E-Paper
Advertisement

Star Actor: నా పంచ్ డైలాగ్‌ను ఎవ్వరూ వాడకూడదు.. కోర్టును ఆశ్రయించిన స్టార్ హీరో.. ఇదేమి పైత్యం..!

Star Actor: నా పంచ్ డైలాగ్‌ను ఎవ్వరూ వాడకూడదు.. కోర్టును ఆశ్రయించిన స్టార్ హీరో.. ఇదేమి పైత్యం..!
Advertisement

Star Actor: సినిమా రంగంలో కథలు, పాటలు, డైలాగులు ఎంతో విలువైనవి. ఒక నటుడికి అతని పేరు, ముఖం, గొంతు, స్టైల్, డైలాగులే అసలు గుర్తింపు. వాటిని అనుమతి లేకుండా వాడితే పెద్ద సమస్య అవుతుంది. ఇప్పుడు ఇదే అంశంపై సీనియర్ నటుడు శత్రుఘ్న సిన్హా కోర్టును ఆశ్రయించారు.

1970, 1980 దశకాలలో బాలీవుడ్‌లో శత్రుఘ్న సిన్హా చాలా పెద్ద స్టార్. మొదట విలన్ పాత్రలతో ప్రేక్షకులను భయపెట్టిన ఆయన, ఆ తర్వాత యాక్షన్ హీరోగా మారారు. ఆయన గొంతు, మాట్లాడే విధానం, నడక అన్నీ ప్రేక్షకులకు బాగా నచ్చాయి. ముఖ్యంగా ఆయన చెప్పే డైలాగులు చాలా ఫేమస్ అయ్యాయి. వాటిలో “ఖామోష్” అనే పంచ్ డైలాగ్ అంటే ఇప్పటికీ అందరికీ గుర్తే.

Advertisement

కానీ ఇటీవలి కాలంలో ఈ “ఖామోష్” డైలాగ్‌ను చాలా మంది అనుమతి లేకుండా వాడుతున్నారని శత్రుఘ్న సిన్హా కోర్టుకు తెలిపారు. సోషల్ మీడియాలో మీమ్స్‌గా, వీడియోలుగా ఈ డైలాగ్ వినిపిస్తోందని చెప్పారు. అంతేకాదు, కొన్ని ప్రకటనల్లో కూడా తన డైలాగ్‌ను వాణిజ్య ప్రయోజనాల కోసం వాడుతున్నారని ఆయన ఆరోపించారు.

తన పేరు, ముఖం, ప్రత్యేకమైన స్టైల్, ముఖ్యంగా తన ఫేమస్ డైలాగ్‌లను ఇలా వాడటం తన ప్రతిష్ఠకు భంగం కలిగిస్తోందని ఆయన అన్నారు. కొన్ని సందర్భాల్లో అసభ్యంగా లేదా వ్యంగ్యంగా తన డైలాగ్‌ను ఉపయోగిస్తున్నారని, ఇది తన ఇమేజ్‌ను చెడగొడుతోందని తెలిపారు. అందుకే ఎవ్వరూ కూడా తన పంచ్ డైలాగ్‌ను వాడకూడదని ఆదేశాలు ఇవ్వాలని ఆయన కోరారు.

Advertisement

ఈ విషయంపై ముంబై హైకోర్టులో కేసు దాఖలైంది. తన పేరు.. డైలాగ్‌లను వాడినందుకు నష్టపరిహారంగా రూ.20 కోట్ల పరిహారం కూడా శత్రుఘ్న సిన్హా డిమాండ్ చేశారు. ఈ కేసును విచారించిన న్యాయమూర్తి తదుపరి విచారణకు తేదీని వాయిదా వేశారు.

ఈ ఘటనతో సినిమా రంగంలో డైలాగ్‌లకు కూడా హక్కులు ఉంటాయని మరోసారి చర్చ మొదలైంది. నటుల గుర్తింపును గౌరవించాలి, అనుమతి లేకుండా వాడటం సరైంది కాదనే విషయం ఈ కేసు ద్వారా స్పష్టంగా తెలుస్తోంది.

ALSO READ: Siddhu Jonalgadda: సిద్దు జొన్నలగడ్డ నెక్స్ట్ సినిమా కథ ఇదే.. టైటిల్ కూడా కాస్త కొత్తగా..!

Related News

బాలకృష్ణతో జాగ్రత్తగా ఉండాలి..తేడా వస్తే దబిడి దిబిడే అంటున్న హీరో!

రామాయణ ప్రీ రిలీజ్ ఈవెంట్…సింగర్ గా మారిన సాయి పల్లవి.. ఫిదా అవ్వాల్సిందే!

యశ్ టాక్సిక్ డిజాస్టర్ పై దిల్ రాజు కామెంట్స్.. ఇంటర్నేషనల్ లెవెల్ అంటూ!

కాఫీ విత్ కరణ్‌ షోలో ‘విరోష్’ సందడి.. విజయ్ -రష్మిక పెళ్లి రహస్యం లీక్‌!

తెరపైకి సింగర్ పీ సుశీలమ్మ బయోపిక్ చిత్రం? హీరోయిన్ ఎవరంటే?

ఆదర్శ కుటుంబం సెకండ్ సింగిల్ ‘మాల’ లిరికల్ సాంగ్ రిలీజ్!

కావ్యతో పెళ్లి.. వైరల్ గా మారిన అనిరుధ్ గర్ల్ ఫ్రెండ్స్ లిస్ట్!

జైలర్ 2 మూవీ.. రజిని మనవడి రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×