E-Paper
Advertisement

Singer Chinmayi : శివాజీ కాళ్లకు మెట్టెలు పెట్టుకో… ‘దరిద్రపు ము**’ కామెంట్‌పై చిన్మయి ఫైర్

Singer Chinmayi : శివాజీ కాళ్లకు మెట్టెలు పెట్టుకో… ‘దరిద్రపు ము**’ కామెంట్‌పై చిన్మయి ఫైర్
Advertisement

Singer Chinmayi : టాలీవుడ్ నటుడు శివాజీ మరోసారి తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచాడు. ‘కోర్ట్’ సినిమాలో మంగపతి పాత్రతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈయన ప్రస్తుతం దండోరా మూవీతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. కనుకగా థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు.. ఈ ఈవెంట్ లో మాట్లాడిన శివాజీ హీరోయిన్ల వస్త్రధారణ పై సంచల వ్యాఖ్యలు చేశారు. అవి ప్రస్తుతం వైరల్ గా మారాయి. ఈ వ్యాఖ్యల పై ఇప్పటికే సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతుంది. శివాజీ చేసిన వ్యాఖ్యలపై సింగర్ చిన్మయ్ స్పందించారు. ఆయన వ్యాఖ్యలకు దిమ్మతిరిగిపోయేలా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు.. దాంతో ఇండస్ట్రీలో ఈ టాపిక్ పై చర్చలు కొనసాగుతున్నాయి. అసలు ఆమె చేసిన పోస్ట్ లో ఏముందో చూద్దాం..

శివాజీ వ్యాఖ్యలపై చిన్మయి ఫైర్.. 

క్రిస్మస్ కానుకగా థియేటర్లలో రిలీజ్ కాబోతున్న దండోరా సినిమా ఫ్రీ రిలీజ్ రీసెంట్గా నిర్వహించారు. ఈ ఈవెంట్ లో నటుడు శివాజీ హీరోయిన్ల డ్రెస్సింగ్ స్టైల్ గురించి మాట్లాడడం వివాదానికి దారి తీసింది.. ఆయన చేసిన వ్యాఖ్యలపై ప్రముఖ సింగర్ చిన్మయి స్పందించారు. ఆ వ్యాఖ్యలపై ఆమె తన సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేశారు. ఆ పోస్ట్ లో.. తెలుగు నటుడు శివాజీ, నటీమణులను ‘దరిద్రపు ముండ’ వంటి అసభ్య పదజాలంతో దూషిస్తూ, వారు తమ ‘సామాన్’ కప్పుకోవడానికి చీరలు కట్టుకోవాలని అనవసరమైన సలహాలు ఇస్తున్నాడు.. నటుడు శివాజీ విలన్, హీరోగా నటిస్తున్నాడు.. ఇక్కడ ఆయన పని చేసుకోవాలి కానీ ఇలా చెయ్యడం బాగోలేదు.. ఆయన జీన్స్, హుడీ ధరించారు. మరి ధోతీలు ఎందుకు ధరించలేదు..? భారతీయ సంస్కృతిని పాటించాలి కదా. బొట్టు పెట్టుకోవాలి. ఒకవేళ పెళ్లయినట్లయితే, తాను వివాహితుడని సూచించడానికి కంకణం, అలాగే కాళ్లకు మెట్టెలు పెట్టుకోవాలి. మహిళలను మాత్రమే ఎందుకు ఇలా టార్గెట్ చేశారు. ఇది నిజంగా నమ్మలేకపోతున్నా అని ఆమె పోస్ట్ లో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఆ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై నటుడు శివాజీ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి..

Advertisement

Also Read :బాక్సాఫీస్ వద్ద ‘దురంధర్’ ఊచకోత.. 1000 కోట్ల క్లబ్ లోకి చేరినట్లే..?

‘దండోరా’ సినిమాకు మైనస్ అవుతుందా..? 

దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో శివాజీ మాట్లాడిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.. అమ్మాయిల వస్త్రాల పై అసభ్య పదజాలంతో మాట్లాడిన తీరు పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం అవుతుంది. శివాజీ వ్యాఖ్యల వల్ల అనేక మంది మహిళలు తీవ్రంగా నొచ్చుకున్నారని, అయితే బహిరంగంగా స్పందించలేక మౌనంగా ఉన్నారని సమాచారం.. ఇలాంటి వేదికల పై ఆయన ఇలాంటివి మాట్లాడటం ఏంటని కొందరు ప్రశ్నిస్తున్నారు. ప్రజాదరణ ఉన్న వ్యక్తులు మరింత జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం ఉందని విమర్శకులు చెబుతున్నారు. మహిళలను నొప్పించేలా మాట్లాడటం పై సర్వత్రా చర్చలు కొనసాగుతున్నాయి. మరి దీని ప్రభావం దండోరా సినిమాకు మైనస్ అవుతుందా? శివాజీ దిగొచ్చి మహిళలకు క్షమాపణలు చెప్తారేమో చూడాలి..

Advertisement

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×