BigTV English

Pretiy Mukundan: కన్నప్ప హిట్ .. కనిపించని హీరోయిన్ .. విష్ణుతో గొడవే కారణం ?

Pretiy Mukundan: కన్నప్ప హిట్ .. కనిపించని హీరోయిన్ .. విష్ణుతో గొడవే కారణం ?

Pretiy Mukundan: ఒక సినిమా హిట్ అయ్యింది అంటే .. అందులో హీరో , హీరోయిన్ పాత్ర చాలా ఎక్కువ ఉంటుంది. సినిమా అనౌన్స్ మెంట్ నుంచి రిలీజ్ అయ్యాకా  సక్సెస్ అందుకొనేవరకు వారే ముందుండి నడిపిస్తారు. సక్సెస్ అయ్యాకా.. హీరోకన్నా హీరోయిన్ కు ఎక్కువ పేరు వస్తుంది. సినిమా తరువాత  ఆమెకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ కూడా వస్తుంది. ఇవన్నీ కూడా ఒక హీరోయిన్ ను స్టార్ గా నిలబెడతాయి. ఆ స్టార్ డమ్ కోసమే ప్రతి హీరోయిన్ కష్టపడుతుంది. అయితే ఒక హీరోయిన్ మాత్రం సినిమా చేసి హిట్ అందుకున్నా కూడా.. అసలు తనకేమి తెలియదు అన్నట్లు పట్టించుకోవడమే మానేసింది. అసలు ఆ హీరోయిన్ ఎవరు.. ? ఆ సినిమా ఏంటి.. ? అనేది చూద్దాం.


 

మంచు విష్ణు హీరోగా ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన చిత్రం కన్నప్ప. మోహన్ బాబు ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమా ఈ శుక్రవారం రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది.  ఇక సినిమాలో విష్ణు సరసన ప్రీతి ముకుందన్ హీరోయిన్ గా నటించింది. నెమలి పాత్రలో ఆమె నటనకు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఒకపక్క అందంతోనే కాదు.. నటన పరంగా కూడా ప్రీతి అదరగొట్టేసింది. కన్నప్ప సినిమా మంచి విజయం సాధించడంలో ప్రీతి కూడా ఒక భాగమయ్యిందని చెప్పొచ్చు.


 

అయితే మొదటి నుంచి కూడా కన్నప్పను మంచు విష్ణు తన భుజాల మీద వేసుకున్నాడు. సినిమా మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు విష్ణు తప్ప మీడియా ముందుకు ఎవరూ రాలేదు. చివరకు ప్రీ రిలీజ్ ఈవెంట్ కు కూడా ప్రీతి రాలేదు. అసలేమైంది.. ? ఎందుకు హీరోయిన్ కన్నప్పను దూరంగా ఉంది అనేది మిస్టరీగా మారింది. ప్రీతి సినిమాలో చిన్న పాత్ర మాత్రమే చేయలేదు.  కత్తి విన్యాసాలు, యుద్దాలు, యాక్షన్ సీక్వెన్స్ లో కనిపిస్తుంది. విష్ణుతో రొమాన్స్ కూడా చేసింది.

 

కన్నప్ప సినిమా వలన ఆమెకు మంచి పేరు వచ్చింది. అంత పేరు వచ్చినా.. ప్రీతి  సినిమా గురించి ఒక్క పోస్ట్ పెట్టలేదు. ప్రమోషన్స్ ఒక్కసారి కనిపించలేదు. సక్సెస్ అందుకున్నాకా కూడా కనీసం ప్రేక్షకులను పలకరించలేదు. అసలు ఏ హీరోయిన్ అయినా ఇలా చేస్తుందా అని నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. కన్నప్ప సినిమాలో నెమలి పాత్రకు ముందు నుపూర్ సనన్ ను తీసుకున్న విషయం తెల్సిందే. డేట్స్ సర్దుబాటు కాక ఆమె షూటింగ్ మొదలుకాకముందే కన్నప్ప నుంచి తప్పుకుంది. ఓ = ఇక ఆమె ప్లేస్ లో ప్రీతి వచ్చింది. అప్పుడు ఒక పోస్ట్ పెట్టింది.

 

కన్నప్పలో నటించడం ఆనందంగా ఉంది అని.. అంతే ఇప్పటివరకు కన్నప్ప గురించిన ఇంకో పోస్ట్ ఆమె ఇన్స్టాగ్రామ్ లో లేదు అని చెప్పొచ్చు. అప్పటికే ప్రీతి ఆసాకూడా అనే సాంగ్ తో బాగా పాపులర్ అవ్వడంతో .. ఆ హైప్ కూడా కన్నప్పకు బాగా కలిసి వచ్చింది. అయితే అందుతున్న సమాచారం ప్రకారం  న్యూజిలాండ్ లో షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆమెకు, విష్ణుకు గొడవ జరిగిందని, చిత్ర బృందాన్ని ఇబ్బందిపెట్టడంతో.. విష్ణు ఫైర్ అయ్యాడని, సినిమా చేసి వెళ్ళిపో అనడంతో ఆమె షూటింగ్ ఫినిష్ చేసి వెళ్లిపోయిందని, అందుకే ఆ తరువాత ఎక్కడా కనిపించలేదని చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ గా మారింది.

Related News

Coolie: ట్రెండ్ సెట్ చేసిన మోనికా సాంగ్.. ఎవరీ మోనికా బెలూచీ?

War 2: ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ కి బ్రేక్!

Allu Arjun: అల్లుఅర్జున్‌కు అధికారుల షాక్.. నేనొక ఫేమస్ నటుడ్ని, అయినా వినలేదు

Film industry: కాల్పుల్లో ప్రముఖ రాపర్ సింగర్ మృతి!

Coolie Vs War 2: రాజకీయ చిచ్చు లేపిన లోకేష్.. ఎన్టీఆర్ ను దెబ్బతీయడానికేనా?

War 2: ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సర్వం సిద్ధం.. కానీ ఆంక్షలు తప్పనిసరి!

Big Stories

×