Lokesh Kanagaraju: కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలోకి దర్శకుడిగా అడుగుపెట్టి అతి తక్కువ సమయంలోనే స్టార్ డైరెక్ట్ గా సక్సెస్ అందుకున్న వారిలో లోకేష్ కనగరాజ్ (Lokesh Kangaraj)ఒకరు. ఈయన ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు తొమ్మిది సంవత్సరాలవుతుంది అయితే ఈ 9 సంవత్సరాల కాలంలో లోకేష్ చేసింది. కేవలం 6 సినిమాలే అని చెప్పాలి. ఇందులో విక్రమ్, ఖైదీ, లియో, కూలీ, మాస్టర్,నగరం వంటి సినిమాలకు దర్శకుడిగా వ్యవహరించారు అయితే ఈయన దర్శకత్వం వహించిన ఏ ఒక్క సినిమా కూడా ప్రేక్షకులను ఏమాత్రం నిరాశపరచలేదు అలాగే నిర్మాతలకు నష్టాలను కూడా తీసుకురాలేదు.
అపజయం ఎరుగని దర్శకుడిగా…
ఇలా అపజయం ఎరుగని దర్శకుడిగా లోకేష్ కోలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్నారు. ఇకపోతే ఈయన తాజాగా కూలీ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఇటీవల వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్న లోకేష్ తన సినీ కెరియర్ గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టారు. ఇకపోతే గతంలో ఒక్కో దర్శకుడు ఒకేసారి రెండు మూడు సినిమాలను చేస్తూ ప్రేక్షకుల ముందుకు వచ్చేవారు కానీ లోకేష్ మాత్రం తొమ్మిది సంవత్సరాలు అవుతున్న కేవలం ఆరు సినిమాలు మాత్రమే చేసిన నేపథ్యంలో ఈ విషయంపై స్పందించారు. నిజమే నేను 9 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో ఉంటూ 6 సినిమాలు చేశాను ఆ విషయాన్ని చాలా గర్వంగా చెప్పుకుంటానని వెల్లడించారు.
6 సినిమాలలో 22 మంది హీరోలు..
ఇలా నేను చేసింది 6 సినిమాలే అయినప్పటికీ ఈ ఆరు సినిమాల ద్వారా ఏకంగా 22 మంది హీరోలను డైరెక్ట్ చేశానని, ఈ ఆరు సినిమాల కోసం ఎంతమంది హీరోలను ఒప్పించగలగడం చాలా కష్టతరమైన పని అని వెల్లడించారు.. ఇలా 6 సినిమాలతో 22 మంది హీరోలను డైరెక్ట్ చేయడం అంటే మామూలుగా విషయం కాదు. ఆ విషయంలో తనకు చాలా గర్వంగా ఉంటుందని తెలిపారు. ఇక లోకేష్ ఒక సినిమాటిక్ యూనివర్స్ ను క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా కోలీవుడ్ స్టార్ హీరోలు అందరిని కూడా ఈయన భాగం చేస్తూ వచ్చారు. ఇలా ఆరు సినిమాలలో 22 మంది హీరోలు నటించడం అంటే మామూలు విషయం కాదనే చెప్పాలి.
హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న లోకేష్…
ఇక కూలి సినిమా కూడా మంచి ఆదరణ సొంతం చేసుకున్న నేపథ్యంలో ఈయన తన తదుపరి సినిమాలపై ఫోకస్ పెట్టారు. ప్రస్తుతం కార్తి హీరోగా రాబోతున్న ఖైదీ 2 పనులలో బిజీగా ఉన్నారు. అదే విధంగా లోకేష్ తెర వెనుక మాత్రమే కాకుండా తెరపై కూడా సందడి చేయడానికి సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. హీరోగా ఈయన ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఈయన మొదటి సినిమాకు సంబంధించిన పనులు జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమాలో నటీనటుల ఎంపిక ప్రక్రియ కూడా పూర్తి అయిందని ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుందని తెలుస్తుంది.. ఇక లోకేష్ కు జోడిగా తన మొదటి సినిమాలో రచితా రామ్ హీరోయిన్ గా నటించబోతున్నారు. ఇక ఈ సినిమాకు అరుణ్ మథేశ్వరన్ దర్శకుడిగా వ్యవహరించబోతున్నట్టు తెలుస్తుంది.
Also Read: OG Glimpse: ఎందయ్యా సుజీత్ బర్త్ డే హీరోదా…విలన్ దా ఆ గ్లింప్స్ ఏంటయ్యా?