Shubha Divorce: శుభ పూంజా ..కన్నడ సినీ ఇండస్ట్రీలో తనదైన నటనతో గుర్తింపు తెచ్చుకున్నఈ ప్రముఖ నటి గురించి ఒక షాకింగ్ న్యూస్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతుంది. అందం, అభినయంతో ఒకప్పుడు సౌత్ స్క్రీన్‌పై మెరిసిన ఈ బ్యూటీ, ప్రస్తుతం 42 ఏళ్ళ వయసులో తన భర్తకి విడాకులు ఇచ్చేసిందన్న వార్త సోషల్ మీడియాలో మంటలు పుట్టిస్తుంది.నాలుగేళ్ళ క్రితం ఎంతో వైభవంగా జరిగిన తన పెళ్లి బంధానికి గుడ్‌బై చెప్పేస్తూ, భర్త నుంచి విడిపోయేందుకు ఆమె ఏకంగా కోర్టు మెట్లెక్కడం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
వివరాల్లోకి వెళ్తే… నటి శుభ పూంజా, ప్రముఖ వ్యాపారవేత్త సుమంత్ బిల్లావా కొన్నేళ్ల పాటు ప్రేమించుకుని 2022లో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు.కరోనా లాక్‌డౌన్ ఆంక్షల మధ్యలో అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగిన వీరి పెళ్లి జరిగింది.ఇక ఈ వేడుక అప్పట్లో కన్నడ మీడియాలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది కూడా.
దాదాపు నాలుగేళ్ల పాటు సాఫీగానే సాగుతోందని అందరూ భావించిన వీరి సంసారంలో గత కొంతకాలంగా మనస్పర్థలు తలెత్తినట్లు తెలుస్తోంది. ఇద్దరి మధ్య వచ్చిన విభేదాల కారణంగా ఇక కలిసి జీవించడం సాధ్యం కాదని గ్రహించిన ఈ జంట, మ్యూచువల్ అండర్ స్టాండింగ్ తో విడాకులు తీసుకోవాలని డిసైడ్ అయ్యారు. ఇందులో భాగంగానే బెంగళూరులోని ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించి, లీగల్‌గా విడిపోయేందుకు విడాకుల పిటిషన్ దాఖలు చేశారు.
శుభ పూంజా కెరీర్ విషయానికి వస్తే …కర్ణాటకకు చెందిన ఈ వెటరన్ భామ మోడలింగ్ రంగం ద్వారా కెరీర్ ప్రారంభించి, ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. 2004లో తమిళ చిత్రం ‘మాచీ’తో వెండితెరకు పరిచయమైన ఆమె, ఆ తర్వాత కన్నడ ఇండస్ట్రీలో స్టార్ హీరోల సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా 2008లో వచ్చిన బ్లాక్‌బస్టర్ మూవీ ‘మొగ్గినా మనసు’ చిత్రంలో ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలతో పాటు ఉత్తమ సహాయ నటిగా ప్రతిష్టాత్మక ఫిల్మ్‌ఫేర్ అవార్డు కూడా దక్కడం విశేషం. ఆ సినిమాలో యంగ్ రాధికా పండిట్‌తో కలిసి శుభ పూంజా చేసిన పర్ఫార్మెన్స్ ప్రేక్షకులకు ఇప్పటికీ గుర్తుండిపోతుంది. ఆ తర్వాత ‘చందా’, ‘స్లమ్ బాలా’, ‘తాకత్’ వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించి కన్నడ ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్‌గా ఎదిగారు.
also read :జూన్ 8న పూరీ మార్క్ విధ్వంసం.. విజయ్ సేతుపతి ‘స్లమ్ డాగ్ – 33 టెంపుల్ రోడ్’ క్రేజీ పోస్టర్ వైరల్!
కేవలం సినిమాలే కాకుండా బుల్లితెరపై కూడా శుభ పూంజా తన మార్క్ చూపించారు. స్ట్ రియాలిటీ షో అయిన ‘బిగ్ బాస్ కన్నడ సీజన్ 8’ లో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చి బుల్లితెర ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. హౌస్‌లో ఆమె ఉన్నంత కాలం తనదైన ఆటతీరుతో భారీగా ఫ్యాన్ బేస్‌ను సొంతం చేసుకున్నారు. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాతే సుమంత్ బిల్లావాతో ఆమె వివాహం జరిగింది.
పెళ్లయిన కొత్తలో భర్తతో కలిసి దిగిన క్యూట్ ఫోటోలను, టూర్ల విశేషాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఎంతో హ్యాపీగా కనిపించిన శుభ పూంజా, సడన్‌గా ఇలా డివోర్స్ నోటీసులతో కోర్టులో ప్రత్యక్షమవడం అభిమానులను డిసప్పాయింట్ చేస్తోంది. ముప్పై ఏళ్ల వయసులో ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్న ఈ నటి, 42 ఏళ్ల వయసులో ఇలా ఒంటరి కాబోతుండటం ఓ రకంగా షాకింగ్ అనే చెప్పాలి. ప్రస్తుతం ఈ న్యూస్ ఇంటర్నెట్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఇద్దరూ మ్యూచువల్ అండర్‌స్టాండింగ్‌తోనే విడిపోతుండటంతో కోర్టు కూడా వీరికి త్వరగానే లీగల్ డివోర్స్ మంజూరు చేసే అవకాశం ఉందని లీగల్ వర్గాలలో వినిపిస్తున్న మాట.ఏది ఏమైనా సినిమా లైఫ్‌లో ఎన్నో సక్సెస్‌లు చూసిన శుభ, పర్సనల్ లైఫ్‌లో ఇలాంటి బ్రేక్ డౌన్ ఫేస్ చేయాల్సి రావడం దురదృష్టకరమనే చెప్పాలి.
also read :సైలెంట్‌గా ‘సెంచరీ’ కొట్టేసిన వైష్ణవ్ తేజ్…ఈసారైనా హిట్ కొడతావా గురూ ?