E-Paper
Advertisement

Solar CCTV Cameras: కరెంట్ అక్కర్లేదు, వై-ఫై వద్దు.. సిమ్ కార్డుతో పనిచేసే ఈ సోలార్ కెమెరా గురించి తెలుసా?

Solar CCTV Cameras: కరెంట్ అక్కర్లేదు, వై-ఫై వద్దు.. సిమ్ కార్డుతో పనిచేసే ఈ సోలార్ కెమెరా గురించి తెలుసా?
Advertisement

Solar CCTV Cameras: మనం ప్రతిరోజూ టీవీల్లోనో, వార్తా పత్రికల్లోనో చూస్తుంటాం.. తాళం వేసిన ఇంట్లో దొంగలు పడ్డారు, ఫలానా షాపులో నగదు చోరీ, పొలాల వద్ద మోటర్లు దొంగతనం.. ఇలా నిత్యం ఏదో ఒక రకంగా దొంగతనాలు జరుగుతూనే ఉంటాయి. సాధారణంగా ఇలాంటివి జరగకుండా ఉంచేందుకు సీసీటీవీ కెమెరాలను అమర్చుతాం. అయితే కొన్ని మారుమూల ప్రాంతాల్లో, ఫామ్‌హౌస్‌ల్లోనో కెమెరా పెట్టాలంటే కరెంట్ ఉండదు. వైరింగ్ లాగడం పెద్ద తలనొప్పి. ఇప్పుడీ సమస్యకు చెక్ పెట్టేందుకు ‘సోలార్ సీసీటీవీ కెమెరాలు’ అందుబాటులోకి వచ్చేశాయి.

ఈ సోలార్ సీసీటీవీ కెమెరాలకు కరెంట్ అస్సలు అవసం లేదు, వైర్ల గొడవే లేదు. జస్ట్ సూర్యరశ్మి ఉంటే చాలు.. పగలు, రాత్రి అనే తేడా లేకుండా మన ఇల్లు, షాపు, పొలం.. ఎక్కడైనా సరే నిరంతరం కాపలా కాస్తాయి. అందుకే ఇప్పుడు మన దేశంలో ఈ స్మార్ట్ కెమెరాలకు విపరీతమైన క్రేజ్ పెరిగింది.

వీటి ప్రత్యేకత ఏమిటంటే?

Advertisement

ఈ కెమెరాల పైన ఒక చిన్న సోలార్ ప్యానెల్ ఉంటుంది. ఇది పగటిపూట బ్యాటరీని ఛార్జ్ చేస్తుంది. తద్వారా రాత్రిపూట కూడా కెమెరా నిరంతరాయంగా పనిచేస్తుంది. ముఖ్యంగా వై-ఫై సౌకర్యం లేని చోట్ల 4G సిమ్ కార్డ్ సపోర్ట్ చేసే మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. దీంతో మీరు ఎక్కడున్నా సరే.. మొబైల్‌ నుంచే లైవ్ వీడియో చూడొచ్చు. అలాగే వర్షం, ఎండను తట్టుకునేలా వీటిని ఐపీ66 రేటింగ్‌తో తయారు చేస్తారు.

Also Read: రూ.389కే జ్యూస్ బ్లెండర్.. బ్యాగులో పెట్టుకుని ఆఫీస్, జిమ్ ఎక్కడికైనా పట్టుకెళ్లొచ్చు!

ఫీచర్ల ఎంపిక మీదే:

Advertisement

ఒకవేళ మీరు గనుక ఈ సోలార్ కెమెరా కొనాలనుకుంటే కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి. కనీసం 3MP లేదా 5MP రెజల్యూషన్ ఉంటే దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తాయి. రాత్రిపూట కూడా కలర్ వీడియో వచ్చేలా కలర్ నైట్ విజన్ ఫీచర్ ఉండటం అదనపు బలం. అలాగే కెమెరాను మొబైల్ నుంచే అటు ఇటు తిప్పేలా పిటిజెడ్ (PTZ) ఫీచర్, ఎవరైనా వచ్చినప్పుడు అలర్ట్ ఇచ్చే మోషన్ డిటెక్షన్ వంటివి తప్పనిసరిగా చూసుకోవాలి.

ధరలు, ఆఫర్ల వివరాలు:

ప్రస్తుతం అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి సైట్లలో వీటిపై భారీ డిస్కౌంట్లు నడుస్తున్నాయి. బేసిక్ మోడల్స్ రూ.4,000 నుంచే ప్రారంభమవుతున్నాయి. ట్రూవ్యూ, మేజిక్, గోద్రెజ్ వంటి బ్రాండ్లు మంచి ఆదరణ పొందుతున్నాయి. ఒకప్పుడు రూ.20,000 ఉన్న అడ్వాన్స్‌డ్ కెమెరాలు ఇప్పుడు ఆఫర్లలో కేవలం రూ.6,000 నుంచి రూ.10,000కే లభిస్తున్నాయి. అంతేకాదు.. హెచ్‌డిఎఫ్‌సి, ఎస్‌బీఐ వంటి బ్యాంక్ కార్డులపై అదనంగా 10 శాతం వరకు తగ్గింపు కూడా పొందవచ్చు. అయితే వీటిని కొనేముందు కనీసం ఏడాది వారంటీ ఉండేలా చూసుకోండి.

Also Read: ఒంటరిగా ఉంటున్నారా? అయితే జాగ్రత్త.. మీకు షుగర్ వచ్చే ఛాన్స్ 50% ఎక్కువట!

ముఖ్య గమనిక:

ఈ కథనంలో మీకు పరిచయం చేసిన ప్రొడక్ట్ లేదా దాని ధరలు.. ఆయా కంపెనీల ఆఫర్లపై ఆధారపడి ఉంటాయి. వాటిని కొనుగోలు చేసేప్పుడు ఒకటికి రెండుసార్లు తప్పకుండా సరిచూసుకోగలరు. మీరు కొనుగోలు చేసే సమయానికి ఈ కథనంలో పేర్కొన్న ధరలు మారిపోయి ఉండవచ్చు. కాబట్టి.. అలాంటి విషయాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు. ఈ వివరాలు కేవలం మీ అవగాహన కోసమే.

 

Related News

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ.. గేమర్స్ కోసం నెక్ట్స్ లెవెల్ టాబ్లెట్ వచ్చేసింది!

కెమెరా పక్కనే మరో డిస్‌ప్లే.. ఇన్ఫినిక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ లుక్ చూశారా?

రెడ్‌మీ నోట్ 17కు రీబ్రాండెడ్‌గా Poco X8, M8 పవర్.. ఫీచర్లు, ధరల వివరాలు ఇవే!

ఇంటిని థియేటర్‌గా మార్చే బెస్ట్ బడ్జెట్ పోర్టబుల్ ప్రొజెక్టర్లు.. ధరలు కూడా బడ్జెట్‌లోనే!

Facebook వాడే ప్రతి ఒక్కరూ మార్చాల్సిన 5 సీక్రెట్ సెక్యూరిటీ సెట్టింగ్స్ ఇవే!

iPhone 18 Pro Max లీక్స్.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే, కానీ ఆ ఒక్కటే పెద్ద ట్విస్ట్!

గేమర్స్‌కు పూనకాలు తెప్పిస్తున్న Oppo K15.. నీళ్లలో పడినా, రఫ్ అండ్ టఫ్ వాడినా తగ్గేదే లేదంట!

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

Big Stories

Advertisement
×