Malayalam Suspense Thriller: ఒక మర్డర్ కేసు కేరళలో కలకలం రేపుతుంది. ఆ కేసు మిస్టరీ వీడకముందే ఏకంగా 26 మంది చిన్న పిల్లలు అదృశ్యమైతే ? వాళ్లను వెతికే బాధ్యత పోలీసులదే అనుకుంటాం. కానీ ఇక్కడ రంగంలోకి దిగేది పోలీసులే కాదు… సమాజంలో క్రిమినల్స్ గా ముద్రపడిన ఇద్దరు వ్యక్తులు. అసలు వాళ్లకు ఆ పిల్లల్లో ఒకరితో ఉన్న సంబంధం ఏంటి ? ఈ వెతుకులాట చివరకు ఎలాంటి షాకింగ్ నిజాలను బయట పెట్టింది ? అదే ‘పగిడ కాళి’ (Pagida Kali) సినిమా కథ. మరి ఈ మూవీని ఏ ఓటీటీలో చూడవచ్చు ? ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చింది ? అన్నది తెలియాలంటే సినిమా వివరాలపై ఒక లుక్కేయాల్సిందే.
కేరళలో ఓ మిస్టరీ మర్డర్ స్థానికంగా తీవ్ర చర్చకు దారితీస్తుంది. పోలీసులు ఆ కేసును ఛేదించే ప్రయత్నాల్లో ఉండగానే పరిస్థితులు మరింత విషమిస్తాయి. రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల నుంచి ఏకంగా 26 మంది చిన్న పిల్లలు కనిపించకుండా పోతారు. ఒక్కసారిగా ఇంతమంది పిల్లలు అదృశ్యం కావడంతో పోలీస్ శాఖపై ఒత్తిడి పెరుగుతుంది. అసలు ఈ కిడ్నాప్‌ల వెనుక ఎవరు ఉన్నారు ? పిల్లలను ఎక్కడికి తీసుకెళ్లారు ? అనే ప్రశ్నలు జనాలను ఆందోళనలో పడేస్తాయి.
ఇదే సమయంలో కథలోకి ఇద్దరు క్రిమినల్స్ వస్తారు. టిటో విల్సన్, దేవసూర్య పోషించిన ఈ ఇద్దరి పాత్రలకు నేర చరిత్ర ఉంటుంది. సాధారణంగా చట్టానికి దూరంగా ఉండే వీళ్లే ఇప్పుడు అదృశ్యమైన పిల్లల కోసం వెతకడం మొదలు పెడతారు. అయితే వాళ్ల లక్ష్యం మొత్తం 26 మంది పిల్లలు కాదు. ఆ పిల్లల్లో ఒక చిన్నారి కోసం వీళ్లు ప్రాణాలకు తెగించి రంగంలోకి దిగుతారు. మొదట వ్యక్తిగత కారణంతో మొదలైన ఈ వెతుకులాట క్రమంగా ఊహించని మలుపులు తిరుగుతుంది. పిల్లల అదృశ్యానికి సంబంధించిన ఆధారాలు కేరళ దాటి ఇతర ప్రాంతాలకు కూడా తీసుకెళ్తాయి.
దర్యాప్తు ముందుకు సాగుతున్న కొద్దీ ఇది సాధారణ కిడ్నాప్ వ్యవహారం కాదని అర్థమవుతుంది. దీని వెనుక భారీ అంతర్రాష్ట్ర నేర నెట్‌వర్క్ ఉందని తెలుస్తుంది. అంతేకాదు… ఈ క్రిమినల్స్‌కు దొరికే ఆధారాలు ఒక పెద్ద రాజకీయ కుట్ర వైపు చూపిస్తాయి. పోలీసులు ఛేదించాల్సిన కేసులోకి ఈ ఇద్దరు ఎందుకు వచ్చారు ? 26 మంది పిల్లలను కిడ్నాప్ చేసింది ఎవరు ? వాళ్లలో ఆ ఒక్క చిన్నారి ఎందుకు అంత కీలకం ? చివరకు ఈ నేరాల వెనుక ఉన్న అసలు వ్యక్తులు ఎవరు ? అనే ప్రశ్నలకు సినిమా ఉత్కంఠభరితంగా సమాధానం చెబుతుంది.
‘పగిడ కాళి’ చిత్రానికి నిషాద్ హసన్ దర్శకత్వం వహించారు. క్రైమ్, సస్పెన్స్, ఇన్వెస్టిగేషన్ అంశాలతో తెరకెక్కిన ఈ సినిమా మరో ప్రత్యేకత కూడా ఉంది. సినిమాను పూర్తిగా ఐఫోన్ తో చిత్రీకరించారు. దీంతో టెక్నికల్‌గా కూడా ఈ మూవీ ఆసక్తిని కలిగిస్తుంది. ఈ చిత్రం ప్రస్తుతం ‘మనోరమా మ్యాక్స్’ (ManoramaMAX)లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే తెలుగులో ఆడియో అందుబాటులో లేదు. ఒరిజినల్ మలయాళ భాషలో ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో చూడాల్సి ఉంటుంది. క్రైమ్ మిస్టరీ, కిడ్నాప్ ఇన్వెస్టిగేషన్, పొలిటికల్ కాన్స్పిరసీ కలిసిన థ్రిల్లర్స్ ఇష్టపడేవారికి ఈ మూవీ మంచి వీకెండ్ వాచ్‌గా అనిపించొచ్చు.
Read Also: గేమింగ్ ప్రేమికులకు ఊహించని విజువల్ ట్రీట్… 8000 కోట్ల రోలర్‌కోస్టర్ రైడ్