E-Paper
Advertisement

Singer Chinmayi: వైరముత్తు జ్ఞానపీఠ అవార్డు.. పవన్ కళ్యాణ్ పై చిన్మయి ఫైర్.. ఏమి తెలియదంటూ!

Singer Chinmayi: వైరముత్తు జ్ఞానపీఠ అవార్డు.. పవన్ కళ్యాణ్ పై చిన్మయి ఫైర్.. ఏమి తెలియదంటూ!
Advertisement

Singer Chinmayi: సింగర్ చిన్మయి ప్రముఖ తమిళ రచయిత వైరముత్తు(Vaira Mutthu) విషయంలో ఏమాత్రం అవకాశం దొరికిన అసలు వెనుకడుగు వేయదు. తన గురించి నిత్యం వివాదాస్పద పోస్టులు చేస్తూ చిన్మయి కూడా వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల వైరముత్తు జ్ఞానపీఠ అవార్డు అందుకోవడంతో ఎంతోమంది తమిళ సినీ ,రాజకీయ ప్రముఖులు ఈయనకు సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చిన్మయి సోషల్ మీడియా వేదికగా వరుస పోస్టులు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు.

వైరముత్తుకు పవన్ అభినందనలు…

ప్రముఖ సినీ హీరోలు కమల్ హాసన్, రజనీకాంత్ వంటి తదితరులు కూడా వైరముత్తుకు అభినందనలు తెలియచేయడంతో ఈమె తనదైన శైలిలోనే విమర్శలు కురిపించారు. సినిమా ఇండస్ట్రీలో నుంచి రాజకీయాలలోకి వెళ్లిన ఎంతో మంది నాయకులు అమ్మాయిల సమస్యలను పట్టించుకోరని ఇలాంటి వారికి ఓట్లు వేసే సమయంలో మహిళలు ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి అంటూ చిన్మయి సూచనలు చేశారు. ఇదిలా ఉండగా తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం, సినీ నటుడు పవన్ కళ్యాణ్(Pawan Kalyan) సైతం స్పందించారు.

సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలి..

Advertisement

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ వైరముత్తు జ్ఞానపీఠ పురస్కారాన్ని అందుకోబోతున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తన అధికారకం ఎక్స్ ఖాతా ద్వారా ఈ విషయంపై స్పందిస్తూ.. వైరముత్తు గారికి అభినందనలు. జ్ఞానపీఠ పురస్కారానికి ఎంపికైన తరుణంలో వారికి నా హృదయపూర్వక అభినందనలు తమిళ సాహిత్యంలో శ్రీ వైరముత్తు గారికి ప్రత్యేక స్థానం ఉంది. ఈయన రచించిన రచనల్లో సామాజిక స్పృహ, మానవ సంబంధాలలోని సున్నితత్వాన్ని చూపిస్తారంటూ ఆయన గురించి గొప్పగా చెప్పడమే కాకుండా వైరముత్తు గారికి సంపూర్ణ ఆరోగ్యం, సంతోషాలు దక్కాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను అంటూ పవన్ పోస్ట్ చేశారు.

Advertisement

ఇక ఈ పోస్ట్ పై సింగర్ చిన్మయి స్పందిస్తూ.. మహిళలను లైంగికంగా వేధించిన ఆ కవి గురించి బహుశా పవన్ కళ్యాణ్ గారికి ఏమి తెలియకపోయి ఉండవచ్చు. ఇంతమంది రాజకీయ నాయకులు ఒక సినిమా పాటల రచయితకు అభినందనలు చెప్పాల్సిన అవసరం ఏంటో నాకసలు అర్థం కాలేదు అంటూ చిన్మయి పవన్ కళ్యాణ్ ను సైతం వదిలి పెట్టకుండా పవన్ కళ్యాణ్ పోస్ట్ పై కూడా విమర్శలు కురిపించారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుంది. చిన్మయి తను ఏదైనా చెప్పాలి అనుకుంటే అటువైపు ఎవరు ఉన్నారనే విషయాన్ని కూడా పట్టించుకోకుండా తన అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా చెబుతూ ఉంటారు ఈ నేపథ్యంలోనే ఈమె వివాదాలలో నిలుస్తూ విమర్శలను కూడా ఎదుర్కొంటున్నారు.

Also Read: BMW Film: ఓటీటీలోకి వచ్చిందో లేదో అప్పుడే టెలివిజన్ ప్రీమియర్ కు సిద్ధమైన రవితేజ సినిమా.. ఎప్పుడంటే?

Related News

చిన్న వయసులోనే గొప్ప మనసు చాటుకున్న సితార.. మహేష్ బాబు ఎమోషనల్ పోస్ట్!

టాలీవుడ్ లో నేషనల్ అవార్డు అందుకున్న తొలి చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరంటే?

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

Big Stories

Advertisement
×