E-Paper
Advertisement

శివ కార్తికేయన్ గొప్ప మనసు..కొడుకు చదువుల కోసం ఆ నటుడికి 50 లక్షల సాయం…గ్రేట్ అంటూ!

శివ కార్తికేయన్ గొప్ప మనసు..కొడుకు చదువుల కోసం ఆ నటుడికి 50 లక్షల సాయం…గ్రేట్ అంటూ!
Advertisement

Siva Karthikeyan: సినిమా ఇండస్ట్రీలో తెరపై హీరోలుగా కనిపిస్తూ సందడి చేసే కొంతమంది సెలబ్రిటీలు తెర వెనుక కూడా మంచితనం ఉంది అంటూ పలు సందర్భాలలో బయటపెడుతూ రియల్ హీరో అని పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకుంటూ ఉంటారు. తాము సంపాదించే దాంట్లో కొంత భాగం సహాయ సహకారాల కోసం ఎంతోమంది సెలబ్రిటీలు ఖర్చు చేస్తూ ఉంటారు అలాగే ఎంతో మందికి ఎన్నో రకాలుగా సహాయం చేస్తూ ఉంటారు. కొంతమంది హీరోలు మాత్రం వాళ్ళు చేసిన సహాయం గురించి బయట చెప్పడానికి పెద్దగా ఇష్టపడరు. వారి నుంచి సహాయం పొందిన వారు చెబితే తప్ప ఇలాంటి విషయాలు బయటపడవు.

ప్రేమ్ కుమార్ కొడుకు చదువు కోసం..

ప్రస్తుతం నటుడు శివ కార్తికేయన్ పరిస్థితి కూడా అలాగే ఉందని చెప్పాలి. తాజాగా తమిళ నటుడు ప్రేమ్ కుమార్(Prem Kumar) కు సంబంధించిన ఒక వీడియో వైరల్ అవుతుంది. ఇందులో భాగంగా నటుడు శివ కార్తికేయన్ (Siva Karthikeyan)చేసిన సహాయము కారణంగానే నేడు తన కొడుకు మంచి ఉద్యోగం చేస్తున్నారని తెలిపారు. శివ కార్తికేయన్ నటించిన హీరో సినిమాలో నటుడు ప్రేమ్ కుమార్ కూడా నటించారు ఆ సమయంలో ప్రేమ్ కుమార్ తన కొడుకు చదువుల కోసం డబ్బును సమకూర్చడంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారట.తన కొడుకు ఉన్నత చదువుల కోసం చేతిలో డబ్బు లేకపోవడమే కాకుండా, ఇంటిని తాకట్టు పెట్టడం కోసం ప్రయత్నం చేస్తే అప్పటికే ఈఎంఐ ఉండటంవల్ల బ్యాంకు వారు సైతం లోన్ ఇవ్వటానికి నిరాకరించారు.

50 లక్షలకు శివ కార్తికేయన్ షూరిటీ..

Advertisement

తన కొడుకు చదువుల కోసం ఇబ్బందులు పడుతున్న సమయంలో ప్రేమ్ కుమార్ తన సమస్యను శివ కార్తికేయన్ కు చెప్పగా, బ్యాంకులో 50 లక్షలకు షూరిటీ ఉంటూ తనకు సాయం చేశారు అప్పుడు ఆయన చేసిన సహాయం కారణంగానే నా కొడుకు ఉన్నత చదువులు చదివి ఇప్పుడు నెలకు 5 లక్షలు సంపాదిస్తున్నారు అంటూ ప్రేమ్ కుమార్ శివ కార్తికేయన్ చేసిన సహాయాన్ని ఈ సందర్భంగా బయట పెట్టడంతో శివ కార్తికేయన్ మంచితనంపై పెద్ద ఎత్తున అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. కేవలం చిన్న పరిచయంతో ఏకంగా 50 లక్షలకు షూరిటీ ఉండడం అంటే మామూలు విషయం కాదు.

Advertisement

ప్రేమ్ కుమార్ పై ఉన్న నమ్మకంతోనే శివ కార్తికేయన్ తనతో పెద్దగా పరిచయం లేకపోయినా 50 లక్షలకు షూరిటీ ఉండి సహాయం చేశారని తెలుస్తోంది. ఇక శివ కార్తికేయన్ విషయానికి వస్తే ఇటీవల ఈయన వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తూ మంచి సక్సెస్ అందుకోవడమే కాకుండా మరో వైపు నిర్మాతగా కూడా మారారు. శివ కార్తికేయన్ నిర్మాతగా రాధిక ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా చిత్రం తాయ్  కిలవి అనే సినిమాతో నిర్మాతగా మారి మొదటి సినిమాతోనే సూపర్ సక్సెస్ అందుకున్నారు. ఇక శివ కార్తికేయన్ చివరిగా పరాశక్తి అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.

Also Read: మ్యూజియంలో నా విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఇష్టం లేదు…ఆమె కోసమే ఒప్పుకున్నా: రామ్ చరణ్

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×