Raju Weds Rambai Movie Review : రాజు వెడ్స్ రాంబాయ్.. తక్కువ బడ్జెట్‌తో వచ్చి ఎక్కువ హైప్ తెచ్చుకున్న మూవీ ఇది. ఈ హైప్‌కి రెండు కారణాలు. డైరెక్టర్ బట్టలిప్పి తిరుగుతా అని ఛాలెంజ్ చేయడం ఒక్కటైతే… క్లైమాక్స్ వచ్చిన హైప్ మరో కారణం. మరి ఈ మూవీ ఆ అంచనాలను అందుకుందా.. డైరెక్టర్ బట్టలిప్పి తిరగాల్సిన పరిస్థితి వస్తుందో లేదో ఈ రివ్యూలో చూద్దాం…
2010లో జరిగిన కొన్ని యదార్థ సంఘటనల నుంచి ఈ కథను రాసుకున్నాడు డైరెక్టర్. అప్పటి ఖమ్మం జిల్లాలోని ఇల్లందు దగ్గర ఓ చిన్న పల్లెటూరిలో రాజు (అఖిల్ రాజు) బ్యాండ్ కొట్టుకునే వాడు. అదే గ్రామంలో ప్రభుత్వం ఉద్యోగం చేస్తున్న వెంకన్న (చైతన్య జొన్నలగడ్డ) కూతురు రాంబాయ్ (తేజస్వీ రావు)ను ప్రేమిస్తాడు. ఇద్దరిది వేరు వేరు కులం. అందులోనూ.. ప్రభుత్వ ఉద్యోగం ఉన్నవాడిని తన అల్లుడు అనే పంథంతో ఉంటాడు వెంకన్న. అలాంటి వీరి మధ్య లవ్ సక్సెస్ అయిందా ? వెంకన్న ముర్ఖత్వం వల్ల క్లైమాక్స్‌లో ఏం జరిగింది? రాజ్ వెడ్స్ రాంబాయ్ చివరికి పెళ్లి పీటలెక్కారా.. లేదా అనేదే సినిమా కథ.
మన చుట్టు పక్కన జరిగే వాటితోనే కథలు అల్లుకోవచ్చు అని అంటారు. అలా… పుట్టిందే ఈ రాజు వెడ్స్ రాంబాయ్ మూవీ. మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో డైరెక్టర్ మాట్లాడిన తీరును బట్టి చూస్తే.. సినిమాను ఎంత ప్యాషన్‌తో చేశాడో అర్థమవుతుంది.
కానీ, ఎంత ప్యాషన్‌తో సినిమా చేసినా.. అది ఆడియన్స్ అందరికీ రీచ్ అవ్వాలి. కనెక్ట్ అవ్వాలి. మరి దాంట్లో డైరెక్టర్ పాస్ అయ్యాడా అంటే సగం మార్కులు మాత్రమే వేయొచ్చు. చెప్పాలనుకున్న కథను బాగానే చెప్పాడు. కానీ, టెక్నికల్‌గా, లాజిక్ లేస్ సీన్స్ చాలా వరకు మిస్టెక్స్ ఉన్నాయి. అలాగే మొదటి సారి దర్శకత్వం చేశాడు.. కాబట్టి ఆ లోపాలు అన్నీ స్క్రీన్‌పై కనిపిస్తున్నాయి.
లవ్ స్టోరీని గానీ, అందులో వచ్చే ఎమోషన్స్ ని గానీ, సరిగ్గా డీల్ చేయలేదని, అనవసరంగా లాగినట్టు అనిపిస్తుంది. తాను చెప్పాలనుకున్న కథను చాలా ఓపికగా వివరించినట్టు ఉన్నాడు డైరెక్టర్. కానీ, థియేటర్ సీట్‌లో కూర్చున్న ఆడియన్‌కు అంత ఓపిక ఉండకపోవచ్చు. మంచి సీన్ వచ్చే టైంలో… దాన్ని అనవసరంగా లాగితే.. అప్పటి వరకు వచ్చిన పాజిటివ్ ఓపినియన్ కూడా పోయే అవకాశం ఉంటుంది. అలాంటిదే ఈ సినిమాలో కొన్ని సందర్భాల్లో జరిగింది.
ఈ సినిమాలో ఎక్కువ హైప్ క్రియేట్ చేసిన పాత్ర వెంకన్న. చైతన్య జొన్నలగడ్డ యాక్టింగ్ బానే చేశాడు. కానీ, కొన్ని సందర్భాల్లో అది ఓవర్ యాక్టింగ్ అనే ఫీలింగ్ రాకమానదు. మటన్ దగ్గర కానీ, గణేష్ మండపం, ఆ చందాకు సంబంధించిన సీన్స్‌లో గానీ, వెంకన్న పాత్రను సరిగ్గా డీల్ చేయలేదు. అగ్రెసివ్ పాత్ర అని చూపించే క్రమంలో.. అది జరిగి ఉంటుందని చెప్పొచ్చు.
అలాగే.. సినిమాలో క్లైమాక్స్ పై చాలా హైప్ ఇచ్చారు. నిజానికి చాలా డిఫరెంట్ క్లైమాక్స్. ఇలాంటి క్లైమాక్స్ ఇప్పటి వరకు ఎక్కడా రాలేదు. ఆ క్రెడిట్ డైరెక్టర్ కి ఇవ్వాల్సిందే. ఆ టైంలో వెంకన్న పాత్ర చేసిన చైతన్య జొన్నలగడ్డ కూడా బానే ఫర్ఫార్మ్ చేశాడు. కానీ, ఎందుకో… తెలియని అసంతృప్తి అయితే ఆడియన్ ఫేస్ లో కనిపిస్తుంది. సరిగ్గా పూర్తి చేయలేదా ? అనే ఫీలింగ్ అనేది మరొకటి. ఇక ఒక మాటలో చెప్పాలంటే.. క్లైమాక్స్ ట్విస్ట్ తప్పా.. సినిమాలో కూడా పెద్దగా కొత్తేమీ లేదు.
అయితే… గ్రామీణ నెటివిటీని, అక్కడ ఉండే కల్చర్‌ని, డైలాగ్స్‌ని సరిగ్గా చూపించడంలో డైరెక్టర్ పాస్ అయ్యాడు. కానీ, పైన చెప్పిన వాటిని కూడా కరెక్ట్ చేసుకుంటే… కల్ట్ క్లాసిక్ మూవీల్లో రాజ్ వెడ్స్ రాంబాయ్ మొదటి స్థానంలో ఉండేదని చెప్పొచ్చు. ఇప్పుడు కూడా తక్కువేం కాదు. రాజ్ వెడ్స్ రాంబాయ్ ఓ సారి చూడాల్సిన సినిమానే.
ఫర్ఫామెన్స్ గురించి వస్తే.. రాజు పాత్రలో చేసిన అఖిల్ రాజు, రాంబాయ్ పాత్రలో చేసిన తేజస్వీ రావు అద్భుతంగా చేశారు. అఖిల్ రాజు పక్కన చేసిన ఫ్రెండ్స్ బ్యాచ్ కూడా బానే చేశారు. వాళ్ల మార్క్ కనిపించింది. చైతన్య జొన్నలగడ్డ విలనిజం కొన్ని చోట్ల బానే పండించాడు. తర్వాత సినిమాల్లో విలన్ గా ఆయన చేయొచ్చు. మ్యూజిక్ ఇచ్చిన సురేష్ బొబ్బలి గురించి ప్రత్యేకంగా మాట్లాడాలి. సినిమాను నెక్ట్స్ లెవెల్ కి తీసుకెళ్లాడు ఆయన మ్యూజిక్‌తో. కెమెరా పనితనం కూడా పర్లేదు. ఒకే గ్రామంలో కాబట్టి… ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బానే ఉన్నాయి. ఎడిటింగ్‌కు మరి కాస్త పని చెప్పాల్సింది.
కథ & కాన్సెప్ట్
హీరో, హీరోయిన్ ఫర్ఫామెన్స్
ఫస్టాప్‌లో మ్యూజిక్
కొంత వరకు క్లైమాక్స్ (క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్)
స్లో కథనం
ల్యాగ్ సీన్స్
హీరో నుంచి వచ్చే WWE డైలాగ్
సెకండాఫ్
క్లైమాక్స్ ట్విస్ట్ సరిగ్గా డీల్ చేయకపోవడం
ఎడిటింగ్
మొత్తం.. రాజ్ వెడ్స్ రాంబాయ్ పెళ్లి.. అంత ఘనమేమీ కాదు