E-Paper
Advertisement

ఆరోజు జరిగిందిందే.. నిజాలు బయటపెట్టిన ఈశ్వర్ సాయి అసిస్టెంట్!

ఆరోజు జరిగిందిందే.. నిజాలు బయటపెట్టిన ఈశ్వర్ సాయి అసిస్టెంట్!
Advertisement

Eshwar Sai – Madhuri Rathod:ఫోక్ సాంగులతో భారీ పాపులారిటీ సంపాదించుకున్న ఈశ్వర్ సాయి (Eshwar Sai), మాధురి రాథోడ్ (Madhuri Rathod) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. రాతిరి రాతిరి రాతిరిలో, బాసింగ బలాలే అంటూ ఇలా ఎన్నో ఫోక్ సాంగ్ లతో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు. అలాంటి ఈ జంట అనుహ్యంగా రిలేషన్ పెట్టుకోవడం, ఈశ్వర్ సాయి భార్యకు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోవడం, పోలీస్ కంప్లైంట్, ఇటు ఈశ్వర్ సాయి క్షమాపణలు చెప్పడం, మోసం చేశాడంటూ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం చేయడం ఇలా అన్ని సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇలాంటి సమయంలో సడన్గా ఈశ్వర్ సాయి అసిస్టెంట్ అంటూ ఒక వ్యక్తి మీడియా ముందుకు వచ్చి, మాధురి రాథోడ్ చెప్పేదంతా నిజమే అంటూ ఈశ్వర్ సాయి మోసాలను బయటపెట్టారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.

ఈశ్వర్ సాయి మోసాలను బయటపెట్టిన అసిస్టెంట్..

ఈశ్వర్ సాయి అసిస్టెంట్ ని అంటూ ఒక వ్యక్తి ఒక వీడియో రిలీజ్ చేశారు. అందులో.. నేను ఈశ్వర్ సాయి పర్సనల్ అసిస్టెంట్ ను.. ఇంస్టాగ్రామ్, సోషల్ మీడియాలో ఏదైతే ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ గురించి నడుస్తోందో అవన్నీ చూసి నేను.. ఏది నిజం? ఏది అబద్దం? చెప్పాలనుకున్నాను.. ఆరోజు గొడవ జరిగే సమయంలో అక్కడ నేను కూడా ఉన్నాను. ఎవరైతే ఈశ్వర సాయి వైఫ్ అన్నారో అసిస్టెంట్ ఉన్నారని , ఆ అసిస్టెంట్ నేనే.. నా ముందరే చాలాసార్లు ఈశ్వర్ అన్న , మాధురి మేడం కి చెప్పారు. నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, నువ్వంటే చాలా ఇష్టమని చాలా సందర్భాలలో చెప్పారు. అయితే ఆ విషయాలపైన మాధురి రాథోడ్ మాట్లాడుతూ..” నీకు ఒక లైఫ్ ఉంది. ఒక బాబు ఉన్నాడు , వివాహమయ్యింది. ఇవన్నీ సెట్ అవ్వవు ” అంటూ చెప్పింది.

Advertisement

also read:మరోసారి చిక్కుల్లో పడ్డ ‘ఇరుముడి’.. రవితేజ క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్!

మాధురి చెప్పిన వినని ఈశ్వర్ సాయి..

కానీ ఈశ్వర్ సాయి మాత్రం.. ” లేదు నా భార్య నన్ను టార్చర్ పెట్టింది.. నన్ను కారు కేసి కొట్టింది. నేను ఉండలేకపోతున్నాను” అని చెప్పాడు. దీనికి మాధురి మాట్లాడుతూ.. “లేదండి, ఆమె మీ కోసమే ఆలోచిస్తుంది. ఆమెతో గడిపే సమయం కూడా ఇవ్వలేదని చెప్పుకొచ్చింది.ఆమెకు టైం ఇవ్వడానికి మీకెందుకు ఇబ్బంది” అంటే.. “నాకు ఓపిక అయిపోయింది”అంటూ తెలిపారు ఈశ్వర్ సాయి. నువ్వు నన్ను వివాహం చేసుకో అంటూ మాధురి రాథోడ్ కి చెప్పారు.

భర్త మోసం చేసినా.. వెనకేసుకొస్తున్న శరణ్య..

Advertisement

ఆ తర్వాత మాధురి రాథోడ్ కి ఈశ్వర్ సాయి భార్య శరణ్య ఫోన్ చేసి.. ఈశ్వర్ అనే వ్యక్తి చాలా వేస్ట్ ఫెలో, వెధవ.. నేను 9 నెలల గర్భవతిగా ఉన్నప్పుడే రోడ్డుమీద వదిలేసి వెళ్ళిపోయాడని చెప్పినప్పటికీ.. అలా అనకు శరణ్య నేను మాట్లాడతాను.. మీరు విడాకులు అనే టాపిక్ ఏమీ మాట్లాడుకోవద్దని చెప్పినప్పటికీ.. లేదు మాధురి గారు.. నేను విడాకులు తీసుకుంటానని చెప్పింది.. అలాగే తను ఎప్పుడైతే ఫోక్ మానేస్తాడో అప్పుడే నేను తన లైఫ్ లో వెళ్తాను అంటూ చెప్పిందట శరణ్య. ఆ వెంటనే ఈశ్వర్ సాయి మాట్లాడుతూ.. లేదు, నాకు ఫోక్ ఇండస్ట్రీ నే ఇంపార్టెంట్ .. తాను ఇంపార్టెంట్ కాదంటూ చెప్పారని.. నేను చిన్నప్పటి నుంచి పెట్టుకున్న నా గోల్ ఇది అంటూ చెప్పుకొచ్చారు ఈశ్వర్ సాయి. తన భార్య శరణ్యతో జోక్ వేయాలన్న మాట్లాడాలన్నా కూడా భయపడాల్సి వస్తోంది అంటూ ఇలా ఎన్నో విషయాలు మాధురితో చెప్పారని ,కానీ ఇప్పుడు మాధురినే మోసం చేశాడు అంటూ ఈశ్వర్ సాయి అసిస్టెంట్ కామెంట్స్ చేశారు.

Related News

బిగ్ బాస్ 10.. ఆ ముగ్గురు కంటెస్టెంట్స్ కి సపోర్టుగా హైపర్ ఆది!

మొదలైన వార్.. కృష్ణుడు ఫైర్!

Podarillu Serial : సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. ఆ క్యారక్టర్ అవుట్..

Nindu Noorella Saavasam Serial Today EpisodeSeptember 8th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: బుజ్జమ్మ శక్తులు హరించేందుకు వెళ్లిన ప్రచండ

Podarillu Gopika : చక్రీ గర్ల్ ఫ్రెండ్ గోపిక బ్యాగ్రౌండ్.. ఒక్కరోజు రెమ్యూనరేషన్..?

Intinti Ramayanam Pallavi : పచ్చని ప్రకృతిలో పరవశించిపోతున్న పల్లవి.. సో క్యూట్ కదా..

Gundeninda GudiGantalu Today episode: ప్రభా దెబ్బకు రోహిణి అవుట్.. మౌనికకు అనుమానం.. బాలు, మీనా రొమాన్స్..

Big Stories

Advertisement
×