E-Paper
Advertisement

Dhurandhar Collections : బాక్సాఫీస్ వద్ద ‘దురంధర్’ ఊచకోత.. 1000 కోట్ల క్లబ్ లోకి చేరినట్లే..?

Dhurandhar Collections : బాక్సాఫీస్ వద్ద ‘దురంధర్’ ఊచకోత.. 1000 కోట్ల క్లబ్ లోకి చేరినట్లే..?
Advertisement

Dhurandhar Collections : బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ నటించిన లేటెస్ట్ బ్లాక్ బాస్టర్ మూవీ దురంధర్.. స్పై, యాక్షన్ మూవీగా వచ్చిన ఈ చిత్రాన్ని డైరెక్టర్ ఆదిత్య ధార్ తెరకెక్కించారు. జీ స్టూడియోస్, బీ62 స్టూడియోస్ బ్యానర్లపై ఆదిత్య ధార్, లోకేష్ ధార్, జ్యోతి దేశ్‌పాండేలు కలిసి నిర్మించారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన చిత్రంలో రణవీర్ కు జోడిగా సారా అర్జున్ హీరోయిన్‌గా నటించారు. సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, ఆర్ మాధవన్, అర్జున్ రాంపాల్, రాకేశ్ బేడీ, సౌమ్య టాండన్, నవీన్ కౌశీక్, మానవ్ గోహిల్ వంటి వాళ్లు ప్రత్యేక పాత్రలో నటించారు. భారీ అంచనాలతో థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా మొదటి రోజు నుంచి పాజిటివ్ టాక్ ని అందుకోవడంతోపాటగా కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది .. థియేటర్లలో రిలీజ్ అయ్యి 20 రోజులు అవుతున్న సరే కలెక్షన్లు మాత్రం తగ్గడం లేదు. దాదాపు 900 కోట్లు వసూళ్లను అందుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు ఎన్ని కోట్ల కలెక్షన్స్ ను అందుకుందో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

దురంధర్ 18 రోజుల కలెక్షన్స్..

280 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో దురంధర్ సినిమాను నిర్మించారు.. భారీ యాక్షన్ సన్నివేశాలతో ఈ చిత్రం బాలీవుడ్ బాక్సాఫీస్ ని షేక్ చేస్తుంది. మొదటి రోజు నుంచి మౌత్ టాక్ పాజిటివ్ గా రావడంతో సినిమా కలెక్షన్లు కూడా రోజురోజుకీ పెరుగుతూ వస్తున్నాయి.. వరల్డ్ వైడ్‌గా 168 కోట్ల రూపాయల థియేట్రికల్ బిజినెస్ జరగ్గా.. 400 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబాట్టాల్సి ఉంది. కానీ రెండు వారాలకే 500 కోట్లను వసూల్ చేసి రికార్డ్ బ్రేక్ చేసింది. 18 రోజులకు గాను దాదాపు 900 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తుంది. ఇదే జోరు గనుక మరో వారం కొనసాగితే కచ్చితంగా 1500 కోట్ల క్లబ్ లోకి చేరిపోతుందని రణవీర్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెడుతున్నారు. మరి ఇప్పటివరకు మరో సినిమా లేకపోవడంతో ఈ సినిమా కలెక్షన్స్ ఇంకాస్త భారీగా పెరిగే అవకాశం ఉందని బాలీవుడ్ సినీ ట్రేడ్ పంతులు అంచనా వేస్తున్నారు. చివరికి ఎన్ని కోట్లు వసూలు చేస్తుందో చూడాలి..

Advertisement

Also Read : ప్రభాస్ నిజస్వరూపాన్ని బయటపెట్టిన రాజీవ్.. నిజంగా మహారాజువే సామి..

ఈ మూవీ స్టోరీ విషయానికొస్తే.. 

బాలీవుడ్ లో ఇటీవల రిలీజ్ అయిన సినిమాల రికార్డులను ఈ సినిమా బ్రేక్ చేసుకుంటూ వస్తుంది.. ఈ సినిమాకు కలెక్షన్ల వర్షం కురవడానికి కారణం స్టోరీ అని తెలుస్తుంది. పాకిస్తాన్ నేపథ్యంలో స్టోరీ కావడం దురంధర్‌కు కలిసొచ్చిందని చెప్పొచ్చు. ఇందులో హీరో పాకిస్తాన్‌లోని లయారీ ముఠాలలోకి చొరబడే భారతీయ గూఢచారి హమ్జా పాత్రలో నటించారు. ఈ మూవీలో కందహార్ విమానం హైజాక్, అలాగే 2001 పార్లమెంట్ దాడి, 26/11 ముంబయి దాడులు వంటి రాజకీయ, ఉగ్రవాద సంఘటనలు చూపించారు.. ఈ స్టోరీ జనాలకు బాగా కనెక్ట్ అయింది. దానివల్లే సినిమాకు రోజురోజుకీ రెస్పాన్స్ పెరుగుతుంది. కేవలం ఇండియాలో 579 కోట్లకు పైగా వసూళ్లను అందుకుంది.. ప్రపంచ వ్యాప్తంగా 870 కోట్లకు పైగా రాబట్టింది. ఇదే జోరులో మరికొన్ని రోజులు సినిమా థియేటర్లలో కొనసాగితే కచ్చితంగా 1500 కోట్లు రాబడుతుందని అంచనా వేస్తున్నారు.

Related News

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

పవన్‌ కల్యాణ్‌ ఆస్తుల లెక్క ఇదిగో.. కళ్లు తిరిగే నంబర్లు!

లక్కీ భాస్కర్ 2… వెంకీ అట్లూరి బిగ్ అప్డేట్!

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ‘ఓజీ యూనివర్స్’ నుంచి స్పెషల్ ట్రీట్!

రూ.200 కోట్ల క్లబ్ లోకి ఇరుముడి.. అయ్యప్పగా మణెమ్మ!

టాక్సిక్ vs ఇరుముడి.. భారీ బడ్జెట్ సినిమాలకు ఇదో గుణపాఠమా?

Big Stories

Advertisement
×