E-Paper
Advertisement

Spider Man Brand New Day: స్పైడర్ మ్యాన్ ‘బ్రాండ్ న్యూ డే’ ట్రైలర్.. ఎలా ఉందంటే?

Spider Man Brand New Day: స్పైడర్ మ్యాన్ ‘బ్రాండ్ న్యూ డే’ ట్రైలర్.. ఎలా ఉందంటే?

Spider Man Brand New Day: ప్రపంచవ్యాప్తంగా ‘స్పైడర్ మ్యాన్’కి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సిరీస్‌లో ఇప్పుడు సరికొత్తగా ‘స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ రాబోతోంది. ఈ చిత్ర ట్రైలర్‌ని తాజాగా న్యూయార్క్ ఐకానిక్ ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ పై నుంచి టామ్ హాలండ్ ఆవిష్కరించారు. ‘స్పైడర్-మ్యాన్: నో వే హోమ్’ సాధించిన రికార్డ్-బ్రేకింగ్ గ్లోబల్ సక్సెస్ తర్వాత.. పీటర్ పార్కర్, స్పైడర్ మ్యాన్‌ల జీవితాల్లో ‘స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ (Spider Man Brand New Day) ఒక సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. ‘నో వే హోమ్’ సంఘటనలు జరిగి నాలుగు సంవత్సరాలు గడిచాయి. పీటర్ ఇప్పుడు తనను ప్రేమించేవారి జీవితాలు, జ్ఞాపకాల నుండి తన అస్తిత్వాన్ని పూర్తిగా చెరిపేసుకుని ఒంటరిగా జీవిస్తున్నాడు. తన పేరును ఏమాత్రం గుర్తుపట్టలేని న్యూయార్క్ నగరంలో నేరాలతో పోరాడుతూ, సిటీని రక్షించడానికి ఒక ఫుల్-టైమ్ స్పైడర్ మ్యాన్‌గా పూర్తిగా అంకితమయ్యాడనేది ఈ ట్రైలర్‌ (Spider Man Brand New Day Trailer)లో చూపించారు.

Also Read- Sreeleela: మహేష్ వివాదం… క్లారిటీ ఇచ్చిన శ్రీలీల..రూమర్లకు చెక్ పెట్టిందా?

హై-వోల్టేజ్ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా..

కాకపోతే.. అతనిపై బాధ్యతలు, ఒత్తిడి పెరిగేకొద్దీ.. ఊహించని శారీరక మార్పులు అతని మనుగడకే ముప్పుగా పరిణమిస్తే.. అదే సమయంలో నగరంలో జరుగుతున్న వింతైన నేరాల పరంపర అతనెన్నడూ ఎదుర్కోనంతటి అత్యంత శక్తివంతమైన విలన్ ముప్పుకు దారితీస్తే.. అప్పుడు స్పైడర్ మ్యాన్ ఏం చేశాడు? అనేదే ఈ చిత్ర కథాంశమని ఈ ట్రైలర్ తెలియజేస్తుంది. పీటర్ పార్కర్ తన గత జీవితం, స్పైడర్ మ్యాన్ బాధ్యతల మధ్య నలిగిపోతున్నట్లు ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యేలా ఇందులో చూపించారు. ‘అందరూ నన్ను మర్చిపోయేలా చేయడమే దీనికి ఏకైక మార్గం’ అని పీటర్ చెప్పే మాటలు సినిమాలో ఉండబోయే ఎమోషనల్ డెప్త్‌ను తెలియజేస్తున్నాయి. నగరంలోని భవనాల మధ్య స్పైడర్ మ్యాన్ చేసే విన్యాసాలు, ఛేజింగ్ సీన్స్ హై-వోల్టేజ్ యాక్షన్‌ని తలపిస్తున్నాయి. అలాగే, పీటర్ పార్కర్‌కు సవాలు విసిరే కొత్త విలన్లు, వారి పవర్స్ ఈ సినిమాలో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయనే విషయాన్ని ఈ ట్రైలర్ తెలియజేస్తుంది. మొత్తంగా అయితే ఈ ట్రైలర్.. ఎప్పుడెప్పుడు సినిమాను చూడాలా అనేట్లుగా ఉందంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు.

Also Read- Harish Shankar: ‘ఉస్తాద్’లాంటి సినిమా ఈ మధ్య కాలంలో రాలేదు.. ఎందుకు అంటున్నానంటే?

విడుదల ఎప్పుడంటే?

డెస్టిన్ డానియల్ క్రెటన్ (Destin Daniel Cretton) దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో స్పైడర్-మ్యాన్‌గా టామ్ హాలండ్ (Tom Holland) తిరిగి నటిస్తుండగా.. జెండయా, జాకబ్ బటలాన్, సాడీ సింక్, జోన్ బెర్న్తాల్, మార్క్ రుఫలో, మైఖేల్ మాండో, ట్రామెల్ టిల్మాన్ వంటి వారు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. సోనీ పిక్చర్స్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇండియా నిర్మిస్తున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్, జూలై 31న ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో అన్ని ప్రీమియం ఫార్మాట్లలో థియేటర్లలో విడుదల కానుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. మరి ఈ సారి ఈ విజువల్ వండర్‌ ఎలాంటి సక్సెస్‌ను రాబట్టుకుంటుందో తెలియాలంటే మాత్రం జూలై ఎండింగ్ వరకు వెయిట్ చేయాల్సిందే.

Also Read- Stars business: టాలీవుడ్ స్టార్స్.. టేస్టీ బిజినెస్.. హీరోల ఫేమస్ రెస్టారెంట్లు ఇవే

Related News

పెద్ది’ మూవీ రివ్యూ: రామ్ చరణ్ ఊరమాస్ జాతర.. బుచ్చిబాబు హిట్ కొట్టాడా?

పెద్ది ఓటీటీ లాక్….అప్పుడే డిజిటల్ స్ట్రీమింగ్ పై క్లారిటీ వచ్చేసిందిగా!

ప్రభాస్ ‘స్పిరిట్’ లొకేషన్ సెల్ఫీ లీక్.. లుక్ చూస్తే పూనకాలే!

బన్నీ-లోకేష్ కనగారాజ్ సినిమా క్యాన్సిల్ అయిందా? …. అసలు నిజం తెలిస్తే షాకవ్వాల్సిందే!

చరణ్ ‘పెద్ది’ బాక్సాఫీస్ బ్యాటింగ్ స్టార్ట్.. సమంత, వరుణ్ తేజ్ రివ్యూస్ వైరల్.. ‘మెగా 158’ టీమ్ స్పెషల్ విష్

పెద్ది’ రిలీజ్ వేళ రచ్చ.. రామ్ చరణ్ విగ్రహంపై దారుణంగా ట్రోల్స్, క్షమాపణలు చెప్పిన ఫ్యాన్స్!

ఇది కదా క్యారెక్టర్ డెడికేషన్ అంటే! ‘పెద్ది’ గెటప్‌లో రోడ్లపై తిరిగిన జగ్గూభాయ్..

షూటింగ్ సెట్‌లో భారీ పేలుడు.. ఎస్‌జే సూర్య డ్రీమ్ ప్రాజెక్ట్‌లో ఘోర విషాదం!

Big Stories

×