Pushpa: పుష్ప (Pushpa).. అల్లు అర్జున్(Allu Arjun), సుకుమార్ (Sukumar) కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రం సంచలనం సృష్టించింది. అల్లు అర్జున్ కెరీర్లో తొలి పాన్ ఇండియా చిత్రంగా వచ్చిన ఈ సినిమా ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది.. అంతేకాదు బాలీవుడ్ లో రూ.100 కోట్ల క్లబ్ లో చేరి అల్లు అర్జున్ కి మంచి మార్కెట్ అందించింది. పైగా ఈ సినిమాతో ఉత్తమ నటుడిగా తొలి నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు హీరోగా కూడా అల్లు అర్జున్ రికార్డ్ సృష్టించారు.
“ఊ అంటావా.. ఊహూ అంటావా” ఇండస్ట్రీని ఊపేసిన దేవిశ్రీ.
పుష్పరాజ్ గెటప్ లో అల్లు అర్జున్.. “తగ్గేదేలే” అనే సిగ్నేచర్ డైలాగ్ తో పాటు ప్రతిదీ కూడా ఈ సినిమాలో హైలెట్గా నిలిచింది. మంగళం శీను, ద్రాక్షాయని ఇలా ప్రతి ఒక్క పాత్ర కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. పైగా ఇందులో హీరోయిన్గా నటించిన రష్మిక మందన్న (Rashmika mandanna) శ్రీవల్లి పాత్రలో ఒదిగిపోయింది. అంతేకాదు ఇక్కడ మరో సంచలనం స్పెషల్ సాంగ్ అని చెప్పాలి. స్టార్ హీరోయిన్గా స్టార్ హీరోల సినిమాలలో నటిస్తూ భారీ పాపులారిటీ అందుకున్న సమంత (Samantha ) తన భర్త నాగ చైతన్య నుండి విడాకులు తీసుకున్న తర్వాత అల్లు అర్జున్ (Allu Arjun) కోసం పుష్ప సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది. దేవిశ్రీప్రసాద్ (Devi Sri Prasad) మ్యూజిక్ అందించిన “ఊ అంటావా.. ఊహూ అంటావా” అనే పాటతో యువతను ఉర్రూతలూగించింది. ముఖ్యంగా ఈ పాటలో సమంత తప్ప మరెవరూ చేయలేరు అనేంతగా తన అద్భుతమైన పర్ఫామెన్స్ తో అందరినీ అబ్బురపరిచింది. తెలుగు ఇండస్ట్రీ మొదలుకొని హాలీవుడ్ వరకు చాలామంది ఈ పాటను తెగ వైరల్ చేశారు.
హాలీవుడ్ ఇండస్ట్రీ కాపీ కొట్టారంటున్న దేవిశ్రీ..
అయితే అలాంటి ఈ పాట ఇప్పుడు కాపీ కొట్టారు అంటూ ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ చేసిన కామెంట్లు సంచలనంగా మారుతున్నాయి. ముఖ్యంగా హాలీవుడ్ సినీ పరిశ్రమ తన పాటను కాపీ కొట్టారు అంటూ చేసిన కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి. అసలు విషయంలోకి వెళ్తే ఇటీవల “దిల్ రాజు డ్రీమ్స్” ఈవెంట్లో పాల్గొన్న దేవిశ్రీప్రసాద్ మాట్లాడుతూ.. “ప్రతి ఒక్కరి జీవితంలో ఫెయిల్యూర్ అనేది సహజం. ఏదైనా క్రియేట్ చేసేటప్పుడు ఎనర్జీని సేవ్ చేసుకోకూడదు. ఐదు నిమిషాల్లో క్రియేట్ చేసిన “ఊ అంటావా.. ఊహూ అంటావా మావ సాంగ్ ని ఇప్పుడు ఎక్కడో హాలీవుడ్లో ఎవరో కాపీ కొట్టారు. వారి మీద కేసు వేయాలా? లేక ఏం చేయాలా? అని ఆలోచిస్తున్నాను.
అదీ మన రేంజ్ – దేవి శ్రీ ప్రసాద్
ఒక ఇండియన్ మ్యూజిక్ డైరెక్టర్ చెన్నైలోని తన స్టూడియోలో కూర్చొని ఐదు నిమిషాల్లో పాటను క్రియేట్ చేస్తే.. దానిని కూడా హాలీవుడ్ వాళ్ళు కాపీ కొట్టారు అంటే ఇదొక రికార్డు అంటూ దేవిశ్రీప్రసాద్ కామెంట్లు చేశారు. అయితే వాడు కాపీ కొట్టినందుకు బాధ లేదు.. వాడు కాపీ కొట్టినందుకు మరింత సంతోషంగా ఉంది. అది మన రేంజ్ అని. చెప్పుకొచ్చారు దేవిశ్రీప్రసాద్. ప్రస్తుతం దేవిశ్రీప్రసాద్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
ALSO READ:Tamannaah: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తమన్నా.. మరీ ఇంతలా పెంచేసిందేంటి?
క్లాప్స్ కొట్టేటప్పుడు, క్రియేట్ చేసేటప్పుడు ఎనర్జీ సేవ్ చేసుకోకూడదు ..
నా పాటను హాలీవుడ్ లో ఒకడు కాపీ కొట్టి, "అదీ మన రేంజ్" అని వాడు నిరూపించాడు..
– Devi Sri Prasad#DilRajuDreams pic.twitter.com/sSfiuCtfAa
— idlebrain.com (@idlebraindotcom) June 28, 2025