E-Paper
Advertisement

Nitish Kumar: ఈ మున్నాభాయ్ మహా ముదురు.. నితీష్ కుమార్ అలాంటివాడా? మీకు తెలియని షాకింగ్ ఫ్యాక్ట్స్

Nitish Kumar: ఈ మున్నాభాయ్ మహా ముదురు.. నితీష్ కుమార్ అలాంటివాడా? మీకు తెలియని షాకింగ్ ఫ్యాక్ట్స్

నితీష్ కుమార్. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత దేశవ్యాప్తంగా మరోసారి మారుమోగిపోతున్న పేరిది. బీహార్ సీఎంగా చరిత్ర తిరగరాస్తూ, తన విజయంతో ప్రత్యర్థులతోపాటు, స్నేహితుల్ని కూడా ఆశ్చర్యపరిచే వ్యక్తిత్వం ఆయనది. బీహార్ ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచినా, చివరకు సీఎం అయ్యేది నితీష్ కుమారే అన్నట్టుగా ఉంది అక్కడ పరిస్థితి. అవును, తొలిసారి కేవలం 7 రోజుల సీఎంగా రికార్డ్ సృష్టించిన నితీష్ కుమార్ ఇప్పటికి 9సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారాలు చేశారు. ఇందులో ఆరు సార్లు ఆయన NDA జట్టులో ఉండగా, మూడుసార్లు కాంగ్రెస్ తో కలసి అధికారాన్ని పంచుకున్నారు. అధికారం ఏ కూటమిదయినా సీఎం పీఠం మాత్రం నితీష్ కుమార్ దే అన్నట్టుగా మారిపోయింది బీహార్ సిచ్యుయేషన్. తాజాగా మరోసారి బీహార్ సీఎం పీఠంపై కూర్చోబోతున్నారు 74 ఏళ్ల నితీష్ అలియాస్ మున్నా. చిన్ననాటి స్నేహితులు ఇప్పటికీ మున్నాగా పిలుచుకునే నితీష్ కుమార్ గురించి ఆసక్తికరమైన 10 విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

రాజకీయాలను వద్దనుకుని..
బీహార్ ఎలక్ట్రిసిటీ బోర్డ్ లో ఇంజినీర్ గా పనిచేసే నితీష్ కుమార్ తన మొదటి రెండు ఎన్నికల్లోనూ ఓడిపోయారు. ఆ దెబ్బకి ఆయనకు రాజకీయాలపై విరక్తి కలిగింది. రాజకీయాలు వదిలేసి తన కెరీర్ పై ఫోకస్ పెట్టాలనుకున్నారు. కానీ చివరి నిమిషంలో ఆయన రాజకీయ పోరాటానికే సిద్ధమయ్యారు. ఇప్పటికీ ఒక మంచి పోరాట యోధుడిగా మిగిలిపోయారు.

మున్నా..
చిన్ననాటి స్నేహితులు ఇంకా ఆయన్ను మున్నాగానే పిలుస్తారు. ఆయనకు స్నేహితులు తక్కువే. మనుషులకంటే ఎక్కువగా పుస్తకాలనే ఆయన ఇష్టపడతారు. అయితే ఆయన స్నేహితులు మాత్రం ఆయన్ని వదిలిపెట్టేవారు కాదు. మున్నా, మున్నా అంటూ కలవరించేవారు.

వరకట్నం తీసుకోని వరుడు..
పెళ్లిలో కట్నం తీసుకునే ఆచారం బలంగా ఉన్న రోజుల్లో కుటుంబంలోని పెద్దల్ని సైతం ఎదిరించి మంజుకుమారి సిన్హాను వరకట్నం లేకుండా పెళ్లి చేసుకున్నారు నితీష్. వాస్తవానికి రాజకీయాల్లో ఆయన చాల్ ఫ్లెక్సిబుల్. బీజేపీ కాదంటే కాంగ్రెస్, కాంగ్రెస్ తో విసుగొస్తే బీజేపీ వద్దకు వెళ్తుంటారు. కానీ పెళ్లి విషయంలో మాత్రం ఆయన చాలా స్థిరమైన నిర్ణయం తీసుకున్నారు.

నిరుపేద పొలిటీషియన్..
నితీష్ కుమార్ రాజకీయాల్లోకి వచ్చే నాటికి ఆయన వద్ద పెద్దగా డబ్బులు లేవు, కనీసం ప్రచారాని కూడా సరిపడా బడ్జెట్ లేదు. దీంతో ప్రభుత్వ టీచర్ అయిన ఆయన భార్య తన సేవింగ్స్ నుంచి రూ.20వేలు తీసి ఇచ్చింది. బీహార్ ఫ్యూచర్ సీఎం అలా ప్రభుత్వం తన భార్యకు ఇచ్చిన జీతంతో ప్రచారం చేపట్టి గెలిచారు. ఆ తర్వాత ప్రభుత్వాన్నే నడిపించే స్థాయికి ఎదిగారు.

సినిమాలంటే పిచ్చి..
నితీష్ కుమార్ కి సినిమాలంటే పిచ్చి. ఆరక్షణ్ అనే హిందీ సినిమా స్పెషల్ స్క్రీనింగ్ ని అమితాబ్ బచ్చన్ తో కలసి వీక్షఇంచారు నితీష్ కుమార్. ఒక ముఖ్యమంత్రి సినిమా స్పెషల్ స్క్రీనింగ్ కి రావడం, అది కూడా సినిమా పూర్తయ్యే వరకు నటీనటులతో కలసి ఉండటం అప్పట్లో పెద్ద సంచలనంగా మారింది.

తీస్రీ కసమ్..
నితీష్ కుమార్ ఫేవరెట్ మూవీ త్రీస్రీ కసమ్. రాజ్ కపూర్, వహీదా రెహ్మాన్ కలసి నటించిన ఈ సినిమా అంటే నితీష్ కి బాగా ఇష్టం. తాను సీఎం అయ్యాక ఈ సినిమాని ప్రతి గ్రామంలో ఉచితంగా ప్రదర్శించారు. మధ్య మధ్యలో ప్రభుత్వ ప్రకటనలు వేసేవారు.

పాత పాటలంటే బాగా ఇష్టం..
సినీ ప్రేమికులు సహజంగానే పాత పాటలంటే చెవికోసుకుంటారు. నితీష్ కుమార్ కూడా అంతే. మ్యూజికల్ హిట్ మొహబూబ్ సినిమాని ఎన్నిసార్లు ఆయన చూసి ఉంటారో లెక్కే లేదు. ఈ సినిమాకు నితీష్ కి ఉన్న అనుబంధాన్ని ఆయన స్నేహితులు సరదాగా చెబుతుంటారు.

దోసె అంటే ఇష్టం..
నితీష్ కుమార్ ప్యూర్ వెజిటేరియన్. ఆహార నియమాలు కూడా బాగా పాటిస్తుంటారు. అయితే దోసె విషయంలో మాత్రం ఆయన అన్నీ మరచిపోతారు. మసాలా దోసె అంటే ఆయనకు చాలా ఇష్టం.

Also Read: రేవంత్ నాయకత్వానికి ఢోకా లేనట్టే

చెక్క మంచం
ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తికి హంసతూలికా తల్పారు ఓ లెక్కా. కానీ బీహార్ సీఎం నితీష్ కుమార్ చెక్క బెడ్ పైనే పడుకుంటారట. ఆయన రూమ్ కూడా చాలా సాదాసీదాగా ఉంటుందని అంటారు. చెక్క కుర్చీ, ఒక అల్మరా, చెక్క బెడ్ ఇవే ఆయన రూమ్ లో ఉంటాయి.

Also Read: జూబ్లీ హిల్స్ గుణపాఠం.. కేటీఆర్ ఇకనైనా గ్రౌండ్ రియాల్టీ అర్థం చేసుకుంటారా?

రాజకీయ వారసత్వానికి నో..
9 సార్లు బీహార్ కి సీఎంగా పనిచేసిన, ఇంకా పనిచేస్తూనే ఉన్న నితీష్ కుమార్ కి వారసత్వ రాజకీయాలంటే అసహ్యం. అందుకే ఆయన తన కుమారుడు నిషాంత్ ని రాజకీయాల్లోకి తీసుకు రాలేదు. నిషాంత్ ఒక సాఫ్ట్ వేర్ ఇంజినీర్. చాలాసార్లు తన అనుచరులు నిషాంత్ పేరు ప్రతిపాదించినా నితీష్ మాత్రం ససేమిరా అనేవారు.

Also Read: బీఆర్ఎస్‌‌‌లో కొత్త భయం.. ఆ 10 స్థానాల్లోనూ ఉప ఎన్నికలు వస్తే?

Related News

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

సీబీఎస్ఈ ఓఎస్ఎం సెగ.. కేంద్రం ఉక్కిరిబిక్కిరి, ఏకసభ్య కమిటీ విచారణ, మంత్రి రాజీనామాకు పార్టీల డిమాండ్

తమిళనాడులో రాజకీయాలు కొత్త మలుపు.. బీజేపీకి అన్నామలై గుడ్ బై, పార్టీ అధ్యక్షుడికి లేఖ, మరో ఆరునెలల్లో

కలవర పెడుతున్న ఎబోలా వైరస్.. కేంద్రం ప్రత్యేక గైడ్‌లైన్స్.. కాకపోతే ఒక్క కేసు

కారుణ్య నియామకాలు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు, ఇకపై వారికి కూడా

ఆలస్యమైనా చల్లటి కబురు.. నైరుతి రుతుపవనాలు రాక, కేరళలోకి ప్రవేశం!-ఐఎండీ

Big Stories

×