E-Paper
Advertisement

అదృష్టం కోసం చూస్తున్నారా? అయితే.. ఈ 5 వస్తువులకు దూరంగా ఉండండి!

అదృష్టం కోసం చూస్తున్నారా? అయితే.. ఈ 5 వస్తువులకు దూరంగా ఉండండి!
Advertisement

Akshaya Tritiya 2026: అక్షయ తృతీయ అంటేనే.. అపారమైన అదృష్టాన్ని ఇచ్చే రోజు. ఏ పని చేసినా.. ఏ వస్తువు కొన్నా అది ‘అక్షయం’ అవుతుందని మన నమ్మకం. అందుకే.. ఈ రోజున బంగారం కొనడానికి అందరూ పోటీ పడతారు. అయితే.. ఈ పవిత్రమైన రోజున మనం చేసే కొన్ని చిన్న తప్పులు, కొనే కొన్ని వస్తువులు మన ఇంట్లోకి.. ప్రతికూలతను తీసుకువస్తాయని జ్యోతిష్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అక్షయ తృతీయ నాడు పొరపాటున కూడా కొనకూడని.. ఆ 5 వస్తువులు ఏవో.. వాటి వల్ల కలిగే నష్టాలేంటో వివరంగా తెలుసుకుందాం.

హిందూ సంప్రదాయంలో.. అక్షయ తృతీయకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున చేసే దాన ధర్మాలు, కొనుగోలు చేసే.. వస్తువులు రెట్టింపు ఫలితాన్ని ఇస్తాయి. లక్ష్మీ దేవి అనుగ్రహం కోసం.. అందరూ బంగారం, వెండి వస్తువులను కొనుగోలు చేస్తారు. కానీ.. శాస్త్రాల ప్రకారం ఈ రోజున కొన్ని వస్తువులను ఇంటికి తీసుకురావడం వల్ల ఉన్న అదృష్టం కాస్తా దురదృష్టంగా మారే ప్రమాదం ఉంది.

Advertisement

అక్షయ తృతీయ రోజున మీరు కొనకూడని 5 ముఖ్యమైన వస్తువులు ఇవే..

1. పదునైన వస్తువులు:
చాలా మంది గృహిణులు అక్షయ తృతీయ శుభ్రతలో భాగంగా లేదా వంటగది అవసరాల కోసం.. కత్తులు, కత్తెర్లు, సూదులు వంటి పదునైన వస్తువులను కొంటుంటారు. కానీ.. ఈ పవిత్రమైన రోజున ఇలాంటి వస్తువులను అస్సలు కొనకూడదు. పదునైన వస్తువులు ఇంట్లో గొడవలకు, అశాంతికి , ప్రతికూల శక్తికి దారి తీస్తాయి. ఇవి సంబంధ బాంధవ్యాలను దెబ్బతీస్తాయని పండితులు చెబుతున్నారు.

Advertisement

2. ఐరన్ చేసిన వస్తువులు:
సాధారణంగా శని దేవుడికి ఐరన్ అంటే ఇష్టం. అయితే.. అక్షయ తృతీయ మహాలక్ష్మికి సంబంధించిన పండగ. ఈ రోజున ఇనుప సామాన్లు, ఇనుప పాత్రలు లేదా ఇతర పరికరాలను కొనడం వల్ల ఇంట్లోకి దారిద్ర్యం వచ్చే అవకాశం ఉంటుంది. ఇది లక్ష్మీ దేవికి ఆగ్రహం కలిగిస్తుందని నమ్మకం. మీరు.. ఏదైనా వాహనం కొనాలనుకున్నా.. అందులో ఇనుము వాటా ఎక్కువగా ఉంటుంది కాబట్టి, జ్యోతిష్య సలహా తీసుకోవడం మంచిది.

3. ప్లాస్టిక్, అల్యూమినియం పాత్రలు:
ఈ రోజున స్టీల్ లేదా రాగి పాత్రలు కొనడం శుభప్రదం. కానీ ప్లాస్టిక్ వస్తువులు, ప్లాస్టిక్ పాత్రలు లేదా అల్యూమినియం వస్తువులను కొనకండి. అల్యూమినియం రాహువుకు సంబంధించిన.. లోహంగా పరిగణించబడుతుంది. రాహువు ప్రభావం వల్ల ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు తలెత్తవచ్చు. లక్ష్మీ పూజ చేసే రోజున ఇలాంటి ‘అశుభ’ లోహాలను ఇంటికి తీసుకురావడం మంచిది కాదు.

4. నల్లటి బట్టలు:
అక్షయ తృతీయ రోజున కొత్త బట్టలు కొనుగోలు చేయడం ఆనవాయితీ. అయితే.. రంగుల విషయంలో.. జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా.. నలుపు రంగు బట్టలను అస్సలు కొనవద్దు. నలుపు ప్రతికూలతకు, శోకానికి సంకేతం. ఈ రోజున పసుపు, ఎరుపు లేదా తెలుపు రంగు బట్టలు ధరించడం లేదా కొనడం వల్ల సానుకూల శక్తి పెరుగుతుంది. నలుపు రంగు శని ప్రభావానికి గురి చేస్తుంది. ఇది మీ పురోగతిని అడ్డుకోవచ్చు.

5. అపరిశుభ్రమైన లేదా పాత వస్తువులు:
కొంత మంది తక్కువ ధరకు వస్తున్నాయని.. సెకండ్ హ్యాండ్ వస్తువులను లేదా పాత వస్తువులను ఈ రోజున ఇంటికి తెస్తుంటారు. అక్షయ తృతీయ అంటేనే.. కొత్తదనం. ఈ రోజున ఇతరులు వాడిన వస్తువులను కొనడం వల్ల వారిలోని ప్రతికూల శక్తి మీ ఇంటికి బదిలీ అయ్యే అవకాశం ఉంది. అలాగే చిరిగిన బట్టలు, పగిలిన వస్తువులను ఈ రోజున ఇంట్లో ఉంచుకోకూడదు.

అక్షయ తృతీయ రోజున.. బంగారం కొనలేకపోయినా పర్వాలేదు కానీ.. పైన చెప్పిన వస్తువులను కొని కష్టాలను కొనితెచ్చుకోకండి. ఈ రోజున ఉప్పు, పసుపు, లేదా మట్టి కుండ వంటి సామాన్యమైన వస్తువులు కొన్నా.. కూడా అది అదృష్టాన్ని ఇస్తుంది. మనసు ప్రశాంతంగా ఉంచుకుని.. దైవ ప్రార్థన చేస్తూ ఈ పండగను జరుపుకోండి.

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×