Shivathmika Rajashekar: శివాత్మిక రాజశేఖర్… యాంగ్రీ యంగ్ మ్యాన్‌గా తెలుగు ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగిన రాజశేఖర్–నటి జీవితల కూతురన్న సంగతి తెలిసిందే. అయితే ఈ అమ్మడు ప్రస్తుతం చేతుల్లో సినిమాలు లేకపోవడాన్ని అస్సలు డైజెస్ట్ చేసుకోలేకపోతుంది. యస్.. అడపా దడపా సోషల్ మీడియాలో ఫోటో షూట్లు చేస్తూ కాలక్షేపం చేసే ఈ బ్యూటీ, తాజాగా ఒక ఇంటర్వ్యూలో చేసిన నెపోటిజం పై కామెంట్స్ చూస్తుంటే ఆమెలోని ‘ఫ్రస్ట్రేషన్’ పీక్స్‌కు వెళ్లిపోయిందని అర్థమవుతోంది. ఇండస్ట్రీలో తనకి అవకాశాలు రాకపోతే తనని తాను సరిదిద్దుకోవాలి కాని, మొత్తం ఇండస్ట్రీని, చివరికి సోషల్ మీడియాను కూడా నిందించడమే ఇక్కడ హాట్ టాపిక్‌గా మారిపోయింది.
రాజశేఖర్ కూతురు కాకపోతే ఛాన్స్ వచ్చేదా?
శివాత్మిక నెపోటిజం గురించి మాట్లాడుతూ.. అది కేవలం ఎంట్రీ వరకే అని చాలా తెలివిగా మాట్లాడేసింది. నిజానికి అసలు రాజశేఖర్–జీవితల కుమార్తె అన్న ట్యాగ్ లేకపోతే శివాత్మికకి మొదటి సినిమా అంత ఈజీగా వచ్చేదా అన్నది ఇక్కడ అసలు ప్రశ్న. బయట ఎంతో మంది టాలెంటెడ్ ఆర్టిస్టులు ఎలాంటి అవకాశం దొరకకపోయినా కాళ్లు అరిగేలా తిరుగుతుంటే, ఎలాంటి కష్టం లేకుండా దొరసాని సినిమా ఛాన్స్ పట్టేసిన శివాత్మిక నెపోటిజం గురించి క్లాసులు పీకడం అంటే అదో పెద్ద జోక్ అంటూ చెడుగుడు ఆడేస్తున్నారు నెటిజన్లు.
ఇన్‌స్టాగ్రామ్‌పై పడి ఏడవడం ఏంటో
అయితే ఈ అమ్మడు ఈ మధ్య సినిమాలు లేక ఖాళీగా ఉంటున్న సంగతి తెలిసిందే. అయితే దానికి కారణం ఆమె దగ్గర ‘కంటెంట్’ లేకపోవడం కాదట.. ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్స్ తక్కువగా ఉండటమేనట! ఈ విషయాన్నే చాలా సీరియస్‌గా చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ.
ALSO READ:ప్రశాంత్ నీల్ సెట్స్ నుండి క్రేజీ లీక్… ‘డ్రాగన్’ యాక్షన్ విజువల్స్ వైరల్!
కంటెంట్ క్రియేటర్‌ని కాదు అంటూ కవరింగ్
వాస్తవానికి ఈరోజుల్లో యాక్టర్స్ ఎవరైనా తమకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకుంటున్న వాళ్లే. ఇక సోషల్ మీడియాలో ఫాలోయింగ్, క్రేజ్ ఉంటేనే మేకర్స్ కోట్లు ఖర్చు పెడతారన్న సంగతి తెలిసిందే. కానీ నెట్టింట్లో ఫాలోవర్స్‌ని పెంచుకోకుండా ఫెయిల్ అయిన శివాత్మిక, దాన్ని కవర్ చేసుకోవడానికి సినిమా క్యాస్టింగ్ ప్రాసెస్‌నే తప్పు పట్టడమే కాస్త విడ్డూరం.
క్రేజ్ తెచ్చుకున్న వారిపై బురద
ఇకపోతే రంగమార్తాండలో అవకాశం తన టాలెంట్ వల్లే వచ్చిందని సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటుంది. కానీ ఆ తర్వాత చేసిన సినిమా ఏదో కూడా ఆడియన్స్‌కి గుర్తు లేదు. మరి ఆ తర్వాత ఛాన్స్‌లు ఎందుకు రావట్లేదో దొరసానే సెలవివ్వాలి. తనకు కాదని ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నవారిని తీసుకున్నారని అనడం అంటే కష్టపడి సోషల్ మీడియాలో క్రేజ్ తెచ్చుకున్న ఇతర హీరోయిన్లపై ఆమె తన అసూయను బయటపెట్టుకోవడమే.
ఏది ఏమైనా సినిమా అంటేనే ఒక రన్నింగ్ రేస్. ఇక్కడ మిగతావారితో సమానంగా పరిగెట్టాలంటే కాలానికి తగ్గట్టుగా అప్‌డేట్ అవ్వాల్సిందే. కానీ శివాత్మిక మాత్రం ఇంకా అప్‌డేట్ అవ్వకుండా, తన ఫెయిల్యూర్స్‌ని కవర్ చేసుకోవడానికి ఇండస్ట్రీ మీద, సోషల్ మీడియా మీద నెగెటివ్ కామెంట్స్ చేయడం అంటే అది స్వయంగా కెరీర్‌కి ఎండ్ కార్డ్ వేసుకున్నట్టే.
చూడాలి మరి ముందు ముందు అయినా రియాల్టీని అర్థం చేసుకొని అప్‌డేట్ అవుతుందా లేక ఇలాగే ఇన్ఫ్లూయెన్సర్స్ మీద పడి వైరల్ ఇంటర్వ్యూలకే పరిమితమవుతుందా?
ALSO READ:మెక్సికో గడ్డపై రాజమౌళి ‘మైండ్ గేమ్’.. గ్లోబల్ బాక్సాఫీస్ టార్గెట్‌గా ‘వారణాసి’ మాస్టర్ ప్లాన్!