E-Paper
Advertisement

Riddhi Kumar: ప్రభాస్‌ ‘ది రాజాసాబ్‌’లో హీరోయిన్‌ ఛాన్స్‌.. నిర్మాతది ప్రాంక్ కాల్ అనుకున్నా..

Riddhi Kumar: ప్రభాస్‌ ‘ది రాజాసాబ్‌’లో హీరోయిన్‌ ఛాన్స్‌.. నిర్మాతది ప్రాంక్ కాల్ అనుకున్నా..
Advertisement

Riddhi Kumar About Raja Saab Offer: ప్రభాస్ మోస్ట్‌ అవైయిటెడ్‌ చిత్రంలో ‘ది రాజా సాబ్‌’ ఒకటి. డైరెక్టర్‌ మారుతి దర్శకత్వంలో పాన్‌ ఇండియాగా రూపొందని ఈ చిత్రం సంక్రాంతికి పండుగ కానుకగా విడుదలకు సిద్దమౌతుంది. ప్రస్తుతంప పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌తో పాటు ప్రమోషన్స్‌తో బిజీగా ఉంది మూవీ టీం. ఈ నేపథ్యంలో వరుసగా మూవీ నుంచి అప్‌డేట్స్‌ వదులుతుంది. ఫాంటసీ కామెడీ, హార్రర్‌ థ్రిల్లర్‌ తెరకెక్కిన ఈ చిత్రంలో బాలీవుడ్‌ స్టార్‌ నటుడు సంజయ్‌ దత్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు.

రాధేశ్యామ్ లో అతిథిగా..

Advertisement

ఇందులో ప్రభాస్‌ సరసన ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్న సంగతి తెలిసిందే.  వారిలో నిధి అగర్వాల్‌, మళయాళ భామ మాళవిక మోహనన్‌, బాలీవుడ్‌ బ్యూటీ రిద్ధి కుమార్‌. ఈ రిద్ధి కుమార్‌ మరెవరో కాదు ప్రభాస్‌ రాధే శ్యామ్‌లో ట్రైయిన్‌ సీన్‌లో కనిపించిన అమ్మాయే ఆమె. ఇందులో ఆమె మూడో హీరోయిన్‌ ప్రభాస్‌ సరసన రొమాన్స్‌ చేయబోతుంది. త్వరలో మూవీ రిలీజ్ సందర్భంగా రిద్ధిమా తాజాగా ఓ యూట్యూబ్‌ చానల్‌కు ఇంటర్య్వూలో ఇచ్చింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ది రాజా సాబ్ టీం నుంచి కాల్‌ వచ్చినప్పుడు మొదట నమ్మలేదని చెప్పింది. ఇది ప్రాంక్‌ కాల్‌ అనుకున్నానని చెప్పింది.

నిర్మాతది ప్రాంక్ కాల్ అనుకున్నా

ఆమె మాట్లాడుతూ.. “మొదట రాజా సాబ్‌ సినిమా నిర్మాత నాకు ఫోన్‌ చేశారు. ‘ప్రభాస్‌ సినిమాలో మీమ్మల్ని హీరోయిన్‌గా అనుకుంటున్నాం’ అని చెప్పారు. ఇది విని నేను షాక్‌ అయ్యాయి. నేను ప్రభాస్‌ సినిమాలో హీరోయిన్‌ ఏంటని నమ్మలేదు. ఎవరైనా నాతో ప్రాంక్‌ చేస్తున్నారనే సందేహం వేసింది. నా మేనేజర్‌కి చెప్పి ఈ ఫోన్‌ ఎవరి నుంచి వచ్చిందో తెలుసుకోమ్మని చెప్పారు. నా మేనేజర్ అన్ని విధాలు విచారణ చేసి ఇది నిజమే అని, ది రాజా సాబ్‌ నిర్మాతే నాకు ఫోన్ చేశారని తెలుసుకున్నారు. ఇదే విషయం నాకు చెప్పడంతో పట్టనంత సంతోషం వేసింది. ఇది నిజమని తెలిసి ఎగిర గత్తేశా” అంటూ ఆమె చెప్పుకొచ్చింది. కాగా మహారాష్ట్రకు చెందిన రిద్ధి కుమార్‌ మొదట లవర్‌ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైంది. ఇందులో సహా నటి పాత్రలో కనిపించింది.

Advertisement

Also Read: Ghattamaneni Jayakrishna: ఘట్టమనేని వారసుడి ఎంట్రీ.. టైటిల్‌, ప్రీలుక్‌కి ముహుర్తం ఫిక్స్!

జనవరి 9న విడుదల

ఆ తర్వాత మలయాళ, మరాఠీ సినిమాల్లో నటించింది. ప్రభాస్ ‘రాధేశ్యామ్’ చిత్రంలోనూ అతిథి పాత్రలో కనిపించింది. ఇప్పుడు ‘రాజాసాబ్’లో పూర్తి స్థాయి హీరోయిన్‌గా ఛాన్స్ దక్కించుకుంది. మొదట డిసెంబర్ 5న రావాల్సిన ఈ చిత్రం వీఎఫ్‌ఎక్స్‌ వర్క్‌ కారణంగా వాయిదా పడింది. దీంతో వచ్చే ఏడాది సంక్రాంతికి జవనరి 9న ది రాజా సాబ్‌ వరల్డ్‌ వైడ్‌గా విడుదల కానుంది. ఇటీవల ఈ సినిమా నుంచి తొలి సాంగ్‌ విడుదల కాగా.. ఇందులో రిద్ధి ప్రభాస్‌ తో కలిసి స్టెప్పులు వేసింది. ఈ పాటకు ఆడియన్స్‌ నుంచి మంచి రెస్పాన్స్‌ వస్తుంది. కాగా ఇప్పటికే విడుదలై ప్రచార పోస్టర్స్, ఫస్ట్‌లుక్‌, గ్లింప్స్‌కి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. దీంతో మూవీపై భారీ హైప్‌ క్రియేట్‌ అయ్యింది. ఇందులో వీఎఫ్‌ఎక్స్‌కి పెద్ద పీట వేశాడు మారుతి. విజువండర్‌గా హారర్‌ కామెడీతో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు. ఈ సినిమాను పీపుల్స్మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

Related News

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

38ఏళ్ల తర్వాత తండ్రి నాగబాబు రికార్డును రిపీట్ చేసిన నిహారిక!

సైలెంట్ గా నిశ్చితార్థం.. పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరో!

కళ్ళు లేవు.. మైమరిపించే గాత్రానికి నేషనల్ అవార్డు.. ఎవరీ సింగర్?

విజువల్ వండర్ గా రామాయణ ట్రైలర్.. అఫీషియల్ ఎప్పుడంటే?

Big Stories

Advertisement
×