Shivakrishna Chiranjeevi : చిరంజీవి .. ఈ పేరు టాలీవుడ్ ని ఎంతలా షేక్ చేసిందో స్పెషల్ గా చెప్పక్కర్లేదు. స్వయంకృషితో ఏదైనా సాధించొచ్చు అనడానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్.అలాంటి చిరు పై సీనియర్ నటుడు శివకృష్ణ చేసిన కామెంట్స్ ఇపుడు నెట్టింట తెగ వైరల్ వుతున్నాయ్.అవును ..”కెరీర్ మొదట్లో చిరంజీవి కంటే నాకే ఎక్కువ హిట్స్ ఉన్నాయి” అంటూ శివకృష్ణ చేసిన ఓపెన్ స్టేట్‌మెంట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
శివకృష్ణను ఓవర్‌నైట్ స్టార్ చేసిన ఎర్ర మల్లెలు
అది 1970ల చివరి కాలం.ఆ టైమ్ లో ఎందఱో స్టార్స్ ఇండస్ట్రీలోక్ ఎంట్రీ ఇచ్చారు.అందులో చిరంజీవి 1978లో ‘ప్రాణం ఖరీదు’తో పరిచయం అయితే , శివకృష్ణ కూడా దాదాపు అదే సమయంలో కెరీర్ మొదలెట్టాడు.ముఖ్యంగా 1981లో వచ్చిన ‘ఎర్ర మల్లెలు’ సినిమా శివకృష్ణను ఓవర్‌నైట్ స్టార్‌ను చేసింది. ఆ సమయంలో చిరంజీవి ఇంకా ‘ఇది కథ కాదు’,’47 రోజులు’అంటూ విలన్ పాత్రలు, నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్లు చేస్తున్న పరిస్థితి.
ALSO READ :ఇన్‌స్టా ‘మహా ప్రక్షాళన’..ఒక్క రాత్రిలో కోట్లాది మంది మాయం.. సెలబ్రిటీల గుండెల్లో రైళ్లు!
చిరంజీవి కంటే వేగంగా దూసుకుపోయిన శివకృష్ణ
అయితే లేటెస్ట్ గా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న శివకృష్ణ గతాన్ని తలుచుకుంటూ కొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ బయటపెట్టాడు. అప్పట్లో మేమిద్దరం ఒకే సమయంలో కెరీర్ మొదలుపెట్టామని, నిజం చెప్పాలంటే తొలినాళ్లలో చిరంజీవి కంటే నాకే వరుస హిట్లు వచ్చాయని చెప్పుకొచ్చాడు.నేను హీరోగా నిలదొక్కుకుంటున్న సమయంలో చిరంజీవి చిన్న చిన్న వేషాలు వేస్తూ స్ట్రగుల్ అవుతున్నారని తెలిపాడు.ఒకానొక దశలో చిరంజీవి కంటే వేగంగా దూసుకుపోయిన శివకృష్ణ, ఆ తర్వాత వెనకబడిపోవడానికి గల కారణాలను కూడా ఈ ఇంటర్వ్యూలో బయటపెట్టాడు.
స్టార్‌డమ్ అనేది కేవలం అదృష్టం వల్ల రాదని, సరైన సమయంలో తీసుకునే నిర్ణయాల వల్ల వస్తుందని మనసులోని మాటని బయటపెట్టాడు. ఎప్పుడూ ఏ నిర్మాతను కానీ, దర్శకుడిని కానీ నాకు ఛాన్స్ ఇవ్వమని అడగలేదని, అది నా వ్యక్తిత్వం కావచ్చు కానీ కెరీర్ పరంగా చేసిన అతిపెద్ద తప్పు అదేనని ఓపెన్ గానే ఒప్పుకున్నాడు.
ఖైదీ’ సినిమాతో చిరంజీవి క్రియేట్ చేసిన హిస్టరీ
వచ్చిన ప్రతి పాత్రను చిరంజీవి ఒక అవకాశంగా చూస్తే, శివకృష్ణ మాత్రం చాలా సినిమాలను నిర్మొహమాటంగా తిరస్కరించారు. ముఖ్యంగా 1983లో ‘ఖైదీ’ సినిమాతో చిరంజీవి క్రియేట్ చేసిన హిస్టరీ అంతా ఇంతా కాదు. అదే సమయంలో శివకృష్ణ తన పంథా మార్చుకోలేకపోయారు. నేను చేసిన తప్పులను చిరంజీవి చేయలేదని, తన దగ్గరకు వచ్చిన ప్రతి అవకాశాన్ని ఒడిసి పట్టుకున్నాడని శివకృష్ణ నిజాయితీగా ఒప్పుకోవడం విశేషం,, పరిశ్రమలో ఎలా మెలగాలి, ఎవరితో ఎలా ఉండాలి అనే విషయంలో చిరంజీవి చాలా పక్కాగా ఉండేవారని, తాను మాత్రం అప్పట్లో ఆ విషయంలో పట్టు కోల్పోయానని వాపోయాడు ఈ సీనియర్ నటుడు.అయితే శివకృష్ణ గారు నిజాయితీగా మాట్లాడారని కొంతమంది అంటే ఎవరి జర్నీ వారిదని,చిరంజీవి తన ప్లానింగ్ మరియు హార్డ్ వర్క్‌తోనే మెగాస్టార్ అయ్యారని సపోర్ట్ చేస్తున్నారు మరికొంతమంది. ఏది ఏమైనా తను చేయలేనిది చిరు చేశాడని శివకృష్ణ ఓపెన్ గా అంగీకరించడం మెచ్చుకోతగ్గ విషయమే !
ALSO READ :ఉ* పోయిస్తే కానీ.. ఆ చోటు నీది కాదు.. ఈ ఒక్క డైలాగ్‌తోనే మైండ్ బ్లాక్ చేసిన సందీప్ కిషన్!