Simple Kaul: ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన మొదట్లో ఆడవారికి ఎలా అయితే ఇబ్బందులు ఎదురవుతాయో, తనకు కూడా అలాగే ఎదురయ్యాయని తెలిపింది.అయితే ఎక్కడా కూడా తన ఆత్మగౌరవాన్ని, వ్యక్తిగత పరిధులను కాని దాటలేదని సింపుల్ స్పష్టం చేసింది సింపుల్ కౌల్.
రాత్రి వేళల్లో హోటల్ గదికి ఒంటరిగా
ఇక ఇదే క్రమంలో తనకి జీవితంలో ఎదురైన ఒక చేదు అనుభవాన్ని చెప్పుకొచ్చింది.కెరీర్ మొదట్లో ఒక దర్శకుడు రాత్రి వేళల్లో హోటల్ గదికి ఒంటరిగా రమ్మని పిలిచాడంటూ బాంబు పేల్చింది.అయితే నేనొక్కదాన్ని కాకుండా తన ఫ్రెండ్స్ తో వస్తానని చెబితే ఆ డైరెక్టర్ మాత్రం ఎవ్వరూ వద్దు,నువ్వు ఒక్కదానివే రావా,అలా కాకపోతే నీ ఫ్రెండ్స్‌ని కింద లాబీలోనే కూర్చోబెట్టి నువ్వు ఒక్కదానివే నేనున్న రూమ్ కి రా అంటూ కండీషన్ పెట్టాడని అసలు విషయం చెప్పుకొచ్చింది.
also read :‘జన నాయగన్’ రెమ్యునరేషన్స్.. విజయ్ ఒక్కడికే అన్ని కోట్లా?
అయితే డైరెక్టర్ అలా ఒంటరిగా రమ్మని అడగడంతో అసలు విషయం అర్థమైన తను అలాంటి ఆఫర్లు నాకు అసలు వద్దని,”కలవాలనుకుంటే అందరి ముందూ హోటల్ లాబీలోనే కలుద్దాం.. లేదంటే అసలు కలవాల్సిన అవసరం లేదు” అంటూ అందరి ముందే మొఖం మీద కుండ బద్దలు కొట్టేసినట్టు తేల్చి చెప్పింది.
ఒకరికి లొంగాల్సిన అవసరం లేదు
మొత్తానికి అవకాశాలు రావాలంటే ఒకరికి లొంగాల్సిన అవసరం లేదని,మన మనస్సు ఏమి చెబితే అదే చేయాలని సింపుల్ కౌల్ స్పష్టం చేసింది.ఏదైనా నచ్చకపోయినా ఏ మాత్రం మొహమాటపడకుండా అక్కడి నుండి,వారి వద్ద నుండి బయటికి వచ్చేయాలని సలహా ఇచ్చింది.ముఖ్యంగా ఇండస్ట్రీలో ఎదగాలంటే షార్ట్ కట్ లు వెతుక్కోకుండా నటనపైనే దృష్టి పెట్టాలని ,సొంత టాలెంట్ నే నమ్ముకోవాలంటూ పిలుపునిచ్చింది సింపుల్ కౌల్ !
సింపుల్ కౌల్ విషయానికి వస్తే
ఇక సింపుల్ కౌల్ విషయానికి వస్తే 2002లో ప్రముఖ నిర్మాత ఏక్తా కపూర్ నిర్మించిన ఐకానిక్ సీరియల్ ‘కుసుమ్’ (Kkusum) ద్వారా బుల్లితెరకు పరిచయమైన ఈ భామ ‘షరారత్’ (Shararat – 2003 నుంచి 2006 వరకు ప్రసారమైంది) షోతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత ల్యాండ్‌మార్క్ కామెడీ షో ‘తారక్ మెహతా కా ఊల్టా చష్మా’ (Taarak Mehta Ka Ooltah Chashmah) లో ఆమె నటించిన ‘గులాబో’ క్యారెక్టర్ ఫుల్ పాపులర్ అయింది కూడా.
also read :దళపతి విజయ్ ‘జననాయగన్’ రివ్యూ: ఫ్యాన్స్ ఊహించింది ఒకటి.. జరిగింది వేరొకటి!
అలాగే ‘బా బాహూ అవుర్ బేబీ’ (Baa Bahoo Aur Baby – 2005), ‘జీనీ ప్రొఫెసర్’ (Jeannie Aur Juju – 2012) వంటి పాపులర్ షోలలోనూ తనదైన స్టాంప్ వేసింది.చూడాలి మరి ఈ అమ్మడు చెప్పిన సలహాలని ఎంత మంది పాటిస్తారో !