Chaitanya Jonnalagadda: కొంతమంది నటులకు విపరీతమైన టాలెంట్ ఉన్నా కూడా వెంటనే బయటపడదు. సరైన ఒక పాత్ర పడినప్పుడే వాళ్లలో సత్తా ఏంటో అర్థం అవుతుంది. నటుడుగా చిన్న చిన్న పాత్రలు వేసిన సిద్దు జొన్నలగడ్డ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సాధించుకున్నారు. స్వతహాగా తనలో రైటర్ కూడా ఉండటంతో హీరోగా కూడా మంచి పేరు సాధించుకున్నాడు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో సిద్దుకు ఉన్న మార్కెట్ నెక్స్ట్ లెవెల్. తను చేసిన గత రెండు సినిమాలు సక్సెస్ కాలేదు.
ముఖ్యంగా సిద్దు కెరియర్ కి మంచి ప్లస్ అయిన సినిమా డిజె టిల్లు. చాలామంది ఇప్పటికీ కూడా సిద్ధుని టిల్లు అని పిలుస్తూ ఉంటారు. ఇక సిద్దు జొన్నలగడ్డ సోదరుడు చైతన్య జొన్నలగడ్డ గురించి పెద్దగా ఎవరికి తెలియకపోవచ్చు. కానీ మరికొన్ని రోజుల్లో అతని పేరు మారు మోగిపోతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇదివరకే రోషన్ కనకాల నటించిన బబుల్గం సినిమాలో కూడా కనిపించాడు చైతన్య జొన్నలగడ్డ. ఆ సినిమా పెద్దగా సక్సెస్ కాలేదు.
సాయిలు కంపాటి దర్శకుడుగా పరిచయం అవుతున్న సినిమా రాజు వెడ్స్ రాంబాయి. ఈ సినిమా ట్రైలర్ ఇటీవలే విడుదలైంది. ఈ ట్రైలర్ చాలామందిని విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఇది ఒక యదార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కిన ప్రేమ కథ అని చిత్ర దర్శక నిర్మాతలు చెబుతూనే ఉన్నారు.
నిధి నాది ఒకే కథ, విరాటపర్వం వంటి సినిమాలకు దర్శకుడుగా చేసిన వేణువుడు గల ఈ సినిమాని నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. ఈ ట్రైలర్ లో బాగా ఆకట్టుకున్న క్యారెక్టర్ రాంబాయి ఫాదర్ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ చేసింది మరి ఎవరో కాదు సిద్దు జొన్నలగడ్డ అన్నయ్య చైతన్య జొన్నలగడ్డ.
అంత పవర్ ఫుల్ రోల్ తన జీవితంలో ఎప్పుడూ చేయలేదు అని, అలానే నిజ జీవితంలో నేను అసలు అలా ఉండను చాలా కూల్ పర్సన్ అని చెబుతూ ఉంటాడు చైతన్య. కానీ ఆ పాత్రలో మాత్రం విలన్ గా అరాచకం చూపించాడు. కొన్ని సందర్భాలలో హీరోయిన్ తేజస్వి రావు మీద కోప్పడ్డానని, కొన్నిసార్లు చేయి కూడా ఇస్తానని సారీ కూడా చెప్పాడు.
చైతన్య మాత్రం సినిమాలో చూడటానికి చాలా పవర్ ఫుల్ పాత్రలో కనిపిస్తున్నాడు. ఈటీవీ విన్ నిర్మిస్తున్న ఈ సినిమా వర్కౌట్ అయితే చైతన్యకి వరుస అవకాశాలు వస్తాయి. ఉపన సినిమాలు విజయసేతుపతి విలన్ క్యారెక్టర్ ఎంత పవర్ఫుల్ గా ఉంటుందో అదే రేంజ్ లో చైతన్య క్యారెక్టర్ కూడా రాంబాయి సినిమాలో ఉంది. అయితే ఇది ఏ మేరకు వర్క్ అవుట్ అయి సక్సెస్ సాధిస్తుంది అనేది త్వరలో తెలుస్తుంది.
Also Read : Comedian Satya : పోస్టర్ తోనే కితకితలు పెట్టాడు , రితీష్ రానా నీ వెటకారం మామూలుది కాదు