Shruti Haasan : కోలీవుడ్ మల్టీ టాలెంటెడ్ శ్రుతి హాసన్ త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతుందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది. తన తండ్రి లోకనాయకుడు కమల్ హసన్ కూతురి కోసం ఇప్పుడు పెళ్లి సంబంధాలు వెతికే పనిలో పడ్డాడని, 40 ఏళ్లకు చేరుకున్న తన కూతురికి ఒక మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసేందుకు డిసైడ్ అయ్యాడని కోడై కూస్తుంది కోలీవుడ్.
స్వయంగా అబ్బాయిని వెతికే పనిలో
నిజానికి శృతి గతాన్ని పరిశీలిస్తే ఖచ్చితంగా లవ్ మ్యారేజే చేసుకుంటుంది అనుకున్నారు అంతా. కానీ మొదలెట్టిన ఏ ప్రేమాయణం కూడా చివరి వరకు రాలేకపోవడంతో ఆ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని కమల్ హసనే స్వయంగా రంగంలోకి దిగి అబ్బాయిని వెతికే పనిలో పడ్డాడన్న టాక్ వినిపిస్తుంది. ఎక్కడో తెలియని కుర్రాడి కంటే తన మిత్రులు లేదా బంధువుల ద్వారా తెలిసిన కుటుంబం నుంచి వచ్చిన అబ్బాయి అయితే బాగుంటుందని అనుకుంటున్నాడట కమల్. ఇక ఇప్పటికే కొన్ని సంబంధాలను కూడా షార్ట్ లిస్ట్ చేశారని సమాచారం.
శృతి హసన్ విషయానికి వస్తే
కమల్ డాటర్‌గా మల్టీట్యాలెంటెడ్ బ్యూటీగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ తమిళ భామ మొదట్లో ఐరన్ లెగ్ అన్న ట్యాగ్ వేసుకోవడంతో చాలా సినిమాలు చేజారిన పరిస్థితి. సరిగ్గా అదే సమయంలో వచ్చిన గబ్బర్ సింగ్ ఈ అమ్మడి కెరీర్‌నే మార్చేసిందని చెప్పాలి. ఇక ఆ తర్వాత వచ్చిన శ్రీమంతుడు, క్రాక్, వాల్తేరు వీరయ్య వంటి బ్లాక్‌బస్టర్ హిట్లతో సాలిడ్ సక్సెస్‌లను తన ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే.
ఫలించని ప్రేమాయణాలు
అయితే సినిమా కెరీర్‌ను సాలిడ్‌గా కంటిన్యూ చేసిన శృతికి పర్సనల్ లైఫ్‌లో మాత్రం బోలెడన్ని లవ్ బ్రేకప్‌లను మూటగట్టుకుంది. అనగనగా ఓ ధీరుడు సమయంలో హీరో సిద్ధార్థ్‌తో సీరియస్ రిలేషన్‌లో ఉండి కొన్నాళ్లు సహజీవనం కూడా చేసిందని ఇండస్ట్రీలో వినిపించే టాక్.
ఇక ఆ తర్వాత 3 సినిమా సమయంలో ధనుష్‌తో, అలాగే నాగచైతన్య వంటి స్టార్ హీరోలతోనూ ప్రేమాయణాలు పలికించిందని రూమర్స్ వినిపించాయి. అలాగే క్రికెటర్ సురేష్ రైనాతో ఈ అమ్మడి బంధం నెక్స్ట్ లెవల్‌కు వెళ్ళిందంటూ అప్పట్లో గాసిప్స్ గట్టిగానే చక్కర్లు కొట్టాయి.ఇక ఫారినర్ మైఖెల్ కోర్సలేతో పీక్స్‌లో డేటింగ్ చేసి, పెళ్లి పీటల వరకు వెళ్తుందనుకుంటున్న సమయంలో ఇద్దరి మధ్య బ్రేకప్ పడిపోయింది. ఇక చివరగా ముంబైకి చెందిన డూడుల్ ఆర్టిస్ట్ శంతను హాజారికాతోనూ చాలా రోజులే డేటింగ్ చేసినా అది కూడా చివరి వరకు కొనసాగని పరిస్థితి.
ఆ లక్కీ ఫెల్లో ఎక్కడున్నాడో
ఇక ఈ అనుభవాలన్నీ దృష్టిలో పెట్టుకున్న కమల్ ఈసారి తనే అబ్బాయిని వెతికే పనిలో పడ్డాడన్న మాట. ఏది ఏమైనా శృతి హసన్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న వార్త ఇప్పుడు నెట్టింట్లో హాట్ టాపిక్ అయిపోయింది. చూడాలి మరి తన గారాలపట్టి కోసం కమల్ వెతుకుతున్న ఆ లక్కీ ఫెల్లో ఎక్కడున్నాడో!
also read:టాలీవుడ్ బాక్సాఫీస్ అట్టర్ ప్లాప్.. థియేటర్ల దగ్గర ఈగలు తోలుకోవాల్సిందేనా?