E-Paper
Advertisement

మ్యూజియంలో నా విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఇష్టం లేదు…ఆమె కోసమే ఒప్పుకున్నా: రామ్ చరణ్

మ్యూజియంలో నా విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఇష్టం లేదు…ఆమె కోసమే ఒప్పుకున్నా: రామ్ చరణ్
Advertisement

Ram Charan: రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా చివరి దశ షూటింగ్లో ఉంది. తాజాగా రామ్ చరణ్ ఎస్వైర్ ఇండియా ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇంటర్వ్యూ సందర్భంగా ఈయన తన వ్యక్తిగత విషయాలతో పాటు వృత్తిపరమైన విషయాల గురించి కూడా ప్రస్తావించారని తెలుస్తుంది. ముఖ్యంగా రామ్ చరణ్(Ramcharan) తన పెట్ రైమ్ (Rhyme)గురించి ఈ ఇంటర్వ్యూ సందర్భంగా చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అదేవిధంగా రామ్ చరణ్ మైనపు విగ్రహాన్ని(Wax Statue) ఏర్పాటు చేయడం గురించి కూడా ఈ సందర్భంగా చరణ్ మాట్లాడారు. రామ్ చరణ్ తన మైనపు విగ్రహాన్ని  లండన్ లోని  మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో (Madam Tussadus) ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే .ఈ విగ్రహాన్ని 2025 మే9 న ఏర్పాటు చేశారు.

ఉపాసన సలహా కారణంగానే..

ఇక రామ్ చరణ్ తో పాటు ఆయన పెట్ రైమ్ మైనపు విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయటం విశేషం. అయితే తాజాగా చరణ్ ఎస్వైర్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా ఈ మైనపు విగ్రహం గురించి మాట్లాడుతూ నిజానికి తనకు ఈ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయడం పెద్దగా ఆసక్తి లేదని తెలిపారు. కానీ ఉపాసన తనతో పాటు రైమ్ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయిస్తే బాగుంటుందని సలహా ఇవ్వడంతో ఆ తర్వాతనే తాను ఒప్పుకున్నానని రామ్ చరణ్ తెలియజేశారు.

ఆ క్షణం ప్రత్యేకంగా మారింది..

Advertisement

ఉపాసన ఇలా చెప్పడంతో తాను కాస్త ఎమోషనల్ అవ్వటమే కాకుండా , ఇది తమ కుటుంబం అలాగే మా మధ్య ఉన్న ప్రేమకు సంబంధించినదని రామ్ చరణ్ భావించారట. తనతో పాటు రైమ్ ను చేర్చడం ఆ క్షణాన్ని మరింత ప్రత్యేకంగా మార్చిందని అందుకే మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి సంతోషంగా అంగీకరించానని రామ్ చరణ్ ఈ సందర్భంగా తన విగ్రహం గురించి తెలియజేశారు. ఇలా తన రైమ్ తో పాటు తన విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అనేది తన కెరియర్ లో ఒక మైలురాయి మాత్రమే కాదు తన వ్యక్తిగత జీవితాన్ని ఈ గుర్తింపుతో ప్రపంచవ్యాప్తంగా ముడిపెట్టిన అద్భుతమైన క్షణం అంటూ తెలిపారు.

చరణ్ తో పాటు రైమ్ విగ్రహం..

Advertisement

ఈ విధంగా రాంచరణ్ తనకు ఇష్టం లేకపోయిన కేవలం రైమ్ కోసమే మైనపు విగ్రహ ఏర్పాటుకు అంగీకరించారని తెలిసిన అభిమానులు తన రైమ్ పట్ల ఎలాంటి ప్రేమను చూపిస్తున్నారో స్పష్టం అవుతుంది. ఇకపోతే మన సినీ ఇండస్ట్రీలో మంచి పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్న సెలబ్రిటీల విగ్రహాలను మ్యూజియంలో ఇదివరకే ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే .టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రభాస్ అల్లు అర్జున్ మహేష్ బాబు వంటి స్టార్ హీరోల మైనపు విగ్రహాలను లండన్, దుబాయ్  మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే మొదటిసారి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక హీరోతో పాటు ఆయన పెట్ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయడం అనేది ఒక రామ్ చరణ్ విషయంలోనే జరిగిందని చెప్పాలి.

Also Read: బయటకు వెళ్తే మీ భర్త రాలేదా అని అడుగుతున్నారు.. రవికృష్ణతో రిలేషన్ పై నవ్య స్వామి క్లారిటీ!

Related News

సాంప్రదాయబద్ధంగా సమంత  సీమంతపు వేడుక వైరల్ అవుతున్న ఫోటోలు!

నటుడిగా మెప్పించి ‘నాగపూర్ పవిత్ర తేక్డి గణపతి’ పుస్తకంతో రచయితగా మారుతున్న హీరో సూర్య తేజ్

పావలా శ్యామల కుమార్తె విషయంలో ‘మా’ కీలక నిర్ణయం!

నా ముందే ఆటిట్యూడ్‌తో తిరుగుతున్నావ్.. శోభితపై చైతూ ఓపెన్ కామెంట్స్.. వీడియో చూశారా?

ఆకట్టుకుంటున్న రాగ్ మయూర్ ‘అనుమాన పక్షి’ ట్రైలర్!

హీరో అజిత్ కు  కారు గిఫ్ట్ గా ఇచ్చిన సీఎం విజయ్.. లవ్లీ బ్రదర్ అంటూ!

తరుణ్ నీలో ఈ టాలెంట్ కూడా ఉందా.. ‘ENE రిపీట్’ కోసం భలే కాకా పడుతున్నావే!

డైరెక్టర్ ఇంట్లో వినాయక చవితి చేసుకున్న నటి.. ఆ రిలేషన్ ఎదో కన్ఫర్మ్ చేసేయండయ్యా?

Big Stories

Advertisement
×