BigTV English

OTT Movie : భర్త చనిపోయాడని చెప్పి భార్యను లాక్కునే ఆఫీసర్… అతను తిరిగొచ్చి ఇచ్చే ట్విస్టుకు ఫ్యూజులు అవుట్

OTT Movie : భర్త చనిపోయాడని చెప్పి భార్యను లాక్కునే ఆఫీసర్… అతను తిరిగొచ్చి ఇచ్చే ట్విస్టుకు ఫ్యూజులు అవుట్
Advertisement

OTT Movie : సస్పెన్స్, సూపర్‌నాచురల్ ఎలిమెంట్స్‌తో ఒక బాలీవుడ్ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇందులో ప్రియమణి నటనకి మంచి మార్కులే పడ్డాయి. ఊటీ, కూనూర్ లొకేషన్స్, గ్రిప్పింగ్ క్లైమాక్స్ ఈ సినిమాకి హైలెట్ గా నిలిచాయి. ఈ సినిమాలో భర్త చనిపోయాడనుకుని భార్య మరొకరిని పెళ్ళి చేసుకుంటుంది. అయితే భర్త తిరిగి రావడంతో అసలు స్టోరీ మొదలవుతుంది ? ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళ్తే …


ఎందులో ఉందంటే

‘అతీత్’ (Ateet) 2020లో విడుదలైన హిందీ సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రం. ఈ సినిమా తనూజ్ భ్రమర్ దర్శకత్వంలో రూపొందింది. ఇందులో రాజీవ్ ఖండేల్వాల్ (అతీత్ రాణా), ప్రియమణి (జాన్వీ), సంజయ్ సూరి (విశ్వ కర్మ), దేష్నా దుగద్ (సనా), విపిన్ శర్మ (డాక్టర్ మసూద్), నేహా బామ్ (డాక్టర్ ఆంటీ), షకీల్ ఖాన్ (నయాబ్ కుక్రీ) నటించారు. ఈ సినిమా 1 గంట 55 నిమిషాల రన్‌టైమ్‌తో ZEE5 లో అందుబాటులో ఉంది.


స్టోరీలోకి వెళ్తే

కెప్టెన్ అతీత్ రాణా ఒక యుద్ధంలో మరణించినట్లు ప్రకటించబడతాడు. అతని సీనియర్ అయిన విశ్వ కర్మ అతీత్ భార్య జాన్వీ, కుమార్తె సనా లను సంరక్షించే బాధ్యత తీసుకుంటాడు. పదేళ్ల తర్వాత విశ్వ కర్మ జాన్వీని వివాహం చేసుకుని, సనాతో కలిసి ఊటీలో సాధారణ జీవితం గడుపుతుంటాడు. అయితే అనూహ్యంగా అతీత్ తిరిగి వస్తాడు. తన కుటుంబాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవాలని, విశ్వ కర్మ గతంలో చేసిన ఒక మోసాన్ని బయటపెట్టాలని కోరుకుంటాడు. ఇప్పుడు అతీత్ జీవించి ఉన్నాడా లేక చనిపోయిన ఆత్మగా తిరిగి వచ్చాడా అనే అనుమానం జాన్వీ, సనాలో భయాన్ని కలిగిస్తుంది.

సెకండ్ హాఫ్‌లో కథ సూపర్‌న్యాచురల్ థ్రిల్లర్‌గా మారుతుంది. అతీత్ రిటర్న్ వెనుక నిజం, విశ్వ గతంలోని రహస్యాలు బయటపడతాయి. జాన్వీ తన కూతురు సనాను కాపాడుకోవడానికి, ఇద్దరు పురుషుల మధ్య ఎమోషనల్ డైలమాలో చిక్కుకుంటుంది. తన కుటుంబాన్ని తిరిగి పొందాలని, విశ్వ గతంలోని “డార్క్ సీక్రెట్”ను బయటికి తెచ్చే ప్రయత్నం చేస్తాడు. అతీత్ జీవించి ఉన్నాడా లేక ఆత్మగా తిరిగి వచ్చాడా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. అతీత్ రిటర్న్ విశ్వను మానసికంగా కుంగదీస్తుంది.

విశ్వ హాలుసినేషన్స్‌తో బాధపడుతూ, అతీత్‌ను తన బెటాలియన్‌ను బలిపశుగా చేసిన వ్యక్తిగా ఆరోపిస్తాడు. సనా తన నిజమైన తండ్రి గురించి తెలుసుకుంటూ, భావోద్వేగంతో గందరగోళంలో పడుతుంది. క్లైమాక్స్‌లో అతీత్ నిజ స్వరూపం, విశ్వ గత తప్పిదాలు బయటపడతాయి. జాన్వీ తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి తీసుకున్న ఒక నిర్ణయంతో కథ ముగుస్తుంది. జాన్వీ తీసుకున్న నిర్ణయం ఏమిటి ? అతీత్ ఆత్మగా తిరిగి వచ్చాడా ? విశ్వ డార్క్ సీక్రెట్ ఏమిటి ? అనే ప్రశ్నలకు సమాధానాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాని మిస్ కాకుండా చుడండి.

Read Also : చావడానికెళ్లి సైకో చేతిలో అడ్డంగా బుక్… అమ్మాయిని కదలకుండా చేసి ఆ పని… సీట్ ఎడ్జ్ థ్రిల్లర్

Related News

OTT Movie : పిల్లాడికి కాకుండా పిశాచికి జన్మనిచ్చే తల్లి… కల్లోనూ వెంటాడే హర్రర్ మూవీ

OTT Movie : బేస్మెంట్లో బంధించి పాడు పని… కూతురిని వదలకుండా… షాకింగ్ రియల్ స్టోరీ

OTT Movie : అక్క బాయ్ ఫ్రెండ్ తో చెల్లి… నరాలు జివ్వుమన్పించే సీన్లు మావా… ఇయర్ ఫోన్స్ మాత్రం మర్చిపోవద్దు

OTT Movie : బాయ్ ఫ్రెండ్ తో ఒంటరిగా గడిపే అమ్మాయిలే ఈ కిల్లర్ టార్గెట్… వెన్నులో వణుకు పుట్టించే థ్రిల్లర్ మావా

OTT Movie : వరుసగా అమ్మాయిలు మిస్సింగ్… ప్రొఫెసర్ ముసుగులో సైకో వల… సీట్ ఎడ్జ్ క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : 8 ఏళ్ల తరువాత థియేటర్లలోకి… నెలలోపే ఓటీటీలోకి 170 కోట్ల హిలేరియస్ కోర్ట్ రూమ్ డ్రామా

OTT Movie : జంప్ అవ్వడానికి ట్రై చేసి అడ్డంగా బుక్… ఇష్టం లేకుండానే ఆ పని… తెలుగు మూవీనే మావా

OTT Movie : అనుకున్న దానికంటే ముందుగానే ఓటీటీలోకి ‘కాంతారా చాఫ్టర్ 1’… ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే ?

Big Stories

×