్ తో మేకర్స్ క్లారిటీ!

Related News

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

Big Stories

Advertisement
×