E-Paper

సైలెంట్‌గా ‘సెంచరీ’ కొట్టేసిన వైష్ణవ్ తేజ్…ఈసారైనా హిట్ కొడతావా గురూ ?

సైలెంట్‌గా ‘సెంచరీ’ కొట్టేసిన వైష్ణవ్ తేజ్…ఈసారైనా హిట్ కొడతావా గురూ ?

Vaishnav Comeback: పంజా వైష్ణవ్ తేజ్… ‘ఉప్పెన’ లాంటి  బ్లాక్‌బస్టర్‌తో ఇండస్ట్రీని షేక్ చేస్తూ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన మెగా హీరో .ఇక రావడం రావడమే ఆ సినిమా క్రియేట్ చేసిన రికార్డులు, మ్యూజికల్ సెన్సేషన్ అంతా ఇంతా కాదు. మొదటి చిత్రంతోనే వంద కోట్ల క్లబ్‌ను టచ్ చేసిన ఈ యంగ్ హీరోపై అప్పట్లో ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి కూడా. అయితే ఆ తర్వాత వైష్ణవ్ కెరీర్ గ్రాఫ్ ఊహించని మలుపులు తిరిగింది.

డిఫరెంట్ అటెంప్ట్ తో  వచ్చిన ‘కొండపొలం’ (2021) కమర్షియల్‌గా వర్కవుట్ కాలేదు. ఆ వెంటనే వచ్చిన లవ్ స్టోరీ ‘రంగరంగ వైభవంగా’ (2022) కూడా ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేకపోయింది. ఇక 2023 నవంబర్‌లో వచ్చిన కంప్లీట్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఆదికేశవ’ బాక్సాఫీస్ వద్ద ఘోరంగా డిజాస్టర్ అయ్యింది. వరుసగా మూడు పరాజయాలు పలకరించడంతో ఈ మెగా వారసుడు సెల్ఫ్ డిఫెన్స్ లోకి పడిపోయాడు.

వందకు పైగా స్క్రిప్ట్‌లను రిజెక్ట్ చేసిన వైష్ణవ్

ఈ క్రమంలోనే గత మూడేళ్లుగా సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్న వైష్ణవ్ తేజ్ ఏకంగా వందకు పైగా స్క్రిప్ట్‌లను రిజెక్ట్ చేశాడని టాక్. కథల ఎంపికలో తొందరపడి మళ్లీ ప్లాపులు మూట గట్టుకోకూడదు అన్న పట్టుదలతో, వచ్చిన ప్రతి అవకాశాన్ని జాగ్రత్తగా పరిశీలించి డిసీషన్ తీసుకోవాలని డిసైడ్ అయ్యాడట వైష్ణవ్.అయితే ఇప్పుడు ఇన్ని రోజుల గ్యాప్ కి ఎట్టకేలకి ఇపుడు  తెరపడిందని తెలుస్తుంది. అవును …యువ దర్శకుడు మహేష్ ఎస్ చెప్పిన ఒక మైండ్ బ్లోయింగ్ లైన్ వైష్ణవ్‌ను అమితంగా ఆకట్టుకుందని సమాచారం. దర్శకుడు కథను నరేట్ చేసిన విధానం, అందులోని క్యారెక్టరైజేషన్ ఈ హీరోకు కొత్త ఎనర్జీని ఇచ్చాయట. వంద కథలు విన్నాక దొరికిన ప్రాజెక్ట్ కావడంతో దీనిపై ఇండస్ట్రీలో ఇప్పుడే క్రేజీ బజ్ క్రియేట్ అవుతోంది.

వచ్చే నెలలోనే అఫీషియల్ అనౌన్స్ మెంట్

ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని టాలీవుడ్‌లో వరుస క్రేజీ మరియు భారీ ప్రాజెక్ట్‌లను నిర్మిస్తున్న ప్రముఖ నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించనుంది. అనిల్ సుంకర ఈ సినిమాను ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా భారీ బడ్జెట్‌తో ప్లాన్ చేస్తున్నట్లు టాక్. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వచ్చే నెలలోనే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానుందని,ఆ వెంటనే రెగ్యులర్ షూటింగ్‌ను కూడా ప్రారంభించడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోందని ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తున్న మాట.

ఈ వంద కథల ఫిల్టర్ కూడా నిరాశనే మిగులుస్తుందా?

దీంతో వంద కథలు విని ఓకే చేసిన సినిమా అనగానే అంచనాలు స్కై లెవెల్ లో పెట్టేసుకున్నారు మెగా ఫ్యాన్స్.కానీ అదే సమయంలో ఇండస్ట్రీ విశ్లేషకుల్లో, ప్రేక్షకుల్లో ఒక రకమైన సందేహం కూడా నడుస్తోంది. గతంలో కూడా ‘ఆదికేశవ’ కోసం వైష్ణవ్ చాలా టైం తీసుకున్నాడు, మాస్ ఇమేజ్ కోసం ట్రై చేసి విఫలమయ్యాడు. ఇప్పుడు ఈ కొత్త దర్శకుడు మహేష్ ఎస్ ఏం మ్యాజిక్ చేయబోతున్నాడనేది ఆసక్తికరంగా మారింది. వంద కథలు రిజెక్ట్ చేయడం అనేది స్క్రిప్ట్ సెలక్షన్‌లో ఉన్న క్లారిటీని చూపిస్తుందా లేక అతి జాగ్రత్త వల్ల వస్తున్న కన్ఫ్యూజనా అనే చర్చ కూడా నడుస్తోంది. ఏదేమైనా ఈ సినిమాతో వైష్ణవ్ తేజ్ మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కి ‘ఉప్పెన’ నాటి వైభవాన్ని అందుకుంటాడా, లేక ఈ వంద కథల ఫిల్టర్  కూడా నిరాశనే మిగులుస్తుందా అనేది కాలమే  డిసైడ్ చేయాలి.

also read :జూన్ 8న పూరీ మార్క్ విధ్వంసం.. విజయ్ సేతుపతి ‘స్లమ్ డాగ్ – 33 టెంపుల్ రోడ్’ క్రేజీ పోస్టర్ వైరల్!

Related News

ట్రోలర్స్ కు బుట్టబొమ్మ స్ట్రాంగ్ కౌంటర్.. అస్సలు ఊహించలేదు మావా..!

భార్యతో కలిసిపోయిన సీఏం విజయ్.. ఆమె ఎంట్రీతో విడాకులు క్యాన్సిల్..!

మెగా ఫ్యాన్స్ కు బిగ్ షాక్.. సుకుమార్ -రామ్ చరణ్ మూవీ లేనట్లేనా..?

‘గాడ్ ఆఫ్ వార్’ తో ఎన్టీఆర్ నెక్స్ట్ లెవెల్ స్కెచ్.. కోలీవుడ్ డైరెక్టర్‌కు నో ఛాన్స్?

కొత్త మలుపు రివ్యూ: సింగర్ సునీత కొడుకు హిట్ కొట్టాడా? సినిమా ఎలా ఉందంటే?

విజయ్ ‘టీవీకే’ టార్గెట్‌గా చిన్మయి సంచలన పోస్ట్.. దళపతికి ఊహించని షాక్!

ప్రకాష్ రాజ్ సంచలన ట్వీట్.. రెండు రోజుల్లో మీడియా ముందుకు ..అసలు కథ ఏంటంటే?

మ్యూజిక్ డైరెక్టర్‌ను ఇసుకలో పాతిపెట్టిన టాలీవుడ్ స్టార్ డైరెక్టర్.. షాకింగ్ వీడియో వైరల్!

×