E-Paper
Advertisement

బీహెచ్‌ఈఎల్ కార్మికుల పెన్నిధి.. ఎవరీ ‘జి. ఎల్లన్న’? హరీశ్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు!

బీహెచ్‌ఈఎల్ కార్మికుల పెన్నిధి.. ఎవరీ ‘జి. ఎల్లన్న’? హరీశ్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు!
Advertisement

G Ellanna: స్వేచ్చ బ్యూరో: కార్మిక నాయకుడు, శ్రమశక్తి అవార్డు గ్రహీత, తెలంగాణ ఉద్యమకారుడు స్వర్గీయ జి. ఎల్లన్న గారి 85వ జయంతి ఉత్సవాలు తెల్లాపూర్‌లోని జి. ఎల్లయ్య ఎన్‌క్లేవ్‌లో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు ముఖ్య అతిథిగా హాజరై, ఎల్లన్న గారి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సభలో పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి, ఎల్లన్న కుమారుడు విజయ్ ప్రతాప్, స్థానిక బీఆర్ఎస్ నాయకులు, కార్మిక సంఘాల ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

హరీశ్ రావు మాట్లాడుతూ..

Advertisement

ఈ సందర్భంగా హరీశ్ రావు గారు మాట్లాడుతూ, ఎల్లన్న గారు కేవలం ఒక కార్మిక నాయకుడిగానే కాకుండా, చివరి శ్వాస వరకు నిలిచిన గొప్ప తెలంగాణ ఉద్యమ యోధుడని కొనియాడారు. బీహెచ్‌ఈఎల్ ప్రాంతంలో ఎల్లన్న పేరు తెలియని వారు, ఆయన సేవలు అందుకోని వారు ఎవరూ లేరన్నారు. ఒక సాధారణ కార్మికుడిగా ప్రస్థానాన్ని ప్రారంభించి, బీహెచ్‌ఈఎల్ ఐఎన్‌టీయూసీ అధ్యక్షుడిగా, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మరియు జాతీయ స్థాయి ఉపాధ్యక్షుడిగా ఎదిగి కార్మికుల మన్ననలు పొందారని గుర్తుచేశారు. ఆనాడు మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, బాగా రెడ్డి, మల్లికార్జున్ వంటి పెద్దల సహకారంతో పోరాడి కార్మికుల కోసం ఎంఐజీ-2 కాలనీని సాధించిన అపర భగీరథుడు ఎల్లన్న అని అన్నారు.

భూములు కోల్పోయిన స్థానికులకే ఉద్యోగాలు

Advertisement

ఉత్తర భారతదేశం నుండి వస్తున్న వారికోసం ఇక్కడి స్థానిక రిజర్వేషన్లు తొలగించినప్పుడు, నా ప్రాణం పోయినా సరే.. భూములు కోల్పోయిన తెలంగాణ బిడ్డలకే ఉద్యోగాలు దక్కాలి అని సీఐఎస్ఎఫ్ యాజమాన్యంతో నిలబడి కొట్లాడిన గొప్ప స్థానిక పక్షపాతి ఎల్లన్న అని హరీశ్ రావు అన్నారు.
1969 తొలిదశ తెలంగాణ ఉద్యమంలో డీసీఎం వ్యాన్ నుండి దూకి రెండు కాళ్లు విరిగినా, ఆసుపత్రి మంచంపై నుంచే ‘జై తెలంగాణ’ అని నినదించిన పోరాట పటిమ ఆయనదన్నారు. మలిదశ ఉద్యమంలో కేసీఆర్ గారు పిలుపునివ్వగానే అండగా నిలిచి గల్లీ నుంచి ఢిల్లీ దాకా తెలంగాణ వాణిని బలంగా వినిపించారని గుర్తుచేశారు.

Also Read: పేదింటి ఆడబిడ్డలకు గుడ్ న్యూస్.. మీ పేరు మీదే సొంత ఇల్లు, మంత్రి పొంగులేటి సంచలన ప్రకటన!

కేసీఆర్ చొరవతో గంటలోనే ఆర్డర్స్..

తన ఆరోగ్యం, కుటుంబం గురించి కాకుండా నిరంతరం కార్మికులు, తెలంగాణ రాష్ట్రం కోసమే ఆలోచించిన నిస్వార్థ నాయకుడు కాబట్టే, ఈరోజు పార్టీలకు అతీతంగా అందరూ ఆయనను గుండెల్లో పెట్టుకున్నారని హరీశ్ రావు పేర్కొన్నారు. తెల్లాపూర్‌లోని ఈ కాలనీ ఫైనల్ లేఅవుట్ సమస్య వచ్చినప్పుడు ఎల్లన్న, మహిపాల్ రెడ్డి, సోమిరెడ్డి తన వద్దకు వచ్చారని.. నాటి సీఎం కేసీఆర్ గారితో రాత్రి 10 గంటలకు ఫోన్ లో మాట్లాడి కేవలం గంట వ్యవధిలో ఆర్డర్స్ తెప్పించి ‘జి. ఎల్లయ్య ఎన్‌క్లేవ్’ ఏర్పాటుకు అండగా నిలిచామని తెలిపారు.

12 అడుగుల భారీ కాంస్య విగ్రహం

ప్రస్తుతం ఆవిష్కరించిన విగ్రహం ఎల్లన్న గారి స్థాయికి తగినట్లుగా లేదని అభిప్రాయపడిన హరీశ్ రావు.. ఆయన ధోతీ కట్టుకొని, పంచెకట్టుతో సగర్వంగా నిలబడేలా 12 అడుగుల భారీ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిని కోరారు. రాబోయే రెండు నెలల్లో రానున్న ఎల్లన్న గారి వర్ధంతి నాటికల్లా ఎల్‌ఐజీ సర్కిల్‌లో గానీ, తగిన స్థలంలో గానీ ఈ 12 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించే బాధ్యతను ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి గారికి అప్పగిస్తున్నట్లు హరీశ్ రావు ప్రకటించారు. భౌతికంగా ఆయన మన మధ్య లేకపోయినా బీహెచ్‌ఈఎల్ ఉన్నంత కాలం ఎల్లన్న గారి పేరు కార్మికుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి ఉంటుందని నివాళులర్పించారు.

Also Read: పేదింటి ఆడబిడ్డలకు గుడ్ న్యూస్.. మీ పేరు మీదే సొంత ఇల్లు, మంత్రి పొంగులేటి సంచలన ప్రకటన!

Related News

బీజేపీలోకి కొండా సురేఖ.. క్లారిటీ ఇచ్చిన ఎంపీ డీకే అరుణ!

కాన్‌స్టర్ సొల్యూషన్స్ ప్రారంభోత్సవంలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు!

కామారెడ్డి జిల్లాలో ఘోరం.. ఆర్టీసీ బస్సు బోల్తా స్పాట్‌లో 13 మంది..!

మాదాపూర్‌లో ఈ-సిగరెట్ల దందా గుట్టురట్టు.. పోలీసులకు ఎలా చిక్కారంటే..?

ఖమ్మం జిల్లాలో చైనా సైబర్ గ్యాంగ్ దందా కలకలం.. 52 మంది యువకులు అరెస్ట్!

కేసీఆర్‌కు బిగ్ షాక్.. సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ కాంగ్రెస్..!

మేడ్చల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. గాల్లో పల్టీలు కొట్టిన కారు

కొండా సురేఖ బర్తరఫ్‌లో బిగ్ ట్విస్ట్.. నిజాలు బయటపెట్టిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్!

Big Stories

Advertisement
×