E-Paper
Advertisement

ఇన్‌స్టా ‘మహా ప్రక్షాళన’..ఒక్క రాత్రిలో కోట్లాది మంది మాయం.. సెలబ్రిటీల గుండెల్లో రైళ్లు!

ఇన్‌స్టా ‘మహా ప్రక్షాళన’..ఒక్క రాత్రిలో కోట్లాది మంది మాయం.. సెలబ్రిటీల గుండెల్లో రైళ్లు!
Advertisement

Instagram Purge : ఇన్స్టాలో మా స్టార్ కి పది మిలియన్ల ఫాలోవర్స్ కి ఉన్నారంటే, మావాడికి అంతకు రెండితలు ఎక్కువే అంటూ నెట్టింట ఫ్యాన్స్ వార్ జరగడం మనం చూస్తూనే ఉంటాం.కానీ ఆ మిలియన్ల ఫాలోవర్స్ అంతా తూచ్ అంటూ అసలు రంగు బయటెట్టేసింది ఇన్‌స్టా మాతృసంస్థ ‘మెటా’.ఫేక్, నకిలీ,కొనుకోబడిన ఖాతాలన్నీ మొహమాటం లేకుండా ఏరేసే పనిలో పడింది.దీంతో ..నిన్నటి దాకా మిలియన్ల కొద్దీ ఫాలోవర్లతో ఆకాశంలో చక్కర్లు కొట్టిన తారలు ఇన్‌స్టాగ్రామ్ తీసుకున్న క్రేజీ డిసీషన్ తో ఒక్కసారిగా భూమ్మీదకి వచ్చి పడ్డారు.దీంతో వరల్డ్ వైడ్ గా ఇన్‌స్టాగ్రామ్ డిసీషన్ ని ‘గ్రేట్ పర్జ్ ఆఫ్ 2026’ (Great Purge of 2026) అంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు నెటిజన్స్.

మెటా కటింగ్ ఏ స్థాయిలో ఉందంటే 

Advertisement

మెటా ఏ స్థాయిలో ఎరేస్తుందంటే అమెరికన్ బిజినెస్ ఉమెన్ కైలీ జెన్నర్ ఏకంగా 14 మిలియన్ల ఫాలోవర్లను కోల్పోయియెంత. ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో ఖాతా నుంచి 8 మిలియన్ల మంది మాయమైపోయెంత.ఇక వీరే కాదండోయ్ మన ఇండియన్ సెలెబ్రెటీ ల ఖాతాల నుండి కూడా గట్టిగానే కోత పడింది. అవును గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా మిలియన్ మందిని, కింగ్ విరాట్ కోహ్లీ 2 మిలియన్ల ఫాలోవర్లను కోల్పోయారు. వీరితో పాటు టేలర్ స్విఫ్ట్, జస్టిన్ బీబర్, కె-పాప్ సెన్సేషన్స్ బీటీఎస్, బ్లాక్‌పింక్ వంటి టాప్ అకౌంట్స్ అన్నీ కళ తప్పాయంటే మెటా కటింగ్ ఏ స్థాయిలో ఉందొ అర్థమవుతుంది.

ALSO READ :సితార మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్.. కార్తీ – కళ్యాణ్ శంకర్ సినిమా గ్రాండ్ లాంచ్!

Advertisement

ఇన్‌స్టాగ్రామ్‌పై మరింత విశ్వసనీయత 

అయితే ఇన్‌స్టా మాతృసంస్థ ‘మెటా’చేస్తున్న ఈ ‘సర్జికల్ స్ట్రైక్’ వెనుకాల సాలిడ్ రీజన్స్ ఉన్నట్టు కనిపిస్తుంది. ఇన్‌స్టాగ్రామ్‌పై మరింత విశ్వసనీయత పెంచే క్రమంలో
బాట్ అకౌంట్స్ సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామ్స్ ద్వారా సృష్టించిన నకిలీ అకౌంట్స్ ని,ఏళ్ల తరబడి లాగిన్ అవ్వకుండా ఉన్న ఇన్-యాక్టివ్ అకౌంట్స్ ని, అనవసరమైన లింకులు, ప్రకటనలు పంపే ఫేక్ ఐడీలని ,డబ్బులు ఇచ్చి కొనుకున్న ఫేక్ ఫాలోవర్లని ఏరివేసే పనిలో పడింది.అయితే అఫీషియల్ గా మెటా ఈ విషయంపై అనౌన్స్ చేయనప్పటికీ ఈ ‘క్లీనింగ్ ప్రోగ్రాం వల్ల సెలబ్రిటీల అసలు రంగు బయటపడుతోందని ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు .

సెలబ్రిటీల ఫాలోయింగ్ అంతా ఉత్తదేనా?

ఇక ఈ ఏరివేతతో ఇంతకాలం సెలబ్రిటీల ఫాలోయింగ్ అంతా ఉత్తదేనా? అనే ప్రశ్న నెట్టింట హాట్ టాపిక్ అయిపొయింది. థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా ఫాలోవర్లను పెంచుకుని, బ్రాండ్ ఎండార్స్‌మెంట్ల ద్వారా కోట్లు గడిస్తున్న వారికి ఒకరకంగా ఇది గట్టి దెబ్బే అని చెప్పాలి.

ఏది ఏమైనా ఇన్‌స్టాగ్రామ్‌పై మరింత విశ్వసనీయత పెంచేలా, ఎక్కువ మందికి చేరవేసేలా,స్పామ్ యాక్టివిటీ, ఫేక్ ఎంగేజ్‌మెంట్‌ను కంట్రోల్ చేయడానికి మెటా తీసుకున్న ఈ నిర్ణయం మేచుకోతగ్గదే.ఇక ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ రంగంలో ఈ ఏరివేత ఊహించని మార్పులు తీసుకురావడం పక్కగా కనిపిస్తుంది. బ్రాండ్లు ఇకపై కేవలం ఫాలోవర్ల నంబర్లను చూసి కాకుండా, అసలైన ఎంగేజ్‌మెంట్‌ను బట్టి ఒప్పందాలు చేసుకునే అవకాశాలే ఎక్కువ.చూడాలి ముందు ముందు ఈ మెటా అడుగులు ఇంకెటు వైపు పడతాయో !

ALSO READ :నితిన్ మార్కెట్ అవుట్? భారీ బడ్జెట్‌తో రిస్క్ చేయలేక దర్శకుడికి షాక్!

Related News

మమిత బైజుకు ఏమైంది..? సినిమాలకు గుడ్ బై..?

టాక్సిక్ ..500కోట్లు అయ్యే పనేనా ?

మా ఆయన కోసమే గాయమైనట్టుంది… పెళ్లి తర్వాత మూడు నెలలు కలవలేదంటూ!

శ్రీకృష్ణుడిగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. దిల్ రాజు క్రేజీ రీమేక్ ప్లాన్

బన్నీ ట్రిపుల్ రోల్‌పై కొత్త ట్విస్ట్.. ‘రాకా’ కథ మొత్తం మారిపోయిందా?

డెనిమ్‌లో మాల్వి మల్హోత్రా.. బ్లూ బ్యూటీని చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే!

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…

Big Stories

Advertisement
×