E-Paper
Advertisement

Jio vs Airtel vs VI vs BSNL: 30 డేస్ వ్యాలిడిటీతో.. చీప్ అండ్ బెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్!

Jio vs Airtel vs VI vs BSNL: 30 డేస్ వ్యాలిడిటీతో.. చీప్ అండ్ బెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్!
Advertisement

Cheapest 30 Days Plans: ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్ వినియోగిస్తున్నారు. అందరూ సోషల్ మీడియా వాడుతున్నారు. ఈ నేపథ్యంలో టెలికాం కంపెనీలు తక్కువ ధరలో నెల రోజుల వ్యాలిడిటీ, డేటా అందించే ప్లాన్స్ అందిస్తున్నాయి. తక్కువ ధరలో ఆయా కంపెనీలు అందించే వన్ మంత్ వ్యాలిడిటీ ప్లాన్స్ అందిస్తున్నాయి. ఈ ప్రీపెయిడ్ ప్లాన్స్ ఇంటర్నెట్ యాక్సెస్, అపరిమిత వాయిస్ కాలింగ్‌ను అందిస్తాయి. వీటిలో ఏది బెస్ట్ అనేది ఇప్పుడు తెలసుకుందాం..

⦿ జియో రూ. 319 ప్లాన్

జియో రూ. 319 ప్లాన్ రోజుకు 1.5GB డేటాను అందిస్తుంది. నెల రోజుల పాటు వ్యాలిడిటీ అందిస్తుంది. ఈ ప్లాన్ అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100  ఉచితం మెసేజెస్ అందిస్తుంది. ఇతర ప్రయోజనాలలో జియోటీవీ, జియో ఏఐక్లౌడ్లకు సబ్‌ స్క్రిప్షన్ ఉంటుంది. హై స్పీడ్ డేటా పరిమితి అయిపోయిన తర్వాత, ఇంటర్నెట్ వేగం 64Kbpsకి పడిపోతుంది.

⦿ ఎయిర్‌ టెల్ రూ. 319 ప్లాన్

Advertisement

ఎయిర్‌ టెల్ రూ. 319 ప్లాన్ రోజుకు 1.5GB డేటాను అందిస్తుంది. ఈ ప్లాన్ 30 రోజుల పాటు చెల్లుబాటు అవుతుంది. ఇది అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 SMSలను అందిస్తుంది. ఇతర ప్రయోజనాలలో గూగుల్ వన్ లో 30GB క్లౌడ్ స్టోరేజ్, ఆపిల్ మ్యూజిక్ కి సబ్‌ స్క్రిప్షన్ ఉన్నాయి.

⦿ వోడాఫోన్ ఐడియా రూ. 379 ప్లాన్

వోడాఫోన్ ఐడియా రూ. 379 ప్లాన్ రోజుకు 2GB డేటాను అందిస్తుంది. ఈ ప్లాన్ ఒక నెల పాటు చెల్లుబాటు అవుతుంది.  అపరిమిత వాయిస్ కాలింగ్,  రోజుకు 100 SMSలను కూడా అందిస్తుంది. ఈ ప్లాన్ అర్ధరాత్రి 12 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు హై స్పీడ్ డేటాను అందిస్తుంది. ఇది వారాంతపు డేటా రోల్‌ ఓవర్‌ను కూడా అందిస్తుంది. వారంలో మిగిలిపోయిన డేటాను మళ్లీ అందిస్తుంది. ఈ ప్లాన్ నెలకు 2GB వరకు డేటా బ్యాకప్‌ ను అందిస్తుంది. హై స్పీడ్ డేటా అయిపోయిన తర్వాత, ఇంటర్నెట్ వేగం 64kbpsకి తగ్గించబడుతుంది. 5G మోబైల్ వినియోగదారులు అపరిమిత 5G డేటాను పొందుతారు.

Advertisement

Read Also: వాట్సాప్ మెసేజ్‌తో గ్యాస్ సిలిండర్‌ను ఎలా బుక్ చేసుకోవాలో తెలుసా? చాలా సింపుల్, ఇలా చెయ్యండి!

⦿ BSNL రూ. 141 ప్లాన్

BSNL రూ. 141 ప్లాన్ రోజుకు 1.5GB డేటాను అందిస్తుంది. చెల్లుబాటు వ్యవధి 30 రోజులు. ఈ ప్లాన్ అపరిమిత వాయిస్ కాలింగ్, మొత్తం 200 ఎస్సెమ్మెస్ ఉచితంగా అందిస్తుంది.

మొత్తంగా ప్రస్తుతం అందుబాటులో ఉన్న తక్కువ రీఛార్జ్ ప్లాన్స్ లో BSNL రూ. 141 ప్లాన్ బెస్ట్ గా ఉంది. ఓ మోస్తారు నెట్ చూసే వారికి ఈ ప్లాన్ చాలా బాగుంటుంది. ఇతర రీఛార్జ్ లతో పోల్చితే తక్కువ ధరకే లభిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం మీ అవసరాలకు అనుగుణంగా ఈ ప్లాన్స్ ను రీఛార్జ్ చేసుకోండి.

Read Also: ఫోన్ బ్యాటరీని 100 శాతం వరకు ఛార్జ్ చేయాలా? ఎక్స్‌ పర్ట్స్ చెప్పేది వింటే మీ మొబైల్‌కు ఫుల్ లైఫ్!

Related News

90% మంది చేసే అతిపెద్ద పొరపాటు.. కొత్త స్మార్ట్‌ఫోన్లలో మార్చాల్సిన ఆ 7 సెట్టింగ్స్ ఇవే!

ఇంట్లో పాత స్మార్ట్‌ఫోన్ ఉందా? దాన్ని క్యాష్‌గా మార్చుకోండిలా!

వాట్సప్‌లో Bill Payments ఫీచర్.. కరెంట్, ఫాస్టాగ్, క్రెడిట్ కార్డ్ బిల్స్ ఎలా కట్టాలో తెలుసా?

బ్యాటరీ తీయలేం, ఇయర్‌ఫోన్ పెట్టలేం..మోడర్న్ ఫోన్ల రూపు రేఖలు ఎందుకు మారాయ్ !

రూ.200లకే యూట్యూబ్ ప్రీమియం, ప్రైమ్ వీడియో.. జియో ఊహించని ధమాకా ఆఫర్!

సిగ్నల్ ఉన్నా.. కాల్స్ కట్ అవుతున్నాయా? అసలు కారణాలు ఇవే!

డ్యూయల్ డ్రైవర్స్,ఆర్జీబీ లైట్స్..బడ్జెట్‌లో బెస్ట్ పార్టీ టవర్ స్పీకర్ !

పళ్ల సందుల్లో ఏముందో ఫోన్‌లో లైవ్ చూడొచ్చు.. డైసన్ కొత్త ఏఐ టూత్ బ్రష్ ధరెంతో తెలుసా?

Big Stories

Advertisement
×