E-Paper
Advertisement

Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ చూడటానికి ప్రేక్షకులు థియేటర్లకి వస్తారు.. ఎందుకంటే?- నిర్మాతలు

Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ చూడటానికి ప్రేక్షకులు థియేటర్లకి వస్తారు.. ఎందుకంటే?- నిర్మాతలు
Advertisement

Vishnu Vinyasam: ఈ మధ్యకాలంలో సినిమాలను చూసేందుకు ప్రేక్షకులకు థియేటర్లకు రావడం లేదనేలా టాక్ నడుస్తున్న విషయం తెలిసిందే. సంక్రాంతి పండుగ సినిమాల తర్వాత విడుదలైన సినిమాలేవీ సందడి చేయకపోవడానికి కారణం కూడా ఇదేనని అంతా అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మా సినిమా ‘విష్ణు విన్యాసం’ చూడటానికి తప్పకుండా ప్రేక్షకులు థియేటర్లకు వస్తారని అంటున్నారు చిత్ర నిర్మాతలు సుబ్రహ్మణ్యం నాయుడు జి (Subramanyam Naidu G), సుమంత్ నాయుడు జి (Sumanth Naidu G). కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ శ్రీ విష్ణు (Sree Vishnu) నటించిన హిలేరియస్ జాయ్‌రైడ్‌ ‘విష్ణు విన్యాసం’ (Vishnu Vinyasam). యదునాథ్ మారుతీ రావు దర్శకత్వంలో, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుమంత్ నాయుడు జి నిర్మించిన ఈ చిత్రంలో నయన్ సారిక (Nayan Sarika) హీరోయిన్‌గా నటించింది. ఫిబ్రవరి 27న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న సందర్భంగా మీడియాకు నిర్మాతలు చిత్ర విశేషాలను తెలిపారు.

Also Read- Sree Vishnu: చిరంజీవికి ఫ్యాన్ కానీ వారెవరు? అంటూనే జర్నలిస్ట్‌కి శ్రీ విష్ణు ఝలక్!

ముందుగా కామెడీ ఎంటర్‌టైనర్‌

Advertisement

‘‘కామెడీ కథలెప్పుడూ కూడా విన్నప్పటి కంటే స్క్రీన్ మీదకి వచ్చిన తర్వాతనే కథలో ఉన్న వినోదం ఆడియన్స్‌కి కనెక్ట్ అవుతుంది. మా వరకు ఈ కథ విన్నప్పుడు ఎంత ఎంజాయ్ చేశామో.. చూసినప్పుడు కూడా అంతే అంతకుమించి ఆస్వాదించాము. సినిమా చాలా బాగా వచ్చింది. శ్రీ విష్ణు చాలా డైలాగ్స్‌ని స్పాట్‌లో ఇంప్రవైజ్ చేస్తుంటారు. అవన్నీ కూడా ఇందులో ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తారు. ఫైనల్ కాపీ చూసిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. మేము అనుకున్నది స్క్రీన్ మీద అద్భుతంగా కన్వే అయింది. శ్రీ విష్ణు ఈ సినిమాకు చాలా సపోర్ట్ చేశారు. కొన్ని అనివార్య కారణాల వల్ల రెండు సినిమాలు ఒకేసారి రావలసిన పరిస్థితి వచ్చింది. అయితే వన్ వీక్ గ్యాప్‌లో ముందుగా కామెడీ ఎంటర్‌టైనర్‌ను తీసుకొచ్చి, ఆ తర్వాత థ్రిల్లర్ జానర్ సినిమా తీసుకురావాలని సన్నాహాలు చేశారు. ఈ విషయంలో ఆయన సపోర్ట్ మర్చిపోలేము. రెండు డిఫరెంట్ జానర్ సినిమాలు కావడంతో ఆడియన్స్ ఖచ్చితంగా థియేటర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.

Also Read- Anil Ravipudi: ఆ సినిమా టీజర్‌కి అనిల్ రావిపూడి ఫిదా!

ఒక చిరునవ్వుతో థియేటర్స్ నుంచి వస్తారు

Advertisement

ఒక మంచి సినిమా ఇస్తే ఆడియన్స్ కచ్చితంగా థియేటర్స్‌కి వస్తారని మేము నమ్ముతున్నాం. సంక్రాంతి తర్వాత సినిమాలు కూడా తక్కువగా రావడం జరిగింది. మా ‘విష్ణు విన్యాసం’ సినిమాకి ఖచ్చితంగా ఆడియన్స్ థియేటర్స్‌కు వస్తారని నమ్మకం ఉంది. ఎందుకంటే ఇందులో ఉన్న కంటెంట్ అలాంటిది. సినిమా చూసిన ఆడియన్స్ ఒక చిరునవ్వుతో థియేటర్స్ నుంచి బయటికి వస్తారని హామీ ఇవ్వగలం. ఈ సినిమా శ్రీ విష్ణు కెరియర్‌లో టాప్ ఫైవ్ సినిమాలో ఒకటిగా నిలుస్తుంది. ఈ సినిమాతో ఆయన సక్సెస్ ట్రాక్ కొనసాగుతుంది. శ్రీ విష్ణుతో భవిష్యత్తులో కూడా సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. ఇది హీరో క్యారెక్టర్ మీద నడిచే కథ. దానితో పాటు మరో ఇంట్రెస్టింగ్ ట్రాక్ కూడా ఉంటుంది. మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. హీరో క్యారెక్టర్‌కి న్యూమరాలజీ అంటే నమ్మకం. ఆ క్యారెక్టర్ ఆద్యంతం అలరించేలా ఉంటుంది. అలాగే హీరోయిన్ ట్రాక్, రెండు ఫ్యామిలీస్ కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. కామెడీ పక్కాగా ఎంజాయ్ చేస్తారు. ఫ్యామిలీతో కలిసి ఈ సినిమాని ఎంజాయ్ చేయొచ్చు. ఫస్ట్ హాఫ్ యూత్ కనెక్ట్ అవుతుంది. సెకండ్ హాఫ్ యూత్, ఫ్యామిలీని ఇద్దరినీ అలరిస్తుంది’’ అని నిర్మాతలు చెప్పుకొచ్చారు.

Also Read- Udaya Bhanu: ఎప్పటి నుంచో మిగిలిపోయిన కోరిక తీరింది.. సమాజానికి ఇది అవసరం!

Related News

Poojitha Ponnada : గార్జీయస్ లుక్ లో మెరిసిపోతున్న పూజిత.. కుర్రాళ్ళు ఏమైపోతారమ్మా..!

HBD Pawan Kalyan : బర్త్ డే స్పెషల్.. ఆ ఒక్కటే పవర్ స్టార్ ను చేసిందా..?

కృష్ణుడిగా రామ్ చరణ్.. సూపర్ హిట్ సినిమా రీమేక్ చేయనున్నారా?

టాక్సిక్ సినిమాకు రేటింగ్ మహేష్ బాబు కొడుకు గౌతమ్ రేటింగ్.. ఇంత రారుణమా?

మై లిటిల్ ప్యారడైజ్..కొడుకుతో క్యూట్ ఫోటోలను షేర్ చేసిన నాని..

యాంకర్ గా స్రవంతి ఉంటే సినిమా హిట్టే.. డైరెక్టర్ ప్రశంశలు..సుమ క్రేజ్ తగ్గిందా?

లెనిన్ హిట్.. మెగా హీరోతో ఛాన్స్ కొట్టేసిన భాగ్య శ్రీ?

మధ్యం మానేశాను.. హృదయ విదారకమైన బాధ అంటున్న కొండన్న!

Big Stories

Advertisement
×