E-Paper
Advertisement

Water Supply Disruption: హైదరాబాద్ నగర వాసులకు బిగ్ అలర్ట్.. నవంబర్ 26న ఈ ఏరియాల్లో నీటి సరఫరా బంద్

Water Supply Disruption: హైదరాబాద్ నగర వాసులకు బిగ్ అలర్ట్.. నవంబర్ 26న ఈ ఏరియాల్లో నీటి సరఫరా బంద్
Advertisement

Water Supply Disruption: హైదరాబాద్ నగర వాసులకు బిగ్ అలర్ట్. నగరంలో పలు ఏరియాల్లో.. తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. క్రిష్ణా నీటి సరఫరా వ్యవస్థకు అనుసంధానమైన పంపింగ్ స్టేషన్లలో జరిగే నిర్వహణ పనుల కారణంగా.. నవంబర్ 26న ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు నీటి పంపిణీ వ్యవస్థ నిలిచే అవకాశం ఉందని, హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు (HMWSSB) ప్రకటించింది.

క్రిష్ణా ఫేజ్–1, ఫేజ్–2,ఫేజ్–3 పంపింగ్ స్టేషన్లకు నిరంతర విద్యుత్‌ను సరఫరా చేసే.. బల్క్ ఫీడర్లలో కొంత భాగం దెబ్బతిన్న కరెంట్ ట్రాన్స్‌ఫార్మర్‌లు (CTs) మార్చాల్సి రావడంతో.. ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. ఈ పనులను సురక్షితంగా నిర్వహించడానికి TGTRANSCO 132 కేవీ నసర్లపల్లి సబ్‌స్టేషన్‌కు విద్యుత్ సరఫరాను తాత్కాలికంగా నిలిపివేయనుంది.

Advertisement

విద్యుత్ నిలిపివేత ఉదయం 10 గంటలకు ప్రారంభమై సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. ఈ సమయంలో పంపింగ్ యంత్రాలు పనిచేయకుండా ఉండటంతో నగరంలోని పలు ప్రాంతాల్లో నీటి సరఫరా కొంత మేర ప్రభావితం కానుంది.

ఈ ప్రభావంతో నవంబర్ 26న జలమండలి సరఫరా చేసే కృష్ణా ఫేస్ -1,2,3 ల‌లో పలు డివిజన్‌లలో నీటి సరఫరాలో పాక్షిక అంతరాయం ఏర్పడనుంది.

Advertisement

డివిజన్–1: చార్మినార్

డివిజన్–2: వినయ్ నగర్

డివిజన్–3: బోజగుట్ట

డివిజన్–4: రెడ్ హిల్స్

డివిజన్–5: నారాయణగూడ

డివిజన్–6: ఎస్.ఆర్. నగర్

డివిజన్–7: మారేడ్‌పల్లి

డివిజన్–8: రియాసత్ నగర్

డివిజన్–9: కూకట్‌పల్లి

డివిజన్–10: సహేబ్ నగర్

డివిజన్–11: హయత్ నగర్

డివిజన్–13: సైనిక్‌పురి

డివిజన్–14: ఉప్పల్

డివిజన్–15: హఫీజ్‌పేట్

డివిజన్–16: రాజేంద్రనగర్

డివిజన్–18: మనికొండ

డివిజన్–19: బోడుప్పల్

డివిజన్–20: మీర్‌పేట్

Also Read: డ్యామేజ్ కాకుండా బీఆర్ఎస్ ప్లాన్.. కవితపై ఎదురుదాడి, రంగంలోకి కీలక నేతలు

నీటి సరఫరా తాత్కాలికంగా నిలిపివేసే అవకాశం ఉన్నందున.. స్థానిక నివాసితులు ముందుగానే తాగునీరు నిల్వ చేసుకోవాలని, అందుబాటులో ఉండే నీటిని జాగ్రత్తగా వినియోగించుకోవాలని HMWSSB విజ్ఞప్తి చేసింది. సరఫరా పూర్తిగా సాధారణ స్థాయికి రావడానికి కొంత సమయం పట్టవచ్చని అధికారులు తెలిపారు.

 

Related News

ఈసారి దక్షిణాది వంతు.. వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు, హైదరాబాద్‌లో అయితే..

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Banjara Ekta: బంజారా ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న ఢిల్లీలో భారీ బహిరంగ సభ!

కానిస్టేబుల్ పై ఫోక్సో కేసు నమోదు.. ఎక్కడంటే..?

నీట్ అక్రమాలపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందే.. బీజేపీపై ఎంపీ చామల ఫైర్!

హైదరాబాద్‌లో ఆ ఓట్లపై కాంగ్రెస్, MIM కన్ను.. రంగంలోకి దిగిన బీజేపీ!

కాంగ్రెస్ నడిచే పడవ కాదు.. మునిగే పడవ.. ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్లు!

Big Stories

Advertisement
×