Teja Sajja : ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా మంచి గుర్తింపు సాధించుకుంటున్నాడు తేజ సజ్జ. బాల నటుడుగానే తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సాధించుకున్నాడు. చాలామంది బాల నటులకు దొరకని అదృష్టం తేజకు దొరికింది. మెగాస్టార్ చిరంజీవి, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోలతో సైతం నటించాడు తేజ. నందిని రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఓ బేబీ సినిమాతో హీరోగా మారిపోయాడు.
ఆ రీమేక్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన రెస్పాన్స్ సాధించుకుంది. నందిని ఆ సినిమాని డీల్ చేసిన విధానం చాలామందికి విపరీతంగా కనెక్ట్ అయింది. ఇకపోతే గతంలో తేజ మాట్లాడుతూ, రవితేజకు పూరి జగన్నాథ్, పవన్ కళ్యాణ్ కు త్రివిక్రమ్ శ్రీనివాస్ అలా తేజకు ప్రశాంత్ వర్మ అంటూ భారీ ఎలివేషన్ ప్రశాంత్ వర్మకు ఇచ్చాడు. ప్రశాంత్ వర్మ ఎక్కువ సినిమాలు తేజ తో చేశాడు చేశాడు.
తేజ సజ్జ, శివాని రాజశేఖర్ కలిసి నటించిన సినిమా అద్భుతం. ఈ సినిమాకు ప్రశాంత్ వర్మ కథ అందించాడు. లక్ష్మీ భూపాల స్క్రీన్ ప్లే రాశారు. మల్లిక్ రామ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమా హాట్స్టార్ లో విడుదలైంది. అయితే ఈ సినిమా చూసిన చాలామంది ఈ సినిమా కాన్సెప్ట్ నచ్చి విపరీతమైన ప్రశంసలు కురిపించారు.
మొత్తానికి ఒక మంచి సినిమాగా ఇది పేరు సాధించుకుంది. అయితే ఈ సినిమా గురించి ఇప్పుడు కొన్ని ఆసక్తికర వార్తలు బయటకి చెప్పారు నిర్మాత చంద్రశేఖర్. చంద్రశేఖర్ మాట్లాడుతూ ఈ సినిమాలో శివాని రాజశేఖర్ కి సంబంధించిన 15 నిమిషాల ఫుటేజ్ కట్ చేశారట. కేవలం శివాత్మిక హీరోని డామినేట్ చేయడం వలనే 15 నిమిషాల పాటు తను నటించిన సీన్స్ కట్ చేయవలసి వచ్చింది అని నిర్మాత తెలిపారు.
తేజ సజ్జ మీద పాజిటివ్ కామెంట్స్ సోషల్ మీడియాలో ఎన్ని కనిపిస్తాయో నెగిటివ్ కామెంట్స్ కూడా అలానే కనిపిస్తాయి. అతనికి మాట్లాడ్డం రాదు అని కొంతమంది అంటుంటారు. అలానే మిరాయి సినిమాకి సంబంధించి కూడా మా సినిమాలో విలన్ పాత్ర చేసినందుకు థాంక్యూ మనోజ్ అన్నా అని చెప్పాడు. వెంటనే మనోజ్ మా సినిమా కాదు మన సినిమా అని స్టేజ్ మీదే అన్నారు.
ఇలాంటి చిన్నచిన్న విషయాలను పట్టుకొని చాలామంది తేజ ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఇక ప్రస్తుతం ప్రొడ్యూసర్ చంద్రశేఖర్ ఈ విషయం చెప్పిన తర్వాత చాలామంది తేజసజ్జా ఇలాంటి విషయాలకు కూడా సపోర్ట్ చేస్తాడా అంటూ సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. సుడిగాలి సుదీర్ నటించిన గోట్ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో నిర్మాత చంద్రశేఖర్ ఈ విషయాన్ని రివిల్ చేశారు. ఈ సినిమాకి దర్శకుడు పేరు కూడా వేయలేదు.
Also Read: Divya Bharathi: సుధీర్ చేస్తున్న సినిమాకి ఐటెం సాంగ్ కోసం పిలిచారు, దివ్యభారతి షాకింగ్ కామెంట్స్