BRS workshop: తెలంగాణ స్వేచ్ఛ బ్యూరో: తొలిసారి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు వర్క్ షాపు నిర్వహిస్తుంది. దీనికి పార్టీ అధినేత కేసీఆర్ హాజరు కావడం లేదు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన నిర్వహిస్తున్నారు. ఈ వర్క్ షాపులో బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, శాఖలవారీగా కేటాయింపులు, వర్ధమాన రాజకీయాలపై నిష్నతులతో శిక్షణ ఇప్పించబోతున్నారు. దీనికి గోల్కొండ రిసార్టు వేదిక కాబోతుంది. గతానికి భిన్నంగా ఒక్కరోజూ శిక్షణ ఇస్తుండటం పార్టీతో పాటు రాజకీయ వర్గాల్లోనూ విస్తృత చర్చజరుగుతుంది.
బీఆర్ఎస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఎప్పుడు లేని విధంగా శిక్షణ తరగతులకు శ్రీకారం చుట్టింది. ఈ నెల 16 నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అవుతుండటంతో పార్టీ ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలకు శిక్షణా తరగతులు నిర్వహిస్తుంది. అందుకు సబ్జెక్టుల వారీగా నిపుణులను సైతం ఎంపిక చేసినట్లు చేశారు. జాతీయ,అంతర్జాతీయ సమకాలిన రాజకీయాలు,రాష్ట్ర రాజకీయాలు రాష్ట్ర ప్రభుత్వం విధానాలు,ఆర్ధిక అంశాలపై శిక్షణ ఇప్పిస్తున్నారు. బడ్జెట్ అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన అంశాలు, వ్యూహాలపై వర్క్ షాప్ లో దిశానిర్దేశం చేయబోతున్నారు. సమాచార హక్కు చట్టంను ఎలా వినియోగించుకోవాలనే దానిపై ప్రత్యేకంగాక్లాసులు చెప్పనున్నారు. ప్రభుత్వం నుంచి శాఖల వారీగా సమాచారం ఇవ్వకుంటే ఎలా ముందుకు పోవాలి.. గత ఎన్నికల్లో కాంగ్రెస్ హామీలు,ఆరు గ్యారెంటీల వైఫల్యాలపై ఎలా ప్రజల్లోకి వెళ్లాలి.. పంచాయతీ,మున్సిపల్ ఎన్నికల ఫలితాలు తదితర అంశాలపై సామాజిక,ఆర్ధిక,రాజకీయ విశ్లేషకులతో శిక్షణ ఇప్పిస్తున్నట్లు సమాచారం.
Also Read: husband’s income: భర్త ఆదాయం పెరగాలంటే – భార్య ఈ నియమాలు పాటించాలట
రాష్ట్ర ప్రభుత్వాన్ని అసెంబ్లీ వేదికగా బడ్జెట్ సమావేశాల్లో నిలదీయాలని గులాబీ పార్టీ భావిస్తోంది.ఏయే రంగాలకు ఎంత బడ్జెట్ పెడితే గతంలో పెట్టిన బడ్జెట్ తో పోల్చి ఎలా మాట్లాడాలి.బీసీ,ఎస్సీ,ఎస్టీ,మైనార్టీలకు విద్యకు,వైద్యానికి,వ్యవసాయం, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఇలా తదితర రంగాలకు కేటాయింపులపైనా గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేటాయించిన నిధులను వివరించి మాట్లాడి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలనే
దానిపై ఈ వర్క్ షాపు ఏర్పాటు చేశారు.ఇక జీరో అవర్,ప్రశ్నోత్తరాలు,అసెంబ్లీ రూల్స్ వంటి అంశాలపై అవగాహన కల్పించనున్నట్లు సమాచారం.
2024 డిసెంబర్ 11, 12 తేదీల్లో ప్రజాభవన్ లో కాంగ్రెస్ ప్రభుత్వం రెండురోజుల పాటు శిక్షణ తరగతులు నిర్వహించింది. ఈ తరగతులను బీఆర్ఎస్ పార్టీ బహిష్కరించింది. సభలో అనుసరించాల్సిన అంశాలపై, సబ్జెక్టుల వారీగా వివరాలు, సేకరించాల్సిన విధానం, తదితర అంశాలను వివరించారు. కొత్తగా శాసనసభ్యులుగా నియామకం అయిన వారికి ఈ శిక్షణ దోహదపడుతుందని ప్రభుత్వం చెప్పినా గులాబీ పార్టీ మాత్రం దూరంగా ఉంది. అయితే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ సొంత ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు వర్క్ షాపు నిర్వహించడంపై విమర్శలు సైతం వ్యక్తమవుతున్నాయి. నాడు ఒకళా.. ఇప్పుడు ఒకళానా అని ప్రచారం ఊపందుకుంది.
రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్, అసెంబ్లీ మాజీ కార్యదర్శి సదారాం, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డితో పాటు ఇతర విశ్లేషకులు రాజకీయ అంశాలు,ఆర్ధిక అంశాలపై క్లాసులు చెప్పనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. రాజకీయ వ్యూహాలపైనా ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలకు శిక్షణ ఇవ్వనున్నారు. పార్టీ కమిటీల ఏర్పాటు తర్వాతజిల్లా,నియోజకవర్గ,మండల స్థాయిలో గులాబీ క్యాడర్ కు శిక్షణ తరగతులు ఏర్పాటు చేసే ఆలోచనలో అధిష్టానం ఉన్నట్లు సమాచారం.
పార్టీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమానికి పార్టీ అధినేత కేసీఆర్ హాజరుకావడం లేదు. ఈప్రతిష్టాత్మక శిక్షణకు కేసీఆర్ హాజరైతే వారికి దిశానిర్దేశం చేస్తే బాగుండేదని, కేసీఆర్ కు రాజకీయ అనుభవం ఉండటంతో చాలా అంశాలు బోధించేవారని పార్టీ నేతలే పేర్కొంటున్నారు. కానీ ఆయన హాజరుకాకపోవడం మాత్రం కొంత నైరాశ్యాన్ని నింపింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన ఈ క్లాసులు మంగళవారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహించబోతున్నట్లు సమాచారం. భవిష్యత్ లీడర్ కేటీఆర్ కావడంతోనే ఆయనకే ఇప్పటికే పూర్తి బాధ్యతలు అప్పగించిన కేసీఆర్.. శిక్షణ బాధ్యతలను సైతం ఆయనకే ఇచ్చారు. మాజీ మంత్రి హరీష్ రావుకు సైతం సభ్యుల కోఆర్డినేషన్ బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం.
Also Read: CM Revanth Reddy: తల తాకట్టు పెట్టైనా నిధులు తెస్తా.. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు