E-Paper
Advertisement

Udaya Bhanu: ఎప్పటి నుంచో మిగిలిపోయిన కోరిక తీరింది.. సమాజానికి ఇది అవసరం!

Udaya Bhanu: ఎప్పటి నుంచో మిగిలిపోయిన కోరిక తీరింది.. సమాజానికి ఇది అవసరం!
Advertisement

Udaya Bhanu: రాజీవ్ కనకాల (Rajeev Kanakala), ఉదయభాను (Udaya Bhanu), వసంతిక, శ్రీరామ్ వెంకట్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన వెబ్ సిరీస్ ‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు కనబడుటలేదు’ (Daughter of Prasad Rao Kanabadutaledhu). ‘రెక్కీ’, ‘విరాటపాలెం’ తర్వాత సౌత్ ఇండియా స్క్రీన్స్ బ్యానర్ మీద కె.వి. శ్రీరామ్ నిర్మించిన ఈ సిరీస్‌కి కృష్ణ పోలూరు దర్శకత్వం వహించారు. ఈ వెబ్ సిరీస్‌ ఫిబ్రవరి 27 నుంచి జీ5 (Zee5)లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ క్రమంలో ఈ సిరీస్‌లోని రెండు ఎపిసోడ్స్‌ని మీడియాకు ప్రత్యేకంగా ప్రదర్శించారు. అనంతరం నిర్వహించిన గ్రాండ్ ప్రివ్యూ ఈవెంట్‌‌కు చిత్రయూనిట్ మొత్తం హాజరైంది. ఈ కార్యక్రమంలో ఇందులో కీలక పాత్ర పోషించిన ఉదయభాను ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Also Read- Sree Vishnu: చిరంజీవికి ఫ్యాన్ కానీ వారెవరు? అంటూనే జర్నలిస్ట్‌కి శ్రీ విష్ణు ఝలక్!

తల్లిగా ఈ పాత్రకు బాగా కనెక్ట్ అయ్యా

Advertisement

ఈ సందర్భంగా ఉదయభాను మాట్లాడుతూ.. ‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’ సిరీస్ రిలీజ్ కోసం నేను ఎంతో ఎదురుచూస్తున్నాను. చాలా వేగంగా ఈ సిరీస్ షూటింగ్‌ను పూర్తి చేశాం. నేను ఇందులోని కథకు, క్యారెక్టర్‌కు బాగా కనెక్ట్ అయ్యాను. ఎందుకంటే, ఇందులో ఉన్న కంటెంట్ అందరికీ రిలేజ్ అయ్యేలా ఉంటుంది. నా తొలి రోజుల్లో జీ తెలుగు ఎంతో సపోర్ట్ చేసింది. ఈ ప్రయాణంలో సపోర్ట్ చేసిన జయంత్‌కు థాంక్స్. జీవితంలో ఎలాంటి సమస్య వచ్చిన శ్రీరామ్‌ సలహాలు తీసుకుంటూ ఉంటాను. శ్రీరామ్‌తో ఎన్నో ఏళ్ల నుంచి నాకు గొప్ప స్నేహబంధం ఉంది. ఇక సిరీస్ విషయానికి వస్తే.. పోలీస్ ఆఫీసర్ రోల్ చేయాలనే కోరిక నాకు ఎప్పటి నుంచో ఉండేది. ఆ కోరిక ఈ సిరీస్‌తో తీరింది. ఒక తల్లిగా ఈ పాత్రకు ఎంతో కనెక్ట్ అయ్యాను. ప్రతీ కుటుంబం, ప్రతీ పేరెంట్, ప్రతీ కూతురు చూడాల్సిన సిరీస్ ఇది. ఎందుకు నేను ఈ మాట చెబుతున్నాననో.. రేపు సిరీస్ చూసిన తర్వాత అందరికీ తెలుస్తుంది. ప్రస్తుత సమాజానికి ఈ సిరీస్ చాలా అవసరం. రాజీవ్ నాకు మంచి మిత్రుడు. వాసంతిక మంచి నటి. ఈ కథను గొప్పగా మలిచి, తెరకెక్కించిన కృష్ణ‌కు హ్యాట్సాఫ్. ఫిబ్రవరి 27 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కాబోతోంది. అందరూ తప్పకుండా చూడండని కోరారు.

Also Read- Ranveer Singh: కాంతారా సినిమా వల్ల.. కర్ణాటక హైకోర్టును ఆశ్రయించిన రణవీర్ సింగ్

మీటింగ్స్ షార్ట్‌గా.. సక్సెస్‌లు పెద్దగా!

Advertisement

జీ5 తెలుగు సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జయంత్ రాఘవన్ మాట్లాడుతూ.. జీ5 తెలుగులో ‘మన శంకర వర ప్రసాద్ గారు’ తర్వాత మళ్లీ ‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’ రాబోతోంది. దర్శకుడు కృష్ణ ముందుగా రెండు, మూడు పాత్రలతో లైన్ అనుకున్నారు. ఆ తర్వాత పూర్తి కథను సిద్ధం చేశాం. రాజీవ్ కనకాల, ఉదయ భాను ఇలా క్యాస్టింగ్ అంతా భారీగా సిద్ధం చేసుకున్నాం. ఇందులోని ఫాదర్ కారెక్టర్ నాకు ఎక్కువగా కనెక్ట్ అయింది. మహేష్ అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. ఈ సిరీస్‌లో శృతి మంచి డైలాగ్స్ రాశారు. కృష్ణతో మీటింగ్స్ షార్ట్‌గా ఉంటాయి కానీ సక్సెస్‌లు మాత్రం పెద్దగా ఉంటాయి. శ్రీరామ్‌కి జీ5తో ఎన్నో ఏళ్ల బంధం ఉంది. టాలెంట్ ఉన్న వారిని ఉదయ భాను ఎంకరేజ్ చేస్తూనే ఉంటారు. సిద్దు, కిరణ్మయి ఈ ప్రాజెక్ట్‌కి ఎంతో కష్టపడి పని చేశారు. ఫిబ్రవరి 27న ఈ సిరీస్ జీ5లో స్ట్రీమింగ్ కాబోతోంది. అందరినీ తప్పకుండా అలరిస్తుందని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో రాజీవ్ కనకాల, నిర్మాత కె.వి. శ్రీరామ్, దర్శకుడు కృష్ణ పోలూరుతో పాటు పలువురు మాట్లాడారు.

Also Read- Yash Toxic: యష్ ‘టాక్సిక్’ నుంచి మరో యాక్టర్ లుక్ విడుదల.. ఎవరో తెలుసా?

Related News

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

ఫ్రెండ్ లైఫ్ లోకి అమ్మాయి వచ్చిందనే ద్వేషంతో ఇదేం పని ? నిబ్బా నిబ్బీలు డోంట్ మిస్

Big Stories

Advertisement
×