E-Paper
Advertisement

కేవలం 3 వస్తువులతో కమ్మని వెనీలా ఐస్‌క్రీమ్.. పిల్లల ఫేవరెట్ డిజర్ట్ అయిపోద్ది!

కేవలం 3 వస్తువులతో కమ్మని వెనీలా ఐస్‌క్రీమ్.. పిల్లల ఫేవరెట్ డిజర్ట్ అయిపోద్ది!
Advertisement

Homemade Vanilla Ice Cream: వేసవి కాలం వచ్చిందంటే చాలు పిల్లల నుండి పెద్దల వరకు అందరూ కోరుకునేది చల్లచల్లని ఐస్‌క్రీమ్. అయితే బయట కొనే ఐస్‌క్రీమ్‌లలో రంగులు, ప్రిజర్వేటివ్స్ ఉంటాయనే భయం ఉంటుంది. అలాంటప్పుడు కేవలం పాలు, పంచదారతో ఇంట్లోనే అచ్చం పార్లర్ స్టైల్‌లో ఉండే ఐస్‌క్రీమ్‌ను మనం సులభంగా తయారు చేసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు:

చిక్కని పాలు – అర లీటరు (ఫుల్ క్రీమ్ మిల్క్)
పంచదార – ఒక కప్పు (తీపిని బట్టి)
ఫ్రెష్ క్రీమ్ లేదా పాల మీగడ – ఒక కప్పు
కార్న్ ఫ్లోర్ – రెండు చెంచాలు
వెనీలా ఎసెన్స్ – ఒక చెంచా

Advertisement

Also Read: గ్యాస్‌ స్టవ్‌తో పనిలేదు.. 5 నిమిషాల్లో రెడీ అయ్యే కుకుంబర్ సలాడ్, ఆరోగ్యానికి ఎంతో మేలు!

తయారీ విధానం ఇలా:

ఒక మందపాటి గిన్నెలో పాలు పోసి బాగా మరిగించాలి. పాలు మరుగుతున్నప్పుడు ఒక చిన్న గిన్నెలో రెండు చెంచాల కార్న్ ఫ్లోర్ తీసుకుని, అందులో కొంచెం పాలు పోసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని మరుగుతున్న పాలలో వేస్తూ గరిటతో తిప్పుతూ ఉండాలి. పాలు చిక్కబడిన తర్వాత అందులో పంచదార వేసి కరిగే వరకు ఉంచి, స్టవ్ ఆపేసి పక్కన పెట్టుకోవాలి.

Advertisement

ఈ మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత, అందులో ఫ్రెష్ క్రీమ్, వెనీలా ఎసెన్స్ వేసి మిక్సీలో ఒకసారి బాగా బ్లెండ్ చేయాలి. ఇలా చేయడం వల్ల ఐస్‌క్రీమ్ చాలా సాఫ్ట్‌గా వస్తుంది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక ఎయిర్ టైట్ బాక్స్‌లో పోసి మూత పెట్టి, 3 గంటల పాటు డీప్ ఫ్రిజర్‌లో ఉంచాలి. ఆ తర్వాత మళ్లీ బయటకు తీసి మరోసారి మిక్సీ పట్టి, తిరిగి అదే బాక్స్‌లో పోసి 7 నుండి 8 గంటల పాటు ఫ్రిజర్‌లో ఉంచితే వెనీలా ఐస్‌క్రీమ్ రెడీ.

ఈ విధానంలో ఇంట్లో తయారు చేసుకునే ఐస్‌క్రీమ్ వల్ల ప్రయోజనం ఏమిటంటే.. దీనిలో మనం ఎలాంటి కృత్రిమ రంగులు, హానికరమైన కెమికల్స్ వాడము. స్వచ్ఛమైన పాలు, మీగడ వాడటం వల్ల ఇది పిల్లల ఆరోగ్యానికి కూడా మంచిదే. పైగా తక్కువ ఖర్చుతో, పరిశుభ్రమైన వాతావరణంలో మనకు నచ్చిన ఫ్లేవర్స్‌తో దీన్ని తయారు చేసుకోవచ్చు. మన చేతులతో చేసిన తృప్తితో పాటు ఆ కమ్మని రుచి ఇంటిల్లిపాదికీ సంతోషాన్నిస్తుంది.

Also Read: ఇంటికి చుట్టాలొస్తే ఇలా ‘మటన్ కీమా ఉండల’ కూర చేసి పెట్టండి.. మీ వంటకు ఫిదా అయిపోతారు!

Related News

కొబ్బరి మసాలాతో కోస్తా స్టైల్ ఎండుచేపల పులుసు.. ఒక్కసారి తింటే లైఫ్‌లో టేస్ట్ మర్చిపోరు!

పిల్లలు ఇష్టంగా తినే ఈజీ బ్రేక్‌ఫాస్ట్.. బియ్యం లేకుండానే కరకరలాడే సాఫ్ట్ దోశ!

టేస్ట్ అట్లాస్ టాప్ లిస్ట్‌లో ఇండియన్ ఐస్‌క్రీమ్స్.. వీటిని హైదరాబాద్‌లోనే తినేయొచ్చని మీకు తెలుసా?

సమ్మర్ స్పెషల్.. శరీరానికి చలువ చేసే బెస్ట్ రైస్ డిషెస్ ఇవే!

తక్కువ వంట గ్యాస్‌తో రుచికరమైన భోజనం.. ఈ 7 వంటకాలను ట్రై చేయండి!

క్విక్ అండ్ ఈజీ.. 10 నిమిషాల్లో సిద్ధమయ్యే 7 సమ్మర్ నో-కుక్ మీల్స్

బెంగాల్ స్పెషల్.. జాల్ముడిని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు, జస్ట్ ఇవి ఉంటే చాలు!

ఒక్కసారి ఇలా సాంబార్ ట్రై చేసి చూడండి.. మళ్లీ మళ్లీ ఇదే కావాలంటారు!

Big Stories

Advertisement
×