E-Paper
Advertisement

Bhogi Firstlook: సంపత్ నంది ‘భోగి’ ఫస్ట్ లుక్ వచ్చేసింది.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే?

Bhogi Firstlook: సంపత్ నంది ‘భోగి’ ఫస్ట్ లుక్ వచ్చేసింది.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
Advertisement

Bhogi Firstlook: శర్వానంద్ హీరోగా, మాస్ డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘భోగి’ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ తాజాగా విడుదలై అందరినీ ఆశ్చర్యపరిచింది. తన కెరీర్‌లో ఇప్పటివరకు చూడని విధంగా శర్వానంద్ ఈ సినిమాలో అత్యంత రగ్గడ్, ఫెరోషియస్ లుక్‌లో కనిపిస్తున్నారు. ఈ ఇంటెన్స్ మేకోవర్ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది. ఇప్పటికే సంక్రాంతికి నీరీ నారీ నడుమ మురారీ అంటూ సంక్రాంతికి వచ్చి మంచి హిట్ సాధించాడు శర్వానంద్. బైకర్ కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. మరీ అదే ఊపుతో భోగి కూడా రిలీజ్ డేట్ ప్రకటించారు నిర్మాతలు.

Read also-Vijay – Rashmika: “విరోష్” జంటకు ప్రధాని మోదీ స్పెషల్ విషెస్.. పోస్ట్ వైరల్!

Advertisement

ఈ సినిమా కథా నేపథ్యం 1960ల చివరలో ఉత్తర తెలంగాణ మరియు మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో జరుగుతుంది. పీరియడ్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రం కోసం ప్రస్తుతం హైదరాబాద్‌లో భారీ సెట్లు వేసి కీలకమైన ఫైట్ సీక్వెన్స్‌లను చిత్రీకరిస్తున్నారు. ఫైట్ మాస్టర్ దిలీప్ సుబ్బరాయన్ పర్యవేక్షణలో రెండు భారీ యాక్షన్ ఎపిసోడ్లు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ఇక ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతి కథానాయికలుగా నటిస్తున్నారు. వీరితో పాటు పలువురు సీనియర్ నటులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి, ఈ చిత్రాన్ని ఆగస్టు 28న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేసేందుకు చిత్ర బృందం సన్నద్ధమవుతోంది.

Read also-Vijay Deverakonda: విజయ్ దేవరకొండకు టాలీవుడ్ హీరోలతో విభేదాలా? ఇదెక్కడి విడ్డూరం!

Advertisement

Related News

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

Big Stories

Advertisement
×