Realme 16 Pro Harry Potter Edition: హ్యారీ పాటర్ మాయాజాలాన్ని ఇష్టపడే సినీ అభిమానులకు ప్రముఖ టెక్ సంస్థ రియల్‌మీ త్వరలోనే ఒక సర్ప్రైజ్ ఇవ్వబోతోంది. సినిమాల్లో చూపించిన మ్యాజిక్ ప్రపంచాన్ని కంపెనీ ఇప్పుడు స్మార్ట్‌ఫోన్ రూపంలో మన చేతుల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌లో హ్యారీ పాటర్ థీమ్‌తో వస్తున్న ఈ కొత్త ఫోన్ టీజర్ ప్రస్తుతం టెక్ ప్రపంచంలో తెగ ట్రెండ్ అవుతోంది. మాములు ఫోన్లలా కాకుండా దీన్ని పూర్తిగా ఒక కలెక్టెడ్ పీస్‌లా డిజైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
రియల్‌మీ రీసెంట్‌గా ఫ్లిప్‌కార్ట్‌లో వదిలిన టీజర్ చూస్తే ఎవరికైనా ఇంట్రెస్ట్ కలగకమానదు. పాతకాలపు బ్రౌన్ కలర్ సూట్‌కేస్‌లు, ఒక ట్రాలీతో ఉన్న ఈ పోస్టర్ హ్యారీ పాటర్ సినిమాలో వచ్చే ఫేమస్ ప్లాట్‌ఫారమ్ 9¾ను గుర్తుచేస్తోంది. ‘లెట్ ది మ్యాజిక్ బిగిన్’ అంటూ ఇచ్చిన క్యాప్షన్ చూస్తుంటే ఫ్యాన్స్‌కు ఏదో పెద్ద బొమ్మే చూపించబోతున్నట్లు అర్థమవుతోంది. ఈ చిన్న హింట్ చాలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ కావడానికి.
Also Read: రోజుకి రూ.6 ఖర్చుతో ఏడాదికి పైగా అన్‌లిమిటెడ్ కాల్స్, 824GB డేటా.. BSNL దిమ్మతిరిగే ఆఫర్!
తాజాగా లీకైన ఫొటోల ప్రకారం.. ఈ స్పెషల్ ఎడిషన్ ఫోన్ డిజైన్ నెక్స్ట్ లెవెల్‌లో ఉండబోతోంది. ఫోన్ వెనుక భాగం లెదర్ ఫినిషింగ్‌తో కూడిన డార్క్ బ్రౌన్ కలర్‌లో వస్తోంది. దాని చుట్టూ గోల్డెన్ కలర్ బోర్డర్స్ ఈ ఫోన్‌కు రాయల్ లుక్ ఇస్తున్నాయి. సరిగ్గా మధ్యలో హాగ్వార్ట్స్ స్కూల్ క్రస్ట్, గోల్డెన్ సింబల్స్ ఉండటం దీనికి మెయిన్ హైలైట్. హ్యారీ పాటర్ బ్రాండింగ్‌తో వస్తున్న ఈ ఫోన్ లుక్ చూస్తేనే మ్యాజికల్ ఫీల్ వచ్చేస్తుంది.
ఇక లోపలి హార్డ్‌వేర్ విషయానికి వస్తే.. ఇది స్టాండర్డ్ రియల్‌మీ 16 ప్రో మోడల్ మాదిరిగానే 12జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్‌తో రానుందని సమాచారం. ఇందులో 144Hz రిఫ్రెష్ రేట్ ఉన్న పెద్ద AMOLED డిస్‌ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 7300 మాక్స్ చిప్‌సెట్ ఉండే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా 7000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ దీనికి మెయిన్ ప్లస్ పాయింట్. అయితే హార్డ్‌వేర్‌లో మార్పులు ఉంటాయా లేదా అనేది కంపెనీ అఫీషియల్‌గా అనౌన్స్ చేస్తేనే తెలుస్తుంది.
ఇదొక కేవలం కలర్ వేరియంట్ మాత్రమే కాదని, దీని సాఫ్ట్‌వేర్ కూడా హ్యారీ పాటర్ థీమ్‌లోనే ఉంటుందని టాక్. ఫోన్ వాల్‌పేపర్లు, ఐకాన్స్, అన్నీ ఆ మ్యాజికల్ వరల్డ్ నుంచే తీసుకుంటారు. అంతేకాకుండా.. దీని బాక్స్ ప్యాకింగ్ కూడా చాలా డిఫరెంట్‌గా, కలెక్టబుల్ ఐటెమ్‌లా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ప్రైస్, లాంచ్ డేట్ ఇంకా బయటకు రాలేదు కానీ, ఈ ఫోన్ మాత్రం ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకోవడం ఖాయం.
Also Read: ఐస్‌క్రీమ్ లుక్‌తో వావ్ అనిపించేలా గేమింగ్ కూలర్.. మొబైల్ హీట్ ప్రాబ్లమ్‌కు పర్మినెంట్ సొల్యూషన్!