E-Paper
Advertisement

Maoist Leader Ganapathi: మావోయిస్టు అగ్రనేత గణపతి మిస్సింగ్.. భారత్‌లో ఉన్నారా? నేపాల్ పారిపోయారా?

Maoist Leader Ganapathi: మావోయిస్టు అగ్రనేత గణపతి మిస్సింగ్.. భారత్‌లో ఉన్నారా? నేపాల్ పారిపోయారా?
Advertisement

Maoist Leader Ganapathi: తుపాకులతో వనం బాట పట్టిన మావోయిస్టులు ఇప్పుడు ఒక్కొక్కరిగా జనంలోకి తిరిగివస్తున్నారు. అయితే కీలక నేతలంతా లొంగిపోతున్నప్పటికీ ఒకరి ఆచూకి మాత్రం ఇప్పటివరకూ లభించలేదు. ఆయనే మావోయిస్టు అగ్రనేత గణపతి. ఇప్పుడు దేశవ్యాప్తంగా అతడి గురించి చర్చ నడుస్తుంది. ఇంతకీ ఆ మావోయిస్టు ‌అగ్రనేత గణపతి ఎక్కడ ఉన్నారు? ఆయన ఆచూకి దొరికిందా? గణపతి గురించి అయన సొంత ఊరు బీర్ పూర్ గ్రామస్థులు ఏమనుకుంటున్నారు? ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ఆచూకీపై సందిగ్దం

మావోయిస్టు పార్టీ అగ్రనేత ముప్పాళ లక్ష్మణ్ రావు అలియాస్ గణపతి అచూకిపై సందిగ్దం వీడటం లేదు. మావో ఉద్యమం చరమాంకంలో ఉండి అగ్రనేతలందరూ ప్రభుత్వానికి లొంగుతున్న తరుణంలో లక్ష్మణ్ రావు ఎక్కడ ఉన్నారన్నది చర్చనీయాంశంగా మారింది. వృద్ధాప్యం, అనారోగ్యం కారణంగా 2016లోనే సారధ్యాన్ని వదిలేసి వేరేవారికి బాధ్యతలు అప్పజెప్పిన గణపతి.. అప్పటినుంచి దండకారణ్యంలోనే ఉండిపోయారు. ఛత్తీస్ గఢ్ లోని అబూజ్ మడ్ అడవుల్లోనే ఉంటూ దిశానిర్దేశం చేస్తూ వచ్చారు. ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్ర బలగాలు చేపట్టిన కూంబింగ్ లో అగ్రనేతలు ఎన్ కౌంటర్ లో చనిపోవడం, మరికొందరు లొంగిపోవడం జరిగింది. అయితే గణపతి జాడ మాత్రం ఇప్పటివరకూ తెలియరాలేదు.

2024 జులైలో చివరిసారిగా..

Advertisement

లొంగిపోయిన అగ్రనేతలని విచారించినా.. గణపతి అచూకీ లభ్యం కావడం లేదని తెలుస్తోంది. 2024 జూలైలో నెలరోజులపాటు అబూజ్ మడ్ అడవుల్లో పొలిట్ బ్యురో, కేంద్రకమిటి సమావేశాలలో గణపతి పాల్గొన్నట్లు నిఘా వర్గాలకు పక్కా సమాచారం అందింది. కాని తరువాత అక్కడి నుండి నేపాల్ కి వెళ్ళి తలదాచుకున్నట్లు సమాచారం. అక్కడి నుండి పిలిఫ్ఫిన్ కి వెళ్లారా? లేదా దేశంలోనే మరెక్కడైనా ఉన్నారా? అన్నది ఇప్పుడు విస్తృతంగా చర్చ జరుగుతోంది.

13 రాష్ట్రాల్లో పార్టీని నడిపించి..

ముప్పాళ లక్ష్మణ్ రావు అలియాస్ గణపతి సొంత గ్రామం జగిత్యాల జిల్లా బీర్ పూర్ గ్రామం. ఇక్కడి నుండి వెళ్లి మావోయిస్టుల అగ్రనేతగా ఆయన ఎదిగారు. 13 రాష్ట్రాలలో పార్టీని నడిపించిన గణపతిపై ఇప్పటికే వేలాదిగా కేసులు ఉన్నాయి. ఆయన లొంగిపోతే కేసులు ఎత్తివేసేందుకు అన్ని రాష్ట్రాల పోలీసులు సుముఖంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో గణపతి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారా? అన్న ఆసక్తి అందరిలోనూ ఏర్పడింది.

Advertisement

Also Read: Donald Trump: భారత్‌ను ఆపకపోయుంటే.. పాక్ ప్రధాని చనిపోయేవారు.. ట్రంప్ షాకింగ్ కామెంట్స్

గ్రామస్థులు ఏమంటున్నారంటే?

మావోయిస్టు అగ్రనేతలు అందరూ లొంగిపోతుండటంతో గణపతి జాడ కోసం ఆయన గ్రామస్తులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. తమ‌ గ్రామానికి చెందిన గణపతి పేరు వినడమే గాని తాము ఎప్పుడూ చూడలేదని పలువురు బీర్ పూర్ గ్రామస్తులు చెబుతున్నారు. వయసు మీద పడిన నేపథ్యంలో ఇతర మావోయిస్టుల తరహాలోనే గణపతి లొంగిపోవాలని వారు కోరుకుంటున్నారు. స్వగ్రామానికి వచ్చి మిగిలిన జీవితాన్ని అయినా కుటుంబ సభ్యులు, బంధువులతో హాయిగా జీవించాలని సూచిస్తున్నారు. మరి గణపతి ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

Also Read: TG Health Department: ఆ మేడం ఎక్కడ పనిచేసిన రిజెల్ట్ సూపర్.. సెక్రటేరియట్‌లో ఇప్పుడిదే హట్ టాపిక్..!

Related News

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

Big Stories

Advertisement
×