Railways Economy Meal| రైలు ప్రయాణం చేసే సమయంలో భోజనం పరిశుభ్రంగా ఉండదు. ఇది అనేకసార్లు అనేక ప్రయాణికులు చేసే ఫిర్యాదు. పైగా ఆ భోజనం కూడా చాలా ఖరీదుగా ఉంటుంది. కానీ ఆ సమయంలో వేరే ప్రత్యామ్నాయం లేక చాలా మంది ప్రయాణికులు ఆ ఆహారంతోనే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి. ఈ సమస్యపై చాలామంది ప్రయాణికులు రైల్వే అధికారులకు ఫిర్యాదులు చేస్తునే ఉన్నారు. అందుకే రైల్వే శాఖ ప్రయాణికుల సమస్యలకు పరిష్కారంగా చర్యలు తీసుకుంటోంది.
ఈ నేపథ్యంలో భారతీయ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) గత సంవత్సరం భారతీయ రైల్వేతో కలిసి.. సాధారణ బోగీలలో ప్రయాణించే ప్రయాణికులకు సరసమైన ధరల్లో పరిశుభ్రమైన భోజనం, స్నాక్స్ అందించే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ ఎకానమీ మీల్స్ (తక్కువ ధరలో లభించే భోజనం) ధర కేవలం రూ.15లే. మధ్యతరగతి, పేదలకు సౌకర్యం కోసంమే రైలు ప్రయాణ సమయంలో ఇలాంటి భోజనం అందిస్తోంది. ఇప్పుడు, ఈ రూ.15 భోజనంలో ఏముందో చూపించే ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోపై నెటిజెన్లు రకరకాలు స్పందిస్తున్నారు.
ఈ వీడియో సోషల్ మీడియా ఎక్స్‌లో షేర్ చేయగా.. ఇందులో ‘జనతా ఖానా’ అనే ఈ భోజనంలో ఏడు పూరీలు, భాజీ (కుర్మా), పచ్చడి ఉన్నాయి. ఈ భోజనం రూ.15కి అందుబాటులో ఉంది. ఈ కార్యక్రమం ఉద్దేశం.. ప్రయాణికులకు తక్కువ ధరలో పరిశుభ్రమైన, ఆకలి తీర్చే ఆహారాన్ని అందించడం. అంతేకాకుండా, రూ.20కి అదే భోజనం 300 మి.లీ. నీటి బాటిల్‌తో కూడా అందుబాటులో ఉంది. అంటే రూ.5 కే వాటర్ బాటిల్ అన్నమాట.
ఈ వీడియో షేర్ చేయబడినప్పటి నుండి 8 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. సోషల్ మీడియాలో చాలా మంది ఈ వీడియో చూసి రైల్వే ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమాంపై సానుకూలంగా స్పందిస్తూ.. స్వాగతించారు. ఈ భోజనం.. సౌలభ్యం, నాణ్యతను ప్రశంసించారు.
“ఇంత తక్కువ ధరలో నిజంగా బాగుంది, ప్రతి రైల్వే స్టేషన్‌లో ఇది అందుబాటులో ఉండాలి,” అని ఒక యూజర్ కామెంట్ చేశాడు. “సమయం తక్కువగా ఉన్నవారికి, డబ్బుల కొరత ఉన్న పేదవారికి లేదా ఆహారం కొనలేని వారికి ఇది చాలా ఉపయోగకరం,” అని మరొకరు కామెంట్ లో అభిప్రాయపడ్డారు.
“కేవలం రూ.15కే పూర్తి భోజనం – ఇది నిజమైన ప్రజా సేవ లాగా ఉంది! జనతా ఖానా తక్కువ ధరతో ప్రయాణికులకు మంచి సౌకర్యం. ప్రయాణంలో ఎవరూ ఆకలితో ఉండరు. భారతీయ రైల్వేకు అభినందనలు,” అని మూడవ ఎక్స్ యూజర్ వ్యాఖ్యానించారు.
“ఇది చాలా మంచి ప్రయత్నం! రైలు ప్రయాణంలో ఫైవ్ స్టార్ రెస్టారెంట్‌ల భోజనం అవసరం లేదు. ఇలాంటి మంచి ఆహారం ఉంటే చాలు. ఇంత కంటే మంచి ఆహారం కావాలంటే ఇంటి నుండి తెచ్చుకోండి,” అని మరొకరు అన్నారు.
“ఇది చాలా బాగుంది – నేను జనతా భోజనం తిన్నాను, ఇది రుచికరంగా ఉంటుంది. కడుపు నిండుగా ఉంటుంది. అయితే, ఇది అన్ని రూట్‌లలో అందుబాటులో ఉండాలి,” అని ఒక యూజర్ షేర్ చేశాడు.
“ఈ ధరకు ఇది చాలా బాగుంది. ఇంతకంటే ఎక్కువ ఇవ్వాలంటే, నిజంగా సబ్సిడీ అవసరం. రోడ్డు పక్కన దొరికే చెత్త స్టాల్‌లో కూడా రూ.15కి ఇంత ఆహారం దొరకదు,” అని మరొకరు రాశారు.
Also Read: దురంతో ఎక్స్‌ప్రెస్‌లో దోపిడి.. రైలు అక్కడికి చేరగానే.. పక్కా ప్లాన్‌తో..
అయితే, కొందరు వినియోగదారులు ఈ భోజనాన్ని విమర్శించారు, ఆహారం సామాన్యంగా ఉందని, నాణ్యత తక్కువగా ఉందని చెప్పారు. “భారతీయ రైల్వేలో ఆహారం పరిమాణంలో సమస్య లేదు; నిజమైన సమస్య నాణ్యతలో ఉంది,” అని ఒక వినియోగదారు అన్నారు. “ఇలాంటి ఆహారాన్ని ఎందుకు ఇస్తారో అర్థం కాదు. ఇది ఏ విధంగా ఆరోగ్యకరం? పరిశుభ్రంగా తయారు చేశారో లేదో? తాజాగా ఉందో? లేదో?” అని మరొకరు విమర్శించారు.
🚨 Janata Khana: Indian Railways’ Affordable Meal Scheme for Just ₹15. 🚆🇮🇳 pic.twitter.com/hFcoogwQbv
— Gems (@gemsofbabus_) June 26, 2025