E-Paper
Advertisement

ఉ* పోయిస్తే కానీ.. ఆ చోటు నీది కాదు.. ఈ ఒక్క డైలాగ్‌తోనే మైండ్ బ్లాక్ చేసిన సందీప్ కిషన్!

ఉ* పోయిస్తే కానీ.. ఆ చోటు నీది కాదు.. ఈ ఒక్క డైలాగ్‌తోనే మైండ్ బ్లాక్ చేసిన సందీప్ కిషన్!
Advertisement

Power Peta : సందీప్ కిషన్ కెరీర్‌లోనే హై బడ్జెట్ చిత్రంగా తెరకెక్కుతున్న ‘పవర్ పేట’ గ్లింప్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. మే 7న సందీప్ కిషన్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ అయిన  ఈ వీడియోలో ఆయన చెప్పిన పవర్‌ఫుల్ డైలాగ్స్ మాస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. 2024 ఫిబ్రవరి 16న విడుదలైన ‘ఊరు పేరు భైరవకోన’తో  దాదాపు 30 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించి మంచి కమర్షియల్ సక్సెస్ అందుకున్న సందీప్, అదే ఊపులో ఈ పీరియాడిక్ డ్రామాపై ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్టు కనిపిస్తుంది.

అడవిలో సింహం ఉచ్చ పోసి

Advertisement

ఈ గ్లింప్స్ లో సందీప్ కిషన్ చెప్పిన డైలాగ్ మాములుగా లేదంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు“అడవిలో సింహం ఉచ్చ పోసి ఇది నా చోటు అని చెబుతుంది.. ఇక్క‌డ ఉచ్చ‌పోయిస్తే కానీ ఆ చోటు నీది కాదు”అంటూ సందీప్ కిష‌న్ ఫుల్ మాస్ లుక్ లో ఇచ్చిన వార్నింగ్ థియేటర్లలో ఈలలు వేయించేలానే కనిపిస్తుంది.ఇక ఈ డైలాగ్ ద్వారా సినిమాలో పవర్ పాలిటిక్స్ ఏ స్థాయిలో ఉండబోతున్నాయో హింట్ ఇచ్చేశాడు డైరెక్టర్ కృష్ణ చైతన్య

పక్కా రా అండ్ రస్టిక్ పొలిటికల్ డ్రామా

Advertisement

ఇక డైరెక్టర్ కృష్ణ చైతన్య గతంలో ‘రౌడీ ఫెలో’, ‘ఛల్ మోహన్ రంగ’ వంటి క్రేజీ ఫిలిమ్స్ ని తెరకెక్కించిన సంగతి తెల్సిందే.అయితే ‘పవర్ పేట’ ప్రాజెక్ట్ సుమారు నాలుగేళ్ల క్రితమే అనౌన్స్ అయినప్పటికీ సరైన ప్రొడ్యూసర్స్ మరియు భారీ బడ్జెట్ కోసం వేచి చూసి, చివరకు 70mm ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో చేతులు కలిపారు. ఈ చిత్రం 1980 బ్యాక్ డ్రాప్ లో సాగే పక్కా రా అండ్ రస్టిక్ పొలిటికల్ డ్రామా కావడంతో, అది రిప్లెక్ట్ అయ్యేలా చార్మినార్ దగ్గరలోని  పాత థియేటర్లలో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట.

మూడు భిన్నమైన షేడ్స్

ఈ సినిమాలో సందీప్ కిషన్ 18 ఏళ్ల కుర్రాడిగా, 30 ఏళ్ల యువకుడిగా మరియు 60 ఏళ్ల వృద్ధుడిగా మూడు భిన్నమైన షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపించబోతుండడం విశేషం. ఇందుకోసం ఆయన ప్రత్యేకమైన మేకప్ మరియు ఫిజికల్ ట్రాన్స్‌ఫార్మేషన్ కోసం చాలా నెలలు కష్టపడం చూస్తె సినిమాపై ఎంత కాన్ఫిడెన్స్ చూపిస్తున్నాడో తెలుస్తుంది. గతంలో సందీప్ నటించిన ‘మైఖేల్’ చిత్రం డిజాస్టర్ అయినా,సందీప్ నటనకు మంచి గుర్తింపే  వచ్చింది. ఇప్పుడు ‘పవర్ పేట’తో తన మార్కెట్ స్థాయిని పాన్ ఇండియా రేంజ్‌కు తీసుకెళ్లాలని ఫిక్స్ అయ్యాడట ఈ కుర్ర హీరో .

ఈ ఏడాది చివర్లో లేదా 2027 సంక్రాంతి బరిలో

మరోవైపు, ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించడం విశేషం. ముఖ్యంగా ఇలాంటి పొలిటికల్ మరియు గ్యాంగ్‌స్టర్ డ్రామాలకు మణి ఇచ్చే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాను నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్తుందని భావిస్తునారు ట్రేడ్ పండిట్స్.ఇక ఇందులో మిరాయ్ బ్యూటీ రితికా నాయక్ హీరోయిన్‌గా నటిస్తుండగా, ఇతర కీలక పాత్రల్లో ప్రముఖ నటీనటులు అలరించనున్నారు. ఈ ఏడాది చివర్లో లేదా 2027 సంక్రాంతి బరిలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.చూడాలి మరి ఒక్క హిట్టు కావాలి మొర్రో అంటున్న సందీప్ కి ఈ సినిమా ఎలాంటి అనుభూతిని మిగిలిస్తుందో !

Related News

టాక్సిక్ ..500కోట్లు అయ్యే పనేనా ?

మా ఆయన కోసమే గాయమైనట్టుంది… పెళ్లి తర్వాత మూడు నెలలు కలవలేదంటూ!

శ్రీకృష్ణుడిగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. దిల్ రాజు క్రేజీ రీమేక్ ప్లాన్

బన్నీ ట్రిపుల్ రోల్‌పై కొత్త ట్విస్ట్.. ‘రాకా’ కథ మొత్తం మారిపోయిందా?

డెనిమ్‌లో మాల్వి మల్హోత్రా.. బ్లూ బ్యూటీని చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే!

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

Big Stories

Advertisement
×