E-Paper
Advertisement

Film industry: ఆయన వల్లే 16 సినిమాలు కోల్పోయా.. నరకాన్ని అనుభవించలేకపోయాను.. వడివేలుపై నటి కామెంట్!

Film industry: ఆయన వల్లే 16 సినిమాలు కోల్పోయా.. నరకాన్ని అనుభవించలేకపోయాను.. వడివేలుపై నటి కామెంట్!
Advertisement

Film industry:సినిమా ఇండస్ట్రీలో నటీనటుల మధ్య మంచి అవినాభావ సంబంధాలు ఉంటాయన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఒక్కొక్కసారి ఆ బంధం మితిమీరితే ఎదుటి వాళ్ళు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అంతేకాదు ఎదుటివాళ్ళ వల్ల అవకాశాలు కూడా కోల్పోయామని చెప్పిన వారు కూడా లేకపోలేదు.. ఈ క్రమంలోనే తాజాగా కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక మంచి పేరు తెచ్చుకొని.. అటు నటిగా, నిర్మాతగా, వ్యాపారవేత్తగా కూడా పేరు సొంతం చేసుకున్న సోనా హైడెన్ (Sona heiden) కూడా ఈ జాబితాలోకి చేరారు. ఆయన వల్ల ఏకంగా 16 సినిమాలు కోల్పోయానని.. ముఖ్యంగా ఆ నరకం అనుభవించలేక మళ్లీ ఆయనతో సినిమా చేయలేదు అంటూ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

వడివేలుపై సోనా హైడెన్ ఊహించని కామెంట్స్..

ప్రముఖ నటుడు వడివేలు (Vadivelu)గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. 300కు పైగా చిత్రాలలో నటించిన ఈయన కోలీవుడ్ సినీ పరిశ్రమలు తనకంటూ ఒక గుర్తింపును సొంతం చేసుకున్నారు.. అలాంటి ఈయనపై తాజాగా ఈమె చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. ఈ మేరకు సోనా హైడెన్ మాట్లాడుతూ.. “కుశేలన్ చిత్రం తర్వాత వడివేలుతో కలిసి నటించమని నాకు 16 పైగా సినిమా అవకాశాలు వచ్చాయి. అయితే వాటన్నింటిని నేను మర్యాదపూర్వకంగానే తిరస్కరించాను . ఎందుకంటే నా ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడం నాకు చాలా ముఖ్యం. నిజాయితీగా చెప్పాలి అంటే ఆయనను నేను తట్టుకోలేనేమో అని అనిపించింది. ఒక రకంగా నరకం చూసాను. అందుకే ఈ విషయం గురించి ఇకపై నేను ఎక్కువగా మాట్లాడకపోవడమే మంచిదని భావిస్తున్నాను” అంటూ సోనా కామెంట్లు చేసింది. అయితే వడివేలు పై ఈమె ఇంతటి కామెంట్లు చేయడానికి గల కారణం ఏమిటి? అన్న విషయాన్ని మాత్రం ఆమె బయట పెట్టలేదు. ఇక ప్రస్తుతం ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Advertisement

ALSO READ:Maheshbabu: స్పీడ్ పెంచిన మహేష్ బాబు.. ఆ నగరాలపై ప్రత్యేక దృష్టి!

సోనా హైడెన్ కెరియర్..

సోనా హైడెన్ 1979 జూన్ 1న తమిళనాడు చెన్నైలో జన్మించింది. ఈమె తండ్రి పోర్చుగీస్, ఫ్రెంచ్ సంతతికి చెందినవారు కాగా, తల్లి శ్రీలంకకు చెందినవారు. చెన్నైలోని రింగ్ రోడ్డు మోడల్ స్టడీ స్కూల్లో చదువు పూర్తి చేసిన ఈమె.. అన్నామలై యూనివర్సిటీ నుంచి బిజినెస్ లో డిగ్రీ పొందింది. మధురై కామరాజు యూనివర్సిటీ నుంచి కాస్టింగ్ డిజైన్ లో అడ్వాన్స్ సర్టిఫికెట్ పొందిన ఈమెకు ఇద్దరు అక్కలు కూడా ఉన్నారు. తమిళ చిత్రం ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన సోనా.. ఎక్కువగా శృంగార పాత్రలు పోషిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈమె తెలుగులో ఆయుధం అనే సినిమాలో నటించింది. అలాగే విలన్, వీడే , ఆంధ్రావాలా, కథానాయకుడు వంటి చిత్రాలలో నటించిన ఈమె.. మళ్లీ మరో తెలుగు సినిమాలో కనిపించలేదు. తమిళ్, మలయాళం లో నటిస్తూ బిజీగా మారిపోయింది.

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×