E-Paper
Advertisement

మెగా ఫోన్ పట్టిన జయం రవి.. స్పందించిన కెనీషా!

మెగా ఫోన్ పట్టిన జయం రవి.. స్పందించిన కెనీషా!
Advertisement

Jayam Ravi: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నటుడిగా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న తమిళ నటుడు రవి మోహన్ (Ravi Mohan) అలియాస్ జయం రవి గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. టాలీవుడ్ , కోలీవుడ్ అంటూ వరుస చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉన్న ఈయన.. అనూహ్యంగా వ్యక్తిగత కారణాల వల్ల వార్తల్లో నిలిచారు. ముఖ్యంగా ప్రేమించి,పెళ్లి చేసుకుని, పిల్లలు పుట్టాక తన భార్య ఆర్తికి విడాకులు ఇవ్వాలనే నిర్ణయం ఇండస్ట్రీలో సంచలనం సృష్టించింది. జయం రవి గురించి ఆర్తి, ఆమె తల్లి సోషల్ మీడియాలో ఎన్నో కామెంట్లు చేశారు. అటు జయం రవి కూడా వీరిపై ఎన్నో ఆరోపణలు గుప్పించిన విషయం తెలిసిందే.

ఒక్కటవుతున్న జయం రవి, కెనీషా..

ప్రస్తుతం కోర్టులో కేసు నడుస్తుండగా.. ఇక నిన్నటికి నిన్న జయం రవి కెనీషాతో ఉన్న వీడియో సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. దీనికి తోడు ఇప్పుడు వీరిద్దరూ ఒక్కటవుతున్నారని, దీనిపై కెనీషా చేసిన కామెంట్లు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అసలు విషయంలోకి వెళ్తే.. గత కొన్ని రోజులుగా రవి మోహన్ తన భార్యతో విడాకులు తీసుకొని.. ప్రముఖ పాపులర్ సింగర్ కెనీషాతో డేటింగ్ లో ఉన్నారంటూ తీవ్రస్థాయిలో ప్రచారం సాగుతోంది. ఎన్నిసార్లు క్లారిటీ ఇచ్చినా గాసిప్స్ మాత్రం తగ్గడం లేదు. దీంతో వివాదాలను పక్కనపెట్టి తమ పనుల్లో బిజీ అయిపోయారు ఈ జంట.. అందులో భాగంగానే ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి ఒక సినిమా కోసం చేతులు కలిపారు. రవి మోహన్ సొంత బ్యానర్ పై ‘అన్ ఆర్డినరీ మ్యాన్’ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. పైగా ఈ చిత్రానికి రవి మోహన్ దర్శకత్వం వహిస్తుండగా.. ఇందులో యోగిబాబు హీరోగా నటిస్తున్నట్లు సమాచారం.

Advertisement

also read:ఆరోజు జరిగిందిందే.. నిజాలు బయటపెట్టిన ఈశ్వర్ సాయి అసిస్టెంట్!

హీరోగా యోగిబాబు..

పైగా ఈ చిత్రానికి కెనీషా మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై ఆమె స్పందించింది. డైరెక్టర్ గా రవి మోహన్ హీరోగా, యోగి బాబు హీరోగా, మ్యూజిక్ డైరెక్టర్ గా కెనీషా కలిసి పని చేస్తున్నారంటూ అనౌన్స్మెంట్ రావడంతో ఈ విషయం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అయింది.

స్పందించిన కెనీషా..

Advertisement

ఈ నేపథ్యంలోనే తాజాగా ఒక ఇంటర్వ్యూలో కేనీషా మాట్లాడుతూ.. “నేను ఈ అన్ ఆర్డినరీ మ్యాన్ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్గా పని చేయాలని అనుకోలేదు. కానీ ఈ సినిమా కథ చెప్పిన తీరు నన్ను ఇంప్రెస్ చేసింది. పైగా రవి మోహన్ గారి లాంటి టాలెంట్ ఉన్న వ్యక్తి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఒక అత్యుత్తమమైన సంగీత దర్శకురాలిగా పనిచేయడం నాకు అవసరం అనిపించింది. ఒక పూర్తిస్థాయి సినిమాకి సంగీతం అందించడం అనేది ఎంత పెద్ద బాధ్యతో అర్థం చేసుకోవాలి. అందుకే నేను ముందస్తుగా మూడు పాటలను సిద్ధం చేసి యూనిట్ కి వినిపించాను. ఆ ట్రాక్స్ విన్న తర్వాత టీం లోని ప్రతి ఒక్కరు పూర్తిగా సంతృప్తి చెందారు. అందుకే ఇప్పుడు అధికారికంగా ఈ ప్రాజెక్టులో మ్యూజిక్ డైరెక్టర్గా జాయిన్ అవ్వాలని నిర్ణయించుకున్నాను” అంటూ వివరించింది కెనీషా . మొత్తానికైతే లేడీ మ్యూజిక్ డైరెక్టర్ గా కెనీషా బాధ్యతలు తీసుకోవడం అభిమానులను సర్ప్రైజ్ చేస్తోంది. మరి ఈమె మ్యూజిక్ సారధ్యంలో రాబోతున్న ఈ అన్ ఆర్డినరీ మ్యాన్ మ్యూజిక్ పరంగా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Related News

అప్పుడు అవమానం.. ఇప్పుడు అభిమానం.. తెలంగాణ యాసను తవ్వి తలకెత్తుకుంటున్న టాలీవుడ్!

మరోసారి చిక్కుల్లో పడ్డ ‘ఇరుముడి’.. రవితేజ క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్!

మాధురి రాథోడ్, ఈశ్వర్ సాయి కేసులో బిగ్ ట్విస్ట్.. 24 గంటల డెడ్ లైన్ పెట్టిన మాధురి!

పవన్ కు హిట్ ఇచ్చా.. మహేష్ బాబు విషయంలో బాధపడుతున్న డైరెక్టర్?

సర్దార్ 2 కు 500 కోట్ల కలెక్షన్స్.. జోస్యం చెప్పిన మనోజ్.. అంతా కాన్ఫిడెన్స్ ఏంటీ బ్రో?

ది ప్యారడైజ్ వాయిదా వార్తలకు చెక్… విడుదలపై క్లారిటీ ఇచ్చిన మేకర్స్!

వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’లోకి ఎన్టీఆర్ ఎంట్రీ?

Big Stories

Advertisement
×