BigTV English

Sobhita: షూటింగ్ లొకేషన్ లో వంట చేసిన శోభిత.. చైతూ రియాక్షన్ ఇదే!

Sobhita: షూటింగ్ లొకేషన్ లో వంట చేసిన శోభిత.. చైతూ రియాక్షన్ ఇదే!
Advertisement

Sobhita: శోభిత పరిచయం అవసరం లేని పేరు. సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా కొనసాగుతూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్న శోభిత కేవలం తెలుగు ఇండస్ట్రీలో మాత్రమే కాదు బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అదే స్థాయిలో ఆదరణ దక్కించుకున్నారు. ఇలా పలు సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్న ఈమె అక్కినేని నాగచైతన్యను (Nagachaitanya) వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. నాగచైతన్య, సమంత (Samantha) విడాకులు (Divorce)తీసుకొని విడిపోయిన తర్వాత చైతన్యతో ఈమెకు పరిచయం ఏర్పడటం, ఆ పరిచయం కాస్త ప్రేమగా మారడంతో పెద్దల సమక్షంలో గత ఏడాది డిసెంబర్ 4వ తేదీ పెళ్లి చేసుకున్నారు. ఇక పెళ్లి తర్వాత కూడా శోభిత పలు సినిమాలలో నటిస్తున్నట్టు తెలుస్తుంది.


వంట చేసిన శోభిత…

ఇటీవల ఈమె తన సినిమా డబ్బింగ్ పనులను పూర్తి చేసినట్టు ఒక ఫోటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. పెళ్లి తర్వాత శోభతో సినిమాలకు దూరంగా ఉంటుందని భావించిన అభిమానులకు ఈమె సినిమా చేయబోతున్నారని విషయం తెలియడంతో ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. ఇక సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉండే శోభిత తాజాగా ఇన్స్టాగ్రామ్ వేదికగా కొన్ని ఫోటోలను షేర్ చేశారు. ఇందులో భాగంగా ఆమె షూటింగ్ లొకేషన్లో వంట చేస్తూ ఉన్నారని చెప్పాలి. ఇలా స్వయంగా శోభిత వంట చేయడంతో ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.


రుచి చూడాలని ఉంది..

ఇక ఈ ఫోటోలు చూసిన అభిమానులు విభిన్న రీతులో స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు. అక్క మీలో కుకింగ్ టాలెంట్ కూడా ఉందా అంటూ కామెంట్లు చేయగా శోభత స్పందిస్తూ తనకు మూడ్ ఉన్నప్పుడే చేయాలనిపిస్తుంది చెల్లి అంటూ సమాధానం ఇచ్చారు. ఇక శోభిత షేర్ చేసిన ఈ ఫోటోలపై నాగచైతన్య కూడా స్పందించారు. నాగ చైతన్య రియాక్ట్ అవుతూ… శోభిత చేసిన వంటలను రుచి చూడటానికి ఎదురుచూస్తున్నాను అంటూ చేసిన కామెంట్ వైరల్ అవుతుంది. ఇక నాగచైతన్య కామెంట్ పై అభిమానులు కూడా విభిన్న రీతిలో స్పందిస్తున్నారు.

ఇక నాగచైతన్య కూడా శోభితతో వివాహం జరిగిన తర్వాత తన వృత్తిపరమైన జీవితంలో మాత్రమే కాదు, వ్యక్తిగత జీవితంలో కూడా చాలా సంతోషంగా ఉన్నానని, పలు సందర్భాలలో వెల్లడించారు. షూటింగ్స్ ఏమీ లేకుండా ఇంట్లో ఉంటే కచ్చితంగా తాము ఇంట్లో తెలుగులోనే మాట్లాడుతామని ఇంట్లోనే భోజనం చేసుకుని తింటామని, తనకు సంబంధించిన ఏదైనా విషయాలలో తప్పకుండా శోభిత సలహా తీసుకుంటాను చైతూ తెలియజేశారు. ఇక నాగచైతన్య సినిమాలో విషయానికి వస్తే ఇటీవల తండేల్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఎంతో అద్భుతమైన విషయాన్ని అందుకుంది. ఇక ప్రస్తుతం ఈయన మరొక సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నారు. అదే విధంగా కొరటాల శివ డైరెక్షన్ లో మరో సినిమా కూడా చేయబోతున్నారని తెలుస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా చర్చల దశలో ఉంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన రాబోతున్నట్టు తెలుస్తుంది.

Also Read: Lokesh Kangaraj: చేసింది 6 సినిమాలే..22 మంది హీరోలను డైరెక్ట్ చేశా.. గర్వంగా ఉందంటూ!

Related News

Kiran Abbavaram: పవన్ సినిమాలలో అసలు నటించను…అభిమాని అయితే నటించాలా?

Samantha: డైరెక్టర్లు కూడా నాకు ఆ ఛాన్స్ ఇవ్వలేదు.. బోల్డ్ కామెంట్స్ చేసిన సమంత!

Hero Darshan: మళ్లీ సంకటంలో పడ్డ హీరో దర్శన్.. ఉన్నత న్యాయస్థానం మండిపాటు!

Hero Vishal: 8కోట్ల మంది ఇష్టాన్ని 8మంది నిర్ణయించలేరు..అవార్డులన్నీ చెత్తబుట్టలోకే!

K-Ramp: కిరణ్ అబ్బవరం కే- ర్యాంప్ ఫస్ట్ డే కలెక్షన్స్!

Bandla Ganesh: నెక్స్ట్ అల్లు అర్జున్ అతడే.. ఈ మాత్రం హైప్ ఇస్తే చాలు..చెలరేగిపోవడమే!

Bandla Ganesh: నా జీవితాన్ని మలుపు తిప్పిన డైరెక్టర్, హరీష్ శంకర్ రియాక్షన్ గమనించారా?

Spirit : ప్రభాస్ స్పెషల్ వీడియో రెడీ చేసిన సందీప్ రెడ్డి వంగ, మరో యానిమల్?

Big Stories

×