E-Paper
Advertisement

Raju Weds Ramabai: వాళ్ళ టిక్కెట్ రేట్లు తగ్గిస్తే వేరే ప్రొడ్యూసర్ కి వచ్చిన నొప్పి ఏంటి?

Raju Weds Ramabai: వాళ్ళ టిక్కెట్ రేట్లు తగ్గిస్తే వేరే ప్రొడ్యూసర్ కి వచ్చిన నొప్పి ఏంటి?
Advertisement

Raju Weds Ramabai: చాలామంది జీవితాల్లో సినిమా అనేది ఒక భాగం. వాళ్లకు ఉన్న కష్టాల నుంచి, ఒత్తిడి నుంచి బయటపెట్టే ఏకైక ఔషధం ఏదైనా ఉంది అంటే అది సినిమా అని కొంతమంది బలంగా నమ్ముతారు. అయితే సినిమా అనేది ఈరోజు ఇంటికి వచ్చేసింది. ఒకప్పుడు సినిమా చూడటానికి థియేటర్ వరకు ప్రేక్షకుడు వెళ్లేవాడు. ఒక సినిమాకి సూపర్ హిట్ టాక్ వస్తే కానీ, ఒక సినిమాను టాప్ హీరో చేస్తే గాని ఈరోజు ఆడియన్ అనేవాడు థియేటర్ కు వెళ్లే పరిస్థితి లేదు. వీటన్నిటిని మించి సినిమాకి సంబంధించిన టిక్కెట్ రేట్లు కూడా తారాస్థాయిలో ఉండటం.

సినిమా పైరసీ చేస్తున్న రవి అనే ఒక వ్యక్తికి ఈరోజు సపోర్టు లభిస్తుంది అంటే కారణం, సినిమా వాళ్ళవి కూడా కొంత మిస్టేక్స్ ఉండడమే. టికెట్ రేట్లు విపరీతంగా పెంచడం. ఒకప్పుడు ఐదు పది రూపాయలకి కూడా సినిమా చూసిన సందర్భాలు ఉన్నాయి. ఈ రోజుల్లో ఒక ఫ్యామిలీ సినిమా చూడాలి అంటే మినిమం 2000 అవుతుంది అనేది కొంతమంది ఒప్పుకోలేని వాస్తవం. ఈ తరుణంలో ఒక అడుగు ముందుకు వేసింది రాజు వెడ్స్ రాంబాయి చిత్ర యూనిట్.

టికెట్ రేట్స్ తగ్గించారు 

Advertisement

రాజు వెడ్స్ రాంబాయి అనే సినిమాతో సాయిలు అనే కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. ఈ సినిమా మీద చాలామందికి విపరీతమైన నమ్మకం ఉంది. సినిమా ట్రైలర్ కూడా విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమాకి సంబంధించి టిక్కెట్ రేట్లు మధ్యతరగతి కుటుంబానికి కూడా అనుకూలంగా ఉన్నాయి.

ఈ సినిమా టికెట్ రేట్ సింగిల్ స్క్రీన్ కేవలం 99 రూపీస్ మాత్రమే. మల్టీప్లెక్స్ అయితే 105 రూపాయలు. అంటే ఒక సినిమాని మధ్యతరగతికి కుటుంబ ప్రేక్షకులు కూడా చూసే అవకాశం కల్పించింది చిత్ర యూనిట్. ఇది ఒక శుభ పరిణామం.

వేరే ప్రొడ్యూసర్స్ కి నొప్పి 

Advertisement

వీళ్లు టిక్కెట్ రేట్లు తగ్గించడం వలన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చాలామంది ప్రొడ్యూసర్స్ ఈ చిత్ర యూనిట్ పైన విపరీతమైన కోపాన్ని ప్రదర్శిస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు చక్కెరలు కొడుతున్నాయి. సినిమాని చాలా చీప్ గా ఇచ్చేసి ప్రేక్షకుడిని గ్రాంటెడ్ గా తీసుకొని ఉన్న మార్కెట్ ను పాడు చేస్తున్నారు అని పలు విమర్శలు కూడా వస్తున్నాయి.

అయితే అన్నిటికీ అందరూ సమాధానం చెప్పలేరు. కానీ ఈ చిత్ర యూనిట్ తీసుకున్న నిర్ణయం మాత్రం గొప్పది అని చెప్పొచ్చు. ఎందుకు అంటే ఈ సినిమా ప్రీమియర్ షోస్ కు చాలా చోట్ల హౌస్ఫుల్ బోర్డ్స్ పడింది సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే సినిమాని తక్కువ రేట్ లో ప్రేక్షకునికి అందించటం ఒక ఉద్దేశం అయితే, సినిమాలో ఎవరికీ తెలియని ఒక విషయాన్ని చెప్పడం ఇంకో ప్లస్ పాయింట్.

Also Read: Priyadarshi: సినిమాలు ఆపేసి గడ్డి పీకమంటావా? ప్రియదర్శి ఏంటి అంత మాట అనేశాడు

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×