BigTV English

Shraddha Kapoor: నా నుండి నువ్వు తప్పించుకోలేవ్.. అనుమానాలు రేకెత్తిస్తున్న శ్రద్ధా కపూర్ పోస్ట్!

Shraddha Kapoor: నా నుండి నువ్వు తప్పించుకోలేవ్.. అనుమానాలు రేకెత్తిస్తున్న శ్రద్ధా కపూర్ పోస్ట్!

Shraddha Kapoor: శ్రద్ధా కపూర్.. తనదైన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తున్న శ్రద్ధా కపూర్ (Shraddha Kapoor).. విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. కానీ సరైన సక్సెస్ లభించలేదు. ‘స్త్రీ 2’ వంటి చిత్రాలతో వినూత్నంగా అబ్బురపరిచిన శ్రద్ధా కపూర్ కి దీపికా పదుకొనే(Deepika Padukone), అలియా భట్ (Alia Bhatt) వంటి హీరోయిన్స్ కి లభించిన మద్దతు దక్కలేదని అభిమానులు కూడా వాపోతున్నారు. అంతేకాదు బాలీవుడ్ లో ఒక స్థానాన్ని సంపాదించుకోవడానికి ఇంకా పోరాడుతూనే ఉంది ఈ ముద్దుగుమ్మ. అటు తెలుగు ప్రేక్షకులకు ప్రభాస్ (Prabhas) ‘సాహో’ చిత్రంతో పరిచయమైన ఈమె.. ఇప్పుడు ఎన్టీఆర్ (NTR), ప్రశాంత్ నీల్ ( Prashanth Neel) కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం.


అనుమానాలు రేకెత్తిస్తున్న శ్రద్ధా కపూర్ పోస్ట్..

ఇటు సౌత్, అటు నార్త్ అని తేడా లేకుండా వరుస భాషలలో పాత్ర నచ్చితే గ్రీన్ సిగ్నల్ ఇస్తూ దూసుకుపోతున్న శ్రద్ధా కపూర్ తాజాగా “నా నుండి నువ్వు తప్పించుకోలేవు” అంటూ పెట్టిన ఒక పోస్ట్ సరికొత్త అనుమానాలు లేవనెత్తుతోంది. మరి శ్రద్ధా కపూర్ పెట్టిన పోస్ట్ ఇప్పుడు బాలీవుడ్ మొత్తం హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. ఈ పోస్టు అటు ప్రేమను, ఇటు వేదనను కలగలిపినట్లుగా ఆమె కవితా పదాలు కనిపించాయి. దీంతో అభిమానుల మనసులో ఏదో ప్రత్యేకమైన స్పందనను కూడా కలిగిస్తున్నాయి. అసలు శ్రద్ధా కపూర్ ఇలాంటి పోస్ట్ పెట్టడం వెనుక అర్థం ఏమిటి? అంటూ పలువురు ఆరా తీస్తున్నారు. మరి శ్రద్ధా కపూర్ పెట్టిన పోస్టులో ఏముందో ఇప్పుడు చూద్దాం.


నీడలా నీ వెంటే వస్తా – శ్రద్ధా కపూర్..

శ్రద్ధా కపూర్ తన పోస్టులో.. “నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు.. నేను నీ పక్కన కూర్చుంటాను. విచారంగా ఉన్నప్పుడు.. నిన్ను దగ్గరకు తీసుకోవడానికి వస్తాను.. నువ్వు తప్పి పోతావని నాకు తెలుసు, నువ్వు పారిపోతావని కూడా తెలుసు, కానీ నేను మాత్రం నిన్ను ఖచ్చితంగా కనుక్కుంటాను. నిన్ను ఇక్కడే ఉండేలా చేస్తాను. నువ్వు నా నుండి ఎంత దూరం వెళ్లాలని చూసినా.. నా నుండి నువ్వు తప్పించుకోలేవు.. నీడలా నీ వెంటే వస్తాను” అంటూ రాసుకుంది శ్రద్ధా కపూర్. ఇక ఇది చూసిన కొంతమంది ఇది ఈమె వ్యక్తిగత జీవితంలోని భావోద్వేగాల ప్రతిఫలంగా భావిస్తున్నారు

పోస్ట్ తో రూమర్స్ కి బలం చేకూర్చిన శ్రద్ధా కపూర్..

అసలు విషయంలోకి వెళ్తే శ్రద్ధ కపూర్ సినీ రచయిత రాహుల్ మోడీ (Rahul Modi) తో డేటింగ్ చేస్తున్నట్లు గత కొంతకాలం వార్తలు వినిపించాయి. పెళ్ళికూడా చేసుకోబోతున్నారని ఊహాగానాలు కూడా వినిపించాయి.అయితే దీనిపై ఎవరూ క్లారిటీగా స్పందించకపోవడంతో ఇవన్నీ రూమర్స్ అనుకున్నారు. కానీ ఇప్పుడు శ్రద్ధా కపూర్ పెట్టిన పోస్ట్ రూమర్స్ కి ఆజ్యం పోయడమే కాదు నిజంగానే శ్రద్ధ లవ్ లో ఉందేమో.. ఇక అతడు ఈమె నుండి దూరంగా వెళ్లాలనుకుంటున్నాడేమో.. అందుకే ఇలాంటి పోస్ట్ పెట్టింది అని కామెంట్లు చేస్తున్నారు ఏది ఏమైనా శ్రద్ధ పెట్టిన పోస్ట్ మాత్రం ఇప్పుడు ప్రతి ఒక్కరిని ఆలోచనలో ముంచేలా చేయడమే కాకుండా పలు అనుమానాలకి కూడా దారితీస్తోంది.

also read:Pushpa: ఏంటీ, “ఊ అంటావా”పాటనే కాపీ కొట్టారా.. దేవీ శ్రీ అసహనం!

Related News

Nagarjuna: ఆ దర్శకుడును పీడించిన నాగార్జున, చివరికి ఏం జరిగిందంటే?

AR Muragadas: అంత పెద్ద స్టేట్మెంట్ ఎందుకు మురగా, మీరు షెడ్డుకు పోయినందుకా?

AA22xA6: అల్లు అర్జున్ మూవీలో సీనియర్ హీరోయిన్.. ఎవరంటే?

Rachitha Ram: చూడ్డానికి అమాయకంగా ఉంది కానీ, అల్లాడించింది మామ

Prabhas: క్రిస్టియన్ అమ్మాయితో లవ్ లో పడ్డ ప్రభాస్, ఇదెక్కడి ట్విస్ట్ సామి

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ అంటేనే తుఫాన్.. స్టార్ హీరో సంచలన ట్వీట్!

Big Stories

×